News
News
X

Panipuri: పరిశుభ్రమైన పానీపూరి తింటే కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

పానీపూరి తినడం వల్ల అన్ని నష్టాలే అని ఎన్నో వార్తలు వచ్చాయి, కానీ వాటిని తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

FOLLOW US: 
Share:

మనం పానీ పూరి అని పిలిస్తే, ఉత్తర భారతీయులు గోల్ గప్పే అని పిలుస్తారు. ఇది మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. సాయంత్రం పూట అలా బయటికి వెళ్లిన వాళ్లలో సగం మంది దీన్ని తినే ఇంటికి వస్తారు. రుచి కూడా అదిరిపోతుంది కాబట్టి అభిమానులు ఎక్కువే. ఉడికించిన బంగాళాదుంపలు, పుదీనా నీటితో ఆ రుచి నాలుకకు తెగ నచ్చేస్తుంది. ఏ కాలంలో అయినా పానీపూరి ప్రజాదరణ ఏమాత్రం తగ్గదు. అయితే ఈ పానీపూరి వల్ల రోగాల బారిన పడుతున్నట్టు ఎన్నో వార్తలు వచ్చాయి. దానికి కారణం అపరిశుభ్ర వాతావరణంలో వాటిని అమ్మడం లేదా తయారు చేయడం.  పానీపూరి తో పాటూ ఇచ్చే పుదీనా నీటిలో మంచి నీళ్లు కలపకుండా, అపరిశుభ్రమైనవి కలపవడం వల్ల అంటురోగాలు వచ్చే అవకాశం ఉంది. కానీ పరిశుభ్రమైన వాతావరణంలో వాటిని వండి తింటే వాటి వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పానీపూరిని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేసుకొని తినడం వల్ల పరిశుభ్రంగా కూడా ఉంటుంది. వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకోండి.

పానీ పూరి తయారీలో గోధుమపిండి, గోధుమ రవ్వ, ఉడికించిన బంగాళదుంపలు, పుదీనా ఆకులు, ఉడికించిన శనగలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, చింతపండు రసం, ఉప్పు, కారం, మామిడికాయ పొడి వాడతారు. ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి అవసరమైనవి.

1. పానీపూరి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. గోధుమలు, రవ్వ, చిక్ పీస్, బంగాళాదుంపలు వంటివి జీర్ణవ్యవస్థను కాపాడతాయి. వీటిలో పిండి పదార్థాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. 

2. పానీ పూరిలో వాడేవి నీళ్లు, ఉడికించిన పదార్థాలే. ఈ రెండు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి తినడం వల్ల శరీరానికి అందే కేలరీలు కూడా తక్కువే. కాబట్టి బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయపడతాయి.

3. ఎసిడిటీ సమస్య ఉన్నవారు పానీపూరీలను తినడం వల్ల మంచే జరుగుతుంది. ఇందులో అల్లం, పుదీనా, కొత్తిమీర, నల్ల ఉప్పు, జీలకర్ర, కొన్నిసార్లు నల్ల మిరియాలు వంటివి కూడా వాడతారు. ఇవన్నీ  కడుపు నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి.

4. వీటిలో వాడే పుదీనా ఆకుల రసం శరీరంపై ప్రభావాన్ని చూపిస్తుంది. నోటి సమస్యలకు, నోటి పొక్కులకు చికిత్స చేస్తుంది.

5. మధుమేహం ఉన్నవారు పానీపూరిని తినవచ్చు. వీటిలో కార్బోహైడ్రేట్లు తక్కువగానే ఉంటాయి. తిన్నాక కడుపు నిండిన భావన ఇస్తాయి. కాబట్టి మధుమేహ రోగులు అప్పుడప్పుడు వీటిని తినవచ్చు. 

Also read: మండే ఎండల్లో గుండె జాగ్రత్త - గుండెపోటు కేసులు పెరిగే అవకాశం

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 15 Mar 2023 08:53 AM (IST) Tags: Golgappa Panipuri Health benefits of Panipuri Panipuri Uses

సంబంధిత కథనాలు

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Mushrooms: ఈ పుట్టగొడుగును తింటే చికెన్ కర్రీ తిన్నట్టే ఉంటుంది, ఎక్కడైనా కనిపిస్తే వదలకండి

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

Energy Drinks: ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా? ఇక మిమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి, ఎందుకంటే?

Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

Acidity: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని

పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలకు కారణం పెద్దలేనట - ఫోన్ స్క్రీన్స్‌తో ప్రాణహాని

టాప్ స్టోరీస్

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

Etela Rajender: ఇది మహిళలు చేసే వ్యాపారమా! టూ బ్యాడ్‌ థింగ్‌ కేసీఆర్: లిక్కర్ కేసుపై ఈటల

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

UPW-W vs DC-W, Match Highlights: క్యాప్సీ కేక! యూపీపై గెలుపుతో WPL ఫైనల్‌కు దిల్లీ క్యాపిటల్స్‌!

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా