News
News
X

Corona Live updates: దేశంలో మరింతగా తగ్గిన కరోనా కేసులు... డెల్టా వైరస్‌తో ప్రమాదం.. శాస్త్రవేత్తల హెచ్చరిక

కరోనా కేసులు తగ్గుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటల్లో నమోదైన కేసులు గతంతో పోలిస్తే చాలా తక్కువ నమోదయ్యాయి.

FOLLOW US: 
యూఏఈకి, భారత్ మధ్య మొదలైన విమాన సర్వీస్‌లు

భారత్, యూఏఈ మధ్య రాకపోకలు ఇవాళ్టి నుంచి మళ్లీ మొదలయ్యాయి. భారత్‌ నుంచి వచ్చే పర్యాటకులపై ఉన్న నిషేధం ఎత్తేవేయడంతో విమాన సర్వీసులు నడపనున్నారు. 

చెన్నై, కొచ్చీ, బెంగళూరు, త్రివేండ్రమ్, ఢిల్లీ నుంచి  అబుదాబీకి సర్వీసులు మొదలయ్యాయి. ఆగస్టు 10 నుంచి అహ్మదాబాద్, హైదరాబాగ్, ముంబయి నుంచి కూడా సర్వీసులు యూఏఈకి నడపనున్నారు. 

ఐదో తేదీ నుంచే షార్జా, దుబాయికి విమానాలు నడుస్తున్నాయి. రెండు విమానాలను నడుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ ఫెసిలిటీ ట్రాన్సిట్ పాసింజర్స్‌కు, యూఏఈ వాసులకు అవకాశం కల్పించారు. 

బిహార్‌లో కరోనా నిబంధనలు సడలింపు... కోచింగ్ సెంటర్‌లకు అనుమతి

బిహార్ ప్రభుత్వం కూడా కరోనా నిబంధనలు సడలించింది. మాల్స్‌, సినిమా హాల్స్‌, కోచింగ్ సెంటర్లు ఓపెన్ చేసుకునేందుకు ఛాన్స్ ఇచ్చింది. విద్యాసంస్థలు తెరుచుకునేందుకు కూడా అవకాశం ఇచ్చింది ప్రభుత్వం. 
షాపులు, మాల్స్‌, స్కూల్స్‌ సినిమా హాల్స్‌ సిబ్బంది అంతా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని... ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి వారు ఉంటే ఫుల్ స్టాఫ్‌తో పని చేసుకోవచ్చని తెలిపింది. వ్యాక్సిన్ వేసుకున్న వారి వివరాలు సమీపంలోని పోలీసు స్టేషన్‌లో ఇవ్వాలని కూడా సూచించింది ప్రభుత్వం

ఐజ్వాల్‌ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో లాక్‌డౌన్ ఎత్తివేత

కరోనా తగ్గుముఖ పట్టడంతో మిజోరాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐజ్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధించిన లాక్‌డౌన్ ఎత్తేసింది. పూర్తిగా అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇచ్చింది. 

పూర్తి లాక్‌డౌన్ వల్ల ఎకనామికల్ యాక్టివిటీస్ ఆగిపోయాయని... చాలా మంది పని లేక ఇబ్బంది పడుతున్నారని... అందుకే లాక్‌డౌన్ ఎత్తేశామంటున్నారు అధికారులు. జులై 18 నుంచి ఐజ్వాల్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ కొనసాగుతోంది. 

సీనియర్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీలతో సమావేశమైన డిప్యూటీ సీఎం... లాక్‌డౌన్ ఎత్తివేతపై నిర్ణయం తీసుకున్నారు. ఐజ్వాల్‌లో నేటి నుంచి లాక్‌డౌన్ ఎత్తేశారు. ప్రజలు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పాలకులు, అధికారులు, 

Corona Live updates: కర్ణాటకలో ఆగస్టు 16 రకు నైట్‌ కర్ఫ్యూ అమలు


కర్ణాటకలో రోజూ 15వందల వరకు కేసులు నమోదవుతున్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ఇవాల్టి నుంచి ఆగస్టు 16వరకు రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపారు అధికారులు. ఈ నైట్ కర్ఫ్యూ కారణంగా మెట్రో రైళ్ల టైమింగ్స్‌ మార్చింది అక్కడి మెట్రో రైల్వే బోర్డు. రాత్రి 8 గంటల వరకే మెట్రో ట్రైన్స్‌ తిరుగుతాయని చెప్పింది. 

Background

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం గత రెండు నెలలుగా స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 36,628 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ మహమ్మారితో పోరాడుతూ మరో 617 మంది చనిపోయారు. అదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 40, 017 మంది కోలుకున్నారని వైద్యారోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో వివరించింది. 

సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పడుతున్నట్టే కనిపిస్తోందని... అయితే థర్డ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో మొత్తగా 3.18 కోట్ల (3,18,95,385) మంది కరోనా బారిన పడగా.... అందులో నాలుగు లక్షల 27వేల 371 మంది చనిపోయారు. వైరస్ బారిన పడినా ఇప్పటివరకూ 3,10,55,861 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 4,12,153 యాక్టివ్‌ కరోనా కేసులున్నాయి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల్లో ఇవి 1.30శాతంగా ఉన్నాయి. ఈ లెక్కల ప్రకారం రికవరీ రేటు 97.36 శాతం ఉంది. 

వ్యాక్సినేషన్ కూడా జోరుగా సాగుతున్నట్టు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. సుమారు 50కోట్ల మందికి వ్యాక్సిన్ వేసినట్టు ప్రకటించింది.