By: Haritha | Updated at : 20 Dec 2022 11:18 AM (IST)
(Image credit: Pixabay)
చల్లని వాతావరణంలో కఫం త్వరగా పట్టేసింది. దాని వల్ల గొంతులో ఇబ్బంది,ముక్కు దిబ్బడ, ఒక్కోసారి ఆయాసంలా రావడం జరుగుతుంది. చల్లని వాతావరణంలో బ్యాక్టిరియాలు, ఇన్ఫెక్లన్లు త్వరగా సోకుతాయి. దాని వల్లే సమస్యలు మొదలవుతాయి. కఫం ఎక్కువైతే జ్వరం కూడా వస్తుంది. అందుకే చలికాలం మొదలైందంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆయుర్వేదంలో కఫాన్ని విరిచే మందులు ఉన్నాయి. ఇవన్నీ మన వంటింట్లో దొరికేవే.
ఏం చేయాలి?
ఇంగ్లిషు మందులు వాడకుండా ఆయుర్వేదంలో చెప్పిన విధంగా కఫాన్ని తగ్గించుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సింది మొదట ఉపవాసం. రోజులో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఆహారం తీసుకోవాలి. తరచూ గోరు తేనె నీటిని వేసుకుని తాగుతూ ఉండాలి. ఇలా ఉపవాసం చేస్తే తేనె నీటిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి. తేనె నీరు అనగానే నీటిలో తేనె వేసుకుని తాగడం అనుకోకండి. గోరువెచ్చని నీళు తీసుకుని అందులో చిటికెడు మిరియాల పొడి, చిటికెడు యాలకుల పొడి వేయాలి. అందులో ఆరు నుంచి ఏడు స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. దీన్ని జలుబు, దగ్గు, కఫం వేధిస్తున్నప్పుడు రోజులో నాలుగైదు సార్లు తీసుకోవాలి. ఆహారం మాత్రం తక్కువ తీసుకోవాలి. ఇలా తాగినప్పడు ఊపిరితిత్తులో, గొంతులో కఫం పలుచగా మారుతుంది. ముక్కు ద్వారా లేదా నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది.
పిల్లలకు కూడా...
ఈ తేనె నీటిని పిల్లలకు కూడా తాగించవచ్చు. అలాగే వారికి నిమ్మరసం కూడా కలిపి ఇస్తే చాలా మంచిది. కఫం పట్టినప్పుడు, జలుబు చేసినప్పుడు కొబ్బరి నీళ్లను దూరం పెట్టాలి. ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది. అలాగని శరీరం నీరసిస్తుంది అనుకోవద్దు. మధ్య మధ్యలో తాగే తేనె నీరు శక్తిని కూడా అందిస్తుంది. దీని వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరిగి బ్యాక్టిరియాలతో పోరాడే శక్తి వస్తుంది. పిల్లలకు దగ్గు సిరప్‌కు బదులు ఇలా తేనె, యాలకుల పొడి, మిరియాల పొడి కూడా వేసి కలుపుకుని తాగితే చాలా మంచిది. కఫం పట్టే వరకు ఆగకుండా చలికాలం రాగానే ఈ తేనె నీటిని తాగుతూ ఉండాలి. వానా కాలంలో కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. రోగాలను తట్టుకునే శక్తిని అందిస్తుంది.
Also Read: ఈ పోషకలోపంతో హైబీపీ వచ్చే అవకాశం, రాకుండా ఉండాలంటే తినాల్సినవి ఇవే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
కడుపులో మంటగా ఉందా? ఈ ఆయుర్వేద చిట్కాలతో వెంటనే ఉపశమనం
Triphala Churnam: త్రిఫల చూర్ణం తీసుకుంటే అందం, ఆరోగ్యం- దాన్ని ఎలా తీసుకోవాలంటే?
Belly Fat: పొట్ట దగ్గర కొవ్వు కరగడం లేదా? ఈ ఆయుర్వేద మార్గాలు ట్రై చేసి చూడండి
Stomach Bloating: పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? భోజనం చేసిన తర్వాత ఇలా చేస్తే ఆ సమస్య ఉండదు
Water: నిలబడి నీళ్ళు తాగుతున్నారా? అలా అసలు చేయొద్దు, ఈ సమస్యలు వేధిస్తాయ్
CM KCR Nanded Tour: నేడే నాందేడ్‌లో BRS సభ, సీఎం కేసీఆర్ టూర్ పూర్తి షెడ్యూల్ ఇదీ
Prabhas Mahesh Akhil : 'పోకిరి', 'బాహుబలి' మేజిక్ రిపీట్ అవుతుందా? - ఇండస్ట్రీ హిట్ మీద కన్నేసిన అఖిల్
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్ - 'ఖుషి' ఖుషీగా...