Clove Water : లవంగాల నీరు 10 రోజులు తాగితే కలిగే ప్రయోజనాలు.. డైటీషియన్ ఇస్తోన్న సూచనలు
Benefits of Clove Water : లవంగాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వివిధ ప్రయోజనాలు ఇస్తాయి. అయితే ఈ లవంగాలతో చేసే నీటిని 10 రోజులు తాగితే ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చంటున్నారు డైటీషియన్స్.

Clove Water Benefits : లవంగాల నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది చెబుతున్నారు. సోషల్ మీడియాలో దీనిగురించిన వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి. అయితే కొందరు దీనిని ట్రెండ్‌లా భావించినా.. నిజానికి ఇది బేసిక్ బయోకెమిస్ట్రీ ఆధారంగా పనిచేస్తుందని చెప్తున్నారు డైటీషియన్ nmamiagarwal. ఈమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో లవంగాల నీరు 10 రోజులు కలిగితే లాభాల గురించి పలు ఆరోగ్యకరమైన విషయాలు వెల్లడించారు.
లవంగాల్లో సహజంగా ఉండే యూజినాల్ (Eugenol) అనే శక్తివంతమైన పదార్థం వాపును తగ్గించే గుణాలు కలిగి ఉంటుందని తెలిపారు. బ్యాక్టీరియా, వైరస్‌లను ఎదుర్కొనే లక్షణాలతో పాటు యాంటీఆక్సిడెంట్ ప్రభావం కలిగి ఉంటుందని వెల్లడించారు. అయితే 10 రోజులు ఉదయాన్నే లవంగాల నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు ఆమె వీడియోలో వివరించారు. అవేంటో ఇప్పుడు చూసేద్దాం.
View this post on Instagram
లవంగాల నీరు తాగితే కలిగే లాభాలు
లవంగాల నీటిని సరిగ్గా 10 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో మెల్లగా కొన్ని మార్పులు కనిపిస్తాయని తెలిపారు మామి అగర్వాల్. అవేంటంటే..
జీర్ణక్రియకై..
లవంగాల నీరు కడుపులో గ్యాస్, ఉబ్బరం తగ్గించడంలో సహాయపడుతుంది. జీర్ణ రసాల స్రావాన్ని ప్రోత్సహించి.. ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
శ్వాస సంబంధిత సమస్యలు
లవంగాల్లోని యాంటీ మైక్రోబియల్ లక్షణాలు గొంతు, శ్వాస మార్గాలకు హాయిగా ఉంటాయి. దగ్గు, శ్వాస తీసుకోవడంలో అసౌకర్యం తగ్గే అవకాశం ఉంటుంది.
చర్మ ఆరోగ్యానికై
శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మొటిమలు, చర్మ మసకబారడం కొంతవరకు తగ్గుతుంది.
మానసిక ప్రశాంతత
లవంగాల నీరు నరాలపై సాఫ్ట్‌గా పనిచేస్తుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గి, మనసు ప్రశాంతంగా మారుతుంది. ఫలితంగా నిద్ర నాణ్యత మెరుగవుతుంది.
లవంగాల నీరు 10 రోజులు తాగితే ఇన్ని మార్పులు శరీరంలో చూడవచ్చు. సింపుల్‌గా, మితంగా, నియమంగా తీసుకుంటే చాలని చెప్తున్నారు. రాత్రుళ్లు 2–3 లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి నానబెట్టాలి. ఉదయం వడకట్టి గోరువెచ్చని నీటితో తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే మంచి ఫలితం ఉంటుంది. సరైన మోతాదులో కొన్ని రోజులు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచి ఫలితాలు చూడవచ్చు.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
























