Herbal supplements : ఆరోగ్యం కోసం హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా ? అయితే ఓ సారి లివర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే !
Health News : హెర్బల్ ప్రొడక్ట్స్ అంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని అనుకుంటూ ఉంటారు. హెర్బ్స్ తో చేసిన మెడిసిన్స్ లాంటివి విరివిగా వాడుతూ ఉంటారు. వీటిలోనూ ప్రమాదకరమైనవి ఉన్నాయని తాజా పరిశోధనల్లో తేలింది.
6 popular herbal supplements linked to potential liver risks : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా పెరిగిపోతున్న అనారోగ్య సమస్యల్ని అధిగమించేందుకు ఇటీవల ఎక్కువ మంది హెర్బల్ ప్రొడక్ట్స్ వైపు మొగ్గుతున్నారు. ఇది ఒక్క భారత్ లోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఉంది. అశ్వగంధ, పసుపు, అల్లం, గ్రీన్ టీ వంటి వాటి ఉపయోగాన్ని ఇటీవలి కాలంలో పెంచుకుంటూ పోతున్నారు. ఇవ్నీ నాచురల్ అంటే సహజ సిద్దమైన ఉత్పత్తులని అందుకే.. ఎలాంటి మెడికల్ సర్టిపికేషన్ అవసరం లేదని చెబుతూంటారు. ఆరోగ్యానికి మంచిదని చెప్పి అమ్మే ప్రతి ఉత్పత్తికి అమెరికాలో యూఎస్ ఎఫ్‌డీఏ గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అయితే ఈ సంస్థ కూడా హెర్బల్ ప్రొడక్ట్స్ కి కూడా ఈ సంస్థ అనుమతి అవసరం లేదు. దీంతో అమెరికాలో ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ పేరుతో ఉత్పత్తుల అమ్మకాలు పెరిగిపోయాయి.
ఈ హెర్బల్ ప్రొడక్ట్స్ నిజంగానే ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తున్నాయా చెడగొడుతున్నాయా అన్న అంశంపై యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్ పరిశోధకుల బృందం ఇటీవల పూర్తి స్థాయి రీసెర్చ్ చేసింది. ఇందులో సంచనల విషయాలను కనిపెట్టింది. అమెరికాలో 15.6 మిలియన్ల మంది పెద్దలు అంటే.. కోటిన్నర మందికిపైగా హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్న వారిలో ఐదు శాతం మందిలో లివర్ సంబంధిత సమస్యలు వచ్చినట్లుగా గుర్తించారు. లివర్ సమస్యలు లేదా హెపటోటోకాక్సిస్ సమస్య ఏదైనా కనిపిస్తోందని గుర్తించారు.
రాత్రుళ్లు పచ్చి వెల్లుల్లి తినొచ్చా? ఆ సమస్యలుంటే మాత్రం కచ్చితంగా తీసుకోవాలట
JAMA Network Open లో ఈ స్టడీ రిపోర్టును ప్రచురించారు. తొమ్మిదిన్నర వేల మంది అమెరికా పౌరుల ఆరోగ్యాన్ని ఇందు కోసం పరిశీలించారు. వివిధ హెర్బల్ ప్రొడక్ట్స్ వినిగిస్తున్న వారు.. వినియోగించని వారి ఆరోగ్య సమస్యల్ని విశ్లేషించారు. అశ్వగంధ, బ్లాక్ కోహోష్ ( black cohosh ), గార్షినియా కాంబిజియా ( దీన్నితెలుగులో మలబారు చింత అని పిలుస్తారు ), గ్రీన్ టీ ఎక్స్‌ట్రాక్ట్, రెస్ట్ ఈస్ట్ రైస్, టర్మరిక్ ఆర్ కుర్‌కుమిన్ వంటి హెర్బల్ ప్రొడక్ట్స్ వినియోగిస్తున్న వారిపై పరిశోధనలు నిర్వహించారు. ఇవి వినియోగిస్తున్న వారిలో ఐదు శాతం వరకూ లివర్ ఆరోగ్యాన్ని చెడిపోయినట్లుగా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఆమరికాలో నమోదవుతున్న లివర్ కేసులకు.. వాటి బారిన పడుతున్న వారిలో ఎక్కవ మంది హెర్బల్ ప్రొడక్ట్స్ వినియోగించే వారు ఉన్నట్లుగా గుర్తించడంతో పరిశోధన చేసినట్లుగా రీసెర్చర్లు ప్రకటించారు.
షుగర్ ఉన్నవాళ్లు బెండకాయలు అలా తీసుకుంటే చాలా మంచిదట.. మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా
ఈ రీసెర్చ్ ప్రకారం చూస్తే కోటిన్నరకు మందికిపైగా అమెరికన్లు లివర్ సమస్యకు గురయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఈ రీసెర్చ్ వల్ల ప్రజలు మరింత ఎక్కువగా అవగాహన పెంచుకుని .. హెర్బల్ ప్రొడక్ట్స్ వినియోగంలో మరింత అవగాహనతో ఉండాలని వారు కోరుకుంటున్నారు. భారత్ లోనూ హెర్బల్ పేరుుతో ఎన్నో ప్రొడక్ట్స్ అమ్ముతూ ఉంటారు. నేచురల్ పేరుతో దేనికీ అనుమతులు ఉండవు. వాటిని వాడే ముందు.. కాస్త ఆలోచించాల్సిన అవసరం ఉంది.. మిచిగాన్ యూనివర్శిటీ రిసెర్చ్ స్పష్టం చేస్తోంది.