Carrot: రోజుకో క్యారెట్... ఎన్నో అనారోగ్యాలకు పెట్టొచ్చు చెక్... అధిక బరువు నుంచి కంటి చూపు మెరుగు వరకు
రోజుకో క్యారెట్ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు అంటున్నారు డాక్టర్లు.
క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. రంగుతోనే చాలా మందికి నోరూరించేస్తుంది. రోజూ ఒక క్యారెట్ తినగలిగితే ఎన్నో అనారోగ్య సమస్యలకు దూరం పెట్టొచ్చు అంటున్నారు డాక్టర్లు. క్యారెట్‌లో ఉండే పోషకాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంతకీ క్యారెట్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం.
* క్యారెట్లను రోజూ తినడం వల్ల అల్సర్లు, గ్యాస్ వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. క్యారెట్లలో ఉండే ఫైబర్ మలబద్దకాన్ని పోగొడుతోంది.
* క్యారెట్లలో బీటా కెరోటిన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో విటమిన్ A గా మారి లివర్ ఆరోగ్యానికి సాయపడుతుంది. లివర్ సమస్యలు ఉన్న వారు రోజూ క్యారెట్ తింటే లివర్లో ఉండే విష పదార్థాలు బయటికి పోయి... లివర్ ఆరోగ్యంగా ఉంటుంది.
Also Read: బత్తాయి రసంతో ఎన్ని ప్రయోజనాలో... జీర్ణాశయం శుభ్రం... షుగల్ లెవల్స్ డౌన్
* ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని క్యారెట్ అందిస్తుంది. క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీంతో మీరు యాక్టీవ్‌గా ఉండేలా చేస్తుంది.
* క్యారెట్‌లో ఉండే పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్ చర్మ సమస్యలను నివారిస్తుంది. దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది.
* బరువు తగ్గాలనుకునే వారు రోజూ క్యారెట్లను తినడం వల్ల ఎంతో మేలు. వీటిల్లో ఉండే ఫైబర్ కొవ్వును కరిగిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది.
* తక్షణం శక్తిని అందించే వాటిలో క్యారెట్ ఒకటి. కాస్త అలసటగా అనిపించిననప్పుడు క్యారెట్ తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
* క్యారెట్ల ద్వారా అందే విటమిన్ A వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. రక్తం తయారయ్యి... బాగా సరఫరా అవుతుంది. హైబీపీ అదుపులోకి వస్తుంది. దీంతో గుండె జబ్బులను అడ్డుకోవచ్చు.
* గోళ్లు, జుట్టు బలంగా పెరగడంతో పాటు చర్మాన్ని క్యారెట్ ఫ్రెష్‌గా మారుస్తుంది. మంచి రంగు కావాలనుకునే వారు రోజుకో క్యారెట్ తినడం అలవాటు చేసుకోవాలి.
Also Read: పరగడుపును గోరు వెచ్చని నీళ్లు తాగితే ఎన్నో లాభాలో... ఆ లాభాలేంటో మీరు తెలుసుకోండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ఈ కథనానికి ‘abp దేశం’ ఎలాంటి బాధ్యత వహించదని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి