Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్న కరోనా ఉద్ధృతి, తాజాగా 1679 కేసులు నమోదు
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులతోపాటు పాజిటివిటీ రేటు కూడా తగ్గుతోంది. రెండు రోజులుగా రెండు వేల లోపు కేసులు నమోదవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఇరవై నాలుగు గంటల్లో 1679 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ఎక్కువ కేసులు తూర్పుగోదావరి జిల్లాలో నమోదయ్యాయి. అక్కడ 350 కేసులు కొత్తగా వెలుగు చూశాయి. తర్వాత స్థానంలో గుంటూరు జిల్లా ఉంది. అక్కడ 212 కేసులు రిజిస్టర్ అయ్యాయి. తర్వాత విశాఖ 128, చిత్తూరు జిల్లాలో 102, శ్రీకాకుళం జిల్లాలో 22, విజయనగరంలో 11 కేసులు నమోదుయ్యాయి.
#COVIDUpdates: As on 8th February, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022
COVID Positives: 23,06,943
Discharged: 22,38,226
Deceased: 14,677
Active Cases: 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/MT2un5N3Q5
27,522 సాంపిల్స్‌ని పరీక్షించగా పదహారు వందల కేసులు వెలుగు చూశాయి. కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 9, 598మంది కరోనా నుంచి కోలుకున్నారు.
ఇప్పటి వరకు 3,27, 33, 046 సాంపిల్స్ పరీక్షించారు. ప్రస్తుతం ఏపీలో 46,119 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యధికంగా యాక్టివ్ కేసులు ప్రకాశం జిల్లాలో ఉన్నాయి. అక్కడ 13731 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
#COVIDUpdates: 08/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 8, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,06,943 పాజిటివ్ కేసు లకు గాను
*22,38,226 మంది డిశ్చార్జ్ కాగా
*14,677 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 54,040#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/b3SCJI4jps
ఆంధ్రప్రదేశ్‌లో 7 రోజులుగా పాజిటివిటీ రేటు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
08-02-22 - 07.21%
07-02-22 - 08.58%
06-02-22 - 09.41%
05-02-22 - 11.38%
04-02-22 - 13.59%
03-02-22 - 15.06%
02-02-22 - 17.07%