కోవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఈ 5 ఆహారాలను తప్పక తీసుకోవాలి
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. ఈ సందర్భంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలియక ఇబ్బందిపడతారు. అలాంటివారు ఈ కింది ఆహారాలను తీసుకోవడం మంచిది.
కోవిడ్-19 వైరస్ దేశాన్ని ఇంకా వీడి వెళ్లలేదు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వ్యాక్సిన్ తీసుకొనే విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. ప్రస్తుతం ఇప్పటికి కేసులు తగ్గినట్లు కనిపిస్తున్నా.. కొన్ని రోజుల్లో మళ్లీ తారాస్థాయికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యం. అలాగే వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత తీసుకొనే ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే.. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని సైడ్ ఎఫెక్టులు వస్తాయి. తగిన న్యూట్రీషియన్ డైట్, బ్యాలెన్స్‌డ్ ఫుడ్ ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చు. దీనివల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
పచ్చని ఆకుకూరలు, కాయగూరలు తినాలి: పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం ఎప్పటికీ మంచిదే. ముఖ్యంగా పచ్చని ఆకుకూరలు, కాయగూరల్లో బోలెడంత శక్తిని అందిస్తాయి. నిర్జలీకరణ(డీహైడ్రేషన్)కు గురికాకుండా ఇవి కాపాడతాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని సైతం పెంచుతాయి. కాయగూరల్లో ఎక్కువగా రిచ్ యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, మెగ్నీషియం తదితర పోషకాలు కూడా ఉంటాయి.
పసుపు: ఇది ప్రకృతి ప్రసాదించిన సహజసిద్ధ ఔషదం. మన దేశంలో పసుపు లేని వంటే ఉండదు. గాయాలను సైతం మాన్పించే గుణం ఇందులో ఉంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు గాయాలను త్వరగా మానేలా చేస్తాయి. పసుపు కండరాలను సైతం రిలాక్స్‌గా ఉంచుతుంది. పసుపు ఒత్తిడిని దూరం చేస్తుంది. పాలు లేదా, కూరల్లో పసుపు వేసుకుని తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. వ్యాక్సిన్ వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు కూడా తగ్గుముఖం పడతాయి.
వెల్లులి: మన వంటకాల్లో వెల్లులి కూడా తప్పనిసరి. కూరలు, సూప్ లేదా మసాలా వంటకాల్లో వెల్లులి ఉండాల్సిదే. వెల్లులి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తపోటును తగ్గించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరంలో కొవ్వు స్థాయిలను అదుపులో ఉంచేందుకు సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచే ప్రొబయోటిక్స్ వెల్లులిలో ఎక్కువగా ఉంటుంది.
పండ్లు: ఫ్రూట్స్ ఎప్పటికీ ఆరోగ్యకరమైనవే. విటమిన్లు, ప్రోటీన్లను తీసుకొనేందుకు అత్యంత సహజమైన మార్గం పండ్లను తినడమే. అవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడతాయి. నిమ్మ, నారింజ, కివి వంటి సిట్రస్ పండ్ల రసాలు కూడా రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. వ్యాక్సిన్ తర్వాత వీటిలో ఏదైనా పండును తీసుకోవడం ద్వారా సైడ్ ఎఫెక్టుల సమస్య నుంచి త్వరగా కోలుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు తాగండి: టీకా తీసుకున్న తర్వాత విపరీతమైన దాహం వేస్తుంది. శరీరం నిర్జలీకరణకు గురవ్వుతుంది. కొబ్బరి నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు, ఆ తర్వాత హైడ్రేట్‌గా ఉండటం ముఖ్యం. కొబ్బరి నీరు రక్తపోటును నియంత్రించడానికి సహాయపడుతుంది. కొబ్బరినీటిలో విటమిన్లు, లవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్-సి, ఫాస్ఫరస్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. శరీరంలోని హానికరమైన విషతుల్యాలను తొలగించడానికి సహాయపడతాయి.
Also Read: ముంచుకొస్తున్న ‘మార్బర్గ్ వైరస్’.. కరోనా కంటే ప్రాణాంతకం, లక్షణాలివే!
Also Read: విటమిన్-డి లోపిస్తే చాలా డేంజర్.. ఈ లక్షణాలుంటే జాగ్రత్త!