Coconut Water: ఈ వేసవిలో కొబ్బరి నీళ్లే దివ్యౌషదం, ఈ ప్రయోజనాలు తెలిస్తే ఔరా అనాల్సిందే!
కొబ్బరి నీటిని తక్కువ అంచనా వేయకండి. వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఎక్కువ మేలు చేసేది కొబ్బరి నీరే. కాబట్టి, చల్లని నీటికి బదులు, చక్కగా కోకోనట్ వాటర్ తాగండి.
Coconut Water Benefits | వేసవి కాలం రాగానే చల్లగా ఏదైనా తాగితే బాగుంటుంది అనిపిస్తుంది. దీంతో చాలామంది కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు. అయితే, కూల్ డ్రింక్స్ తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. ఆ తర్వాత ఎన్నో సమస్యలను తెచ్చిపెడతాయి. కానీ, కొబ్బరి నీళ్లు(Coconut Water) దప్పిక నుంచి ఉపశమనం కలిగించడమే కాదు. నిర్జలీకరణ (dehydration) నుంచి కూడా కాపాడుతుంది. శరీరానికి ఇంకా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. ప్రపంచ ప్రఖ్యాత ఆసుపత్రి క్వీల్‌ల్యాండ్ క్లినిక్.. కొబ్బరి నీరు చేసే మేలు మరే పానీయం చేయదని పేర్కొంది. మీకు దాహం వేసినప్పుడు కొబ్బరి నీటిని మాత్రమే తాగాలని సూచించింది. ఎందుకంటే, ఈ పానీయంలో సహజ విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి హైడ్రేషన్‌కు సహాయపడతాయి. మరి కొబ్బరి నీళ్ల(Coconut Water)లో ఉండే పోషకాలు ఏమిటీ? వాటి వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగుతుంది తదితర వివరాలను తెలుసుకుందామా.
కొబ్బరి నీళ్లు(Coconut Water) తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
⦿ వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా ఉండాలంటే కొబ్బరి నీరు(Coconut Water) తాగాలి.
⦿ గుండెలో మంట, మలబద్దం, జీర్ణ సమస్యలు ఉంటే కొబ్బరి నీరు తాగండి.
⦿ నీళ్లలోనైనా కల్తీ ఉంటుందేమో, కానీ కొబ్బరి నీళ్లలో మాత్రం కల్తీ ఉండదు. నూటికి నూరుపాళ్లు స్వచ్ఛమైన నీరు కొబ్బరి నీరు.
⦿ కొబ్బరి నీటిలో ఉండే పొటాషియం, సోడియం ఆల్కలైన్ సమతుల్యతను క్రమబద్ధీకరించి రక్తపోటును తగ్గిస్తుంది.
⦿ కొబ్బరి నీరు(Coconut Water) తాగేవారిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్ల సమస్యలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
⦿ కొబ్బరి నీటిలో క్యాలరీలు తక్కువ. ఇది కొవ్వులు, కొలెస్ట్రాల్ లేని పానీయం. రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది.
⦿ కొబ్బరి నీరు తల్లి పాలల్లో లారిక్ యాసిడ్ పెంచుతుంది. అది అనేక ఇన్ఫెక్షన్ల నుంచి పిల్లలను కాపాడుతుంది.
⦿ కోకోనట్ వాటర్‌లో ఉండే సహజ ఎలక్ట్రోలైట్ మిమ్మల్ని రిఫ్రెష్‌గా, హైడ్రేట్‌గా ఉంచుతుంది.
⦿ కొబ్బరి నీటిలో ఎన్నో ఖనిజాలు ఉంటాయి. అవి అనేక రోగాలకు ఔషదంగా పనిచేస్తాయి.
⦿ కొబ్బరి నీరు(Coconut Water)లోని యాంటిఆక్సిడెంట్స్.. ఎసిటమైనోఫెన్-ప్రేరిత కాలేయ నష్టాన్ని తగ్గిస్తుంది.
⦿ కొబ్బరి నీరు వల్ల గుండె సమస్యలు కూడా దరిచేరవు.
⦿ నిద్రపోయే ముందు కొబ్బరి నీటిని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయట.
⦿ డయేరియాతో ఇబ్బంది పడే పిల్లలకు డీహైడ్రేషన్ కాకుండా కొబ్బరి నీళ్లు ఇవ్వాలి.
⦿ కొబ్బరి నీరు డయాబెటిస్(Diabetes) బాధితుల్లో సుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది. కానీ, తక్కువ మోతాదులో తాగితేనే మంచిది.
⦿ కోకోనట్ వాటర్ తాగితే మెగ్నిషియం, క్యాల్షియం, పొటాషియం, సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి.
⦿ శరీరం సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి బయటపడాలంటే కొబ్బరి నీరు తాగడమే ఉత్తమం.
⦿ లేత కొబ్బరి నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.
⦿ కొబ్బరి నీటిలోని కాల్షియం ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి.
⦿ కొబ్బరి నీరు(Coconut Water) కండరాల బలోపేతం చేస్తాయి.
⦿ వేసవిలో పండ్ల రసాలకు బదులు కొబ్బరి నీరు తీసుకోవడమే ఉత్తమం.
⦿ కొబ్బరి నీరు రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
⦿ కోకోనట్ వాటర్(Coconut Water) శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
కొబ్బరి నీరు(Coconut Water) ఎవరు తాగకూడదు?
⦿ మీకు అధిక రక్తపోటు లేదా ఇతర అనారోగ్యాలు ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుడి సలహా తీసుకోవాలి. ఎందుకంటే అధిక రక్తపోటు ఉన్నవారిలో కొబ్బరి నీరు రక్తపోటును తగ్గించవచ్చని ప్రాథమిక పరిశోధనలు తెలుపుతున్నాయి. ఒక వేళ మీరు ఇప్పటికే రక్తపోటు మందులు తీసుకుంటున్నట్లయితే కొబ్బరి నీళ్ల వల్ల సమస్యలు రావచ్చు. రక్తపోటు మరీ తగ్గినా సమస్యే. కాబట్టి, వైద్యుడి సూచన లేకుండా కొబ్బరి నీళ్లను తాగొద్దు.
Also Read: డయాబెటీస్ సెక్స్‌పై ప్రభావం చూపుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
⦿ మీకు వారం రోజుల్లో ఏదైనా శస్త్ర చికిత్స లేదా సర్జరీ ఉన్నట్లయితే కొబ్బరి నీరు తాగొద్దు. కొబ్బరి నీటిలో ఉండే అధిక పోటాషియం రక్తంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి సర్జరీకి ముందు కొబ్బరి నీటిని తాగకపోవడమే ఉత్తమం అని క్లీవ్‌ల్యాండ్ క్లీనిక్ చెబుతోంది.
⦿ దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి ఉన్నవారు లేదా ACE ఇన్హిబిటర్లను తీసుకునే వారు కూడా కొబ్బరి నీటికి దూరంగా ఉండాలి.
Also Read: మగాళ్లు జాగ్రత్త! మొబైల్ అతిగా వాడితే ‘అది’ మటాష్, షాకింగ్ న్యూస్ చెప్పిన నిపుణులు