News
News
X

Black Tea: బ్లాక్ టీ రోజూ తాగే అలవాటు ఉందా? జాగ్రత్త, గుండె ఆగిపోయే ప్రమాదం ఎక్కువ

టీ, కాఫీ... ఇలాగే బ్లాక్ టీ కూడా ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే పానీయం.

FOLLOW US: 
Share:

పరగడుపున తాగే పానీయాల్లో బ్లాక్ టీ కూడా ఒకటి. దీన్ని వినియోగిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉంది.  కామెల్లియా సినేన్సిస్ అనే మొక్క ఆకులతో ఈ బ్లాక్ టీని తయారు చేస్తారు. రుచి కోసం ఇతర మొక్కల సమ్మేళనాలను కూడా కలుపుతారు. చూడడానికి నల్లగా ఉండే ఈ టీ... డికాషన్‌లా కనిపిస్తుంది. దీనిలో కెఫిన్ కూడా ఉంటుంది. రోజుకి ఒక బ్లాక్ టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిదే. కానీ అధికంగా తాగితే మాత్రం అనారోగ్యాలు తప్పవు. యాంటీ ఆక్సిడెంట్లు, ఇన్ఫ్లమేషన్ తగ్గించే గుణంతో ఉండే బ్లాక్ టీ మితంగా తీసుకోవడమే మంచిది.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం బ్లాక్ టీ అధికంగా తాగితే అందులో ఉండే కెఫిన్ ఆరోగ్యానికి చేటు చేస్తుంది. తేలికపాటి నుంచి తీవ్రస్థాయి వరకు తలనొప్పిని కలిగిస్తుంది. అలాగే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. గుండె కొట్టుకునే వేగాన్ని అసాధారణంగా మార్చుతుంది.

ఈ బ్లాక్ టీ టానిన్లతో నిండుగా ఉంటుంది. శరీరంలో ఈ టానిన్లు అధికంగా చేరితే ఇనుము శోషణను అడ్డుకునే అవకాశం ఉంది. దీనివల్ల ఇనుము లోపం ఏర్పడి రక్తహీనతకు కారణం అవుతుంది. రక్తహీనత వల్ల అనేక మానసిక, శారీరక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. గుండె లేదా ఊపిరితిత్తుల ప్రభావితం చేసే అవకాశం కూడా ఎక్కువ. గుండె కొట్టుకునే వేగం పెరగడం లేదా వైఫల్యం 
చెందడం వంటివి జరగవచ్చు. గుండె ఒత్తిడికి గురై శరీరానికి తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోవచ్చు.

బ్లాక్ టీ వల్ల పొట్టలో తిమ్మిరి, గ్యాస్ ట్రబుల్స్, వికారం, వాంతులు వంటి ఇతర జీర్ణాశయాంతర రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.

ఆరోగ్య నిపుణులు చెబుతున్న ప్రకారం 10 గ్రాముల కంటే ఎక్కువ కెఫీన్ ఉన్న బ్లాక్ టీని తాగడం సురక్షితం కాదు. కెఫీన్ శరీరాన్ని ఉత్తేజపరిచే లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ దీని అధిక వినియోగం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అధిక కెఫిన్ శరీరంలో చేరితే భయము, వణుకు, తలనొప్పి, గుండె దడ, నిద్రలేమి వంటి సమస్యలు త్వరగా వచ్చే అవకాశం ఉంది.

బ్లాక్ టీని రోజులో రెండు మూడు సార్లు తాగితే మీ దంతాల రంగు కూడా మారిపోవచ్చు. దంతాలపై పసుపు రంగు మరకలు పడవచ్చు.

బ్లాక్ టీ మితంగా, అప్పుడప్పుడు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎముకలు బలంగా మారతాయి. ఫ్లూ, జ్వరం వంటివి రాకుండా ఉంటాయి. డీహైడ్రేషన్ సమస్యను కూడా ఇది దూరం చేస్తుంది. కాబట్టి రెండు రోజుకోసారి బ్లాక్ టీ తాగితే మంచిది.

Also read: పరిశుభ్రమైన పానీపూరి తింటే కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 15 Mar 2023 11:43 AM (IST) Tags: Black Tea Black Tea Benefits Black Tea Heart problems

సంబంధిత కథనాలు

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

World Tuberculosis Day: క్షయ వ్యాధి లక్షణాలేమిటీ? ఎవరికి ఎక్కువ ప్రమాదం?

టాప్ స్టోరీస్

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

YS Sharmila: టీఎస్‌పీఎస్సీ కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత, వైఎస్ షర్మిల అరెస్టు

Seediri Appalraju : సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి అత్యవసర పిలుపు - ఏం జరుగుతోంది ?

Seediri Appalraju :  సీదిరి అప్పలరాజుకు సీఎంవో నుంచి అత్యవసర పిలుపు -  ఏం జరుగుతోంది ?

నాటు నాటు పాట కోసం 19 నెలలు - చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

నాటు నాటు  పాట కోసం 19 నెలలు -  చంద్రబోస్ చెప్పిన సీక్రెట్స్

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?

TSPSC పేపర్ లీకేజీలో మొత్తం హవాలా మార్గమేనా?  నిందితులు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపారు?