By: ABP Desam | Updated at : 17 Dec 2022 03:46 PM (IST)
Edited By: Bhavani
Representational Image/Pixabay
ఆరోగ్యం ఆధారపడి ఉండేది ముఖ్యంగా మూడు విషయాల మీద ఒకటి భోజనం, రెండోది విశ్రాంతి, మూడోది వ్యాయామం. ఈ మూడు అంశాలు సరిగ్గా ఉంటే పెద్దగా వేధించే అనారోగ్యాలు తక్కువ.
చురుగ్గా ఉండేందుకు కేవలం తినే భోజనం మాత్రమే కాదు, తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా శ్రద్ధ పెట్టాలని ఆయుర్వేదం చెబుతోంది. మనదేశానికి చెందిన పురాతనమైన శతపవ్లి అనే ఒక కాన్సెప్ట్ ఉంది. దీని ప్రకారం భోంచేశాక షికారుకు వెళ్లమని చెబుతున్నారు. అలాగే భోజనం తర్వాత 100 అడుగులు నడవాలనే సూచన కూడా ఉంది. దీనిని షట్పావళి అంటారు. నితికా కోహ్లీ అనే ఆయుర్వేద డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీనిపై పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
పూర్వకాలం నుంచి జీర్ణక్రియకు తోడ్పడే మంచి అలవాటుగా షట్పావళి రుజువైంది. భోజనం చేసిన తర్వాత 100 అడుగుల దూరం నడవడం జీర్ణవ్యవస్థకు చక్కని అలవాటుగా పరిణమిస్తుందని నితికా కోహ్లీ అంటున్నారు. వాకింగ్ లేదా జాగింగ్ శరీరాన్ని ఫిట్ గా ఉంచే మంచి వ్యాయామంగా నిపుణులు చెబుతున్నారు. కేవలం ఫిట్ గా ఉండడం బరువు అదుపులో పెట్టుకోవడం మాత్రమే కాదు ఇది జీర్ణవ్యవస్థను కూడా క్రమశిక్షణలో ఉంచుతుంది. భోజనం తర్వాత వంద అడుగులు నడవడం వల్ల కలిగే లాభాల గురించి మరో ఆయుర్వేద నిపుణులు డాక్టర్ శ్రీవాస్తవ వివరించారు
డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు భోజనం తర్వాత చిన్నగా నడిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉన్నట్టు స్పోర్ట్స్ మెడిసిన్ అనే జర్నల్ లో పేర్కొన్నారు. ఆయుర్వేదంలో సూచించిన ఈ పురాతన చిట్కా శట్పావళి చాలా ప్రయోజనకర ప్రక్రియ. భోజనం తర్వాత నిద్రపోయే అలవాటు ఉంటుంది చాలా మందిలో. అది శరీరంలో కఫం, కొవ్వు పెరగడానికి కారణం అవుతుంది. అంతేకాదు జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగడం కూడా జర్ణక్రియ నెమ్మదించడానికి కారణం కావచ్చని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అంతేకాదు ఈ అలవాటు బరువు పెరగడానికి కూడా కారణం అవుతుందట. భోజన సమయంలో లేదా భోజనం తర్వాత వెంటనే నీళ్లు తాగకూడదు. రెండు భోజనాల విరామ సమయంలోనే నీళ్లు తాగడం మంచిదనేది నిపుణుల సూచన.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం
Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?
Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి
Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు
Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్
MLA Kethireddy: ఆధిపత్యం కోసం జేసీ బ్రదర్స్ హత్యలు చేయించారు: ఎమ్మెల్యే కేతిరెడ్డి సంచలనం
Jagan Flight : జగన్ విమానం గాల్లోకి లేచిన కాసేపటికి వెనక్కి - సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ !
Ileana: ఆస్పత్రి పాలైన నటి ఇలియానా - ఏం అయింది?
BJP Govt: మోడీ సర్కార్కు షాక్ ఇచ్చిన సర్వే, ఆరేళ్లలో పెరిగిన అసంతృప్తి!