అన్వేషించండి

Amritsar Airport COVID Cases: ఇటలీ నుంచి వచ్చిన వారందరికీ కొవిడ్ ఉందా? లేదా? అంతా గందరగోళం!

ఇటలీ నుంచి అమృత్‌సర్ వచ్చిన ప్రయాణికుల్లో చాలా మందికి కొవిడ్ పాజిటివ్ రావడంతో టెస్టులు చేసిన ల్యాబ్‌పై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు.

పంజాబ్ అమృత్‌సర్‌లోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌బై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఇటలీ నుంచి వచ్చిన ప్రయాణికులకు ఇక్కడ కొవిడ్ పరీక్షలు నిర్వహించగా చాలా మందికి కొవిడ్ పాజిటివ్‌ రావడమే ఇందుకు కారణం. ఇక్కడ కొవిడ్ పరీక్షల ఫలితాలు తప్పుగా ఇస్తున్నట్లు పలువురు ప్రయాణికులు ఆరోగ్యాధికారులకు ఫిర్యాదు చేశారు.

దిల్లీకి చెందిన ఓ ల్యాబోరేటరీ స్థానంలో స్థానిక ల్యాబ్‌కు కొవిడ్ పరీక్షల నిర్వహణకు అవకాశం ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ ల్యాబ్ ఇచ్చిన ఫలితాలపై గందరగోళం నెలకొంది.

పాజిటివ్ ఎలా?

ఇటలీ నుంచి విమానం బయలుదేరే కొద్ది గంటల ముందు చేసిన పరీక్షల్లో తమకు నెగెటివ్ రాగా అమృత్‌సర్‌లో దిగిన తర్వాత పాజిటివ్ వచ్చినట్లు చాలా మంది ప్రయాణికులు తెలిపారు. దీంతో ఈ కొవిడ్ రిపోర్ట్ తప్పని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ల్యాబ్ టెస్టింగ్ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాజిటివ్ వచ్చిన చాలా మంది ప్రయాణికులకు రీ టెస్ట్ నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

రెండు రోజుల్లో..

శనివారం ఇటలీ నుంచి పంజాబ్ అమృత్‌సర్‌ వచ్చిన విమానంలో 173 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ వచ్చింది. శుక్రవారం ఇటలీ నుంచే వచ్చిన ఓ విమానంలో 125 మందికి కొవిడ్ నిర్ధారణైంది.

రోమ్ నుంచి అమృత్‌సర్‌లోని శ్రీ గురు రామ్‌దాస్ విమానాశ్రయానికి వచ్చిన విమానంలో మొత్తం 285 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరికి పరీక్షలు చేయగా 173 మందికి కొవిడ్ ఉన్నట్లు తేలింది. వీరందరినీ నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులకు తరలించినట్లు అధికారులు తెలిపారు. 

టెస్టులు పక్కా..

హై రిస్క్ దేశాల జాబితా నుంచి భారత్ వచ్చేవారికి ఎయిర్‌పోర్ట్‌లో కొవిడ్ పరీక్షలు తప్పనిసరి చేసింది కేంద్రం. ఆ జాబితాలో ఐరోపా దేశమైన ఇటలీ కూడా ఉంది. దీంతో అమృత్‌సర్‌ వచ్చిన వీరందరికీ కొవిడ్ పరీక్షలు నిర్వహించారు.

దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఒమిక్రాన్, కొవిడ్ వ్యాప్తి ఉద్ధృతంగా ఉంది.

Amritsar Airport COVID Cases: ఇటలీ నుంచి వచ్చిన వారందరికీ కొవిడ్ ఉందా? లేదా? అంతా గందరగోళం!

దీంతో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కరోనా పరిస్థితులపై సమీక్ష జరిగింది.

Also Read: PM Modi Chairs Covid Meeting: కొవిడ్ ఉద్ధృతిపై ప్రధాని మోదీ సమీక్ష.. వారికి ఇక వర్క్ ఫ్రం హోం

Also Read: Covid 19 3rd Wave: భయంకరంగా కరోనా థర్డ్ వేవ్.. దేశంలో రోజుకు 10 లక్షల కేసులు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget