News
News
X

Monsoon Tips For Hair: ఈ జాగ్రత్తలు తీసుకోకుంటే వర్షాకాలం పూర్తయ్యేలోపు మీకు బట్టతల ఖాయం!

వర్షాకాలం వచ్చిందంటే చాలు చాలా మందికి జుట్టును మెటయిన్ చేయడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి తోడు జుట్టు రాలకుండా ఉండేందుకు చాలా ఖర్చు చేస్తుంటారు.

FOLLOW US: 

మిగతా కాలలతో పోల్చుకుంటే వర్షాకాలం చాలా మందిని అనారోగ్యం పాలు చేస్తుంటుంది. సీజనల్‌గా వచ్చే వ్యాధులతోపాటు మిగతా సమస్యలు కూడా వెంటాడుతాయి. అలాంటి వాటిలో ముఖ్యమైంది జుట్టు ఊడిపోవడం. చాలా మంది ఈ సమస్యతో సతమతమవుతుంటారు. జుట్టు జిడ్డుగా అయిపోతుంటుంది. చండ్రు కూడా చేరుతుంది. 

ఇలాంటి సమస్య నుంచి బయట పడేందుకు మార్కెట్‌లో చాలా రకాలైన ఆయిల్స్‌, హెయిర్ మాస్క్‌లు దొరుకుతున్నాయి. కానీ ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు. అందుకే చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు సురక్షితంగా ఉంటుంది. 

చిన్న చిన్న ఆహార నియమాలు పాటిస్తే చాలు మీ జుట్టు ఒత్తుగా ఉంటుంది. ముందుగా మీ శరీరంలో విటమిన్లు, మినరల్స్ సరిపడా ఉండేలా చూసుకోవాలి. ఇవే మీ జుట్టును దృఢంగా ఆరోగ్యంగా ఉంచుతాయి.  దీని కోసం కొన్ని ఆహార సర్దుబాట్లు చేసుకోవడం మంచిది. తద్వారా మీరు బలమైన విటమిన్లు, మినరల్స్ పొందగలరు.

జుట్టు రాలిపోకుండా పాటించాల్సిన ఐదు నియమాలు

గుడ్లు: గుడ్లు ప్రోటీన్, బయోటిన్ ఎక్కువ దొరికే ఫుడ్. ఇది జుట్టు కుదుళ్లను గట్టిగా చేస్తుంది. జుట్టులో కొల్లాజెన్ మొత్తాన్ని పెంచుతాయి. ఉదయాన్నే మీరు తీసుకునే బ్రేక్‌ ఫాస్ట్‌లో ఎగ్‌ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి. 

మెంతి గింజలు: మెంతి గింజల్లో ఇ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. మెంతి గింజలను  రాత్రిపూట నానబెట్టి.. ఉదయాన్నే వడకట్టి వీలున్నప్పుడల్లా ఆ నీటిని తాగితే మీ జుట్టుకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. 

బాదం, వాల్‌నట్‌లు: ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు వాల్‌నట్‌లు, బాదంపప్పులో పుష్కలంగా ఉన్నాయి. ఇవి జుట్టు తేమను స్టేబుల్‌గా ఉంచి జుట్టు రాలిపోకుండా చూసే ఆహార పదార్థాల్లో ఈ రెండు ఉత్తమమైనవి. ప్రతి రోజు ఈ గింజలను గుప్పెడు తింటే తర్వాత వచ్చే ఫలితాన్ని మీరే చూస్తారు. 

బచ్చలి కూర: ఐరన్, ఫోలేట్, విటమిన్లు బచ్చలి కూరలో పుష్కలంగా లభిస్తాయి. ఇది జుట్టు పెరుగుదలకు సహాయ పడుతుంది. పాలకూర లాంటి ఇతర కూరలను కూడా మీ ఫుడ్‌లో చేర్చుకోండి. 

నేరేడు పండ్లు : వర్షాకాలంలో లభించే నేరేడు పండులో విటమిన్ సి పుష్కలంగా దొరుకుతుంది. ఇది కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ మాడును బలపరుస్తుంది. నేరేడుు పండుగా తినొచ్చు లేదా వేరే మార్గాల్లో కూడా ఆరగించవచ్చు. 

ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మీ జుట్టు సురక్షితంగా ఉంటుంంది. 

Published at : 25 Jun 2022 08:59 PM (IST) Tags: Best Hair Care Tips Hair Care Tips Hair Fall Healthy Food For Hair Healthy Life In Monsoon

సంబంధిత కథనాలు

Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

Milk Tea: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్

Diabetes: మీకు డయాబెటిస్ ఉందో లేదో మీ పాదాలు చెప్పేస్తాయ్

Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

Hypotension: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

ఉదయం నిద్ర నుంచి లేచాక కూడా అలసటగా అనిపిస్తోందా? అయితే ఇవే కారణాలు

ఉదయం నిద్ర నుంచి లేచాక కూడా అలసటగా అనిపిస్తోందా? అయితే ఇవే కారణాలు

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

Diet Drinks: ‘డైట్’ సోడా డ్రింక్స్ సేఫ్ అనుకుంటున్నారా? ఎంత ముప్పో తెలిస్తే మళ్లీ ముట్టరు!

టాప్ స్టోరీస్

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

KCR News: 21న కరీంనగర్‌కు సీఎం కేసీఆర్, ఆసక్తికరంగా ఆ ఏర్పాట్లు - గతంలో ఎప్పుడూ లేనట్లుగా

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

TS Police: కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్, ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!

TS Police: కానిస్టేబుల్‌ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్,  ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!