X

NTR: యూర‌ప్‌లో ఎన్టీఆర్ హాలిడే... ఫ్యామిలీతో ట్రిప్ వేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు యూర‌ప్‌లో ఉన్నారు. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్ వేశారు.

FOLLOW US: 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? యూర‌ప్‌లో! అవును... ఆయన ఇండియాలో లేరు. ఫ్యామిలీతో కలిసి ప్యారిస్‌కు హాలిడే ట్రిప్ వేశారు. ఈఫిల్ టవర్ కనిపించేలా... అబ్బాయి అభయ్ రామ్‌తో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు ఎన్టీఆర్. సుమారు వారం, పది రోజులు ఆయన యూర‌ప్‌లో ఉంటారని సమాచారం. కొవిడ్ కారణంగా చిత్రీకరణకు మధ్య మధ్యలో విరామాలు వచ్చినప్పటికీ... గత రెండు మూడేళ్లుగా 'ఆర్ఆర్ఆర్'తో ఎన్టీఆర్ బిజీగా ఉన్నారు. సంక్రాంతి తర్వాత నుంచి కొరటాల శివ దర్శకత్వంలో కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నారు. సంక్రాంతికి ముందు 'ఆర్ఆర్ఆర్' ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనాలి. అందుకని, మధ్యలో దొరికిన ఈ విరామ సమయంలో ఇలా హాలిడే ట్రిప్ ప్లాన్ చేశారన్నమాట.

View this post on Instagram

A post shared by Jr NTR (@jrntr)

రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ఎన్టీఆర్ నటించిన 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' సినిమా జనవరి 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన కొమరం భీమ్‌గా కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం ఆయన బాడీ బిల్డ్ చేశారు. నెక్స్ట్ కొరటాల సినిమా కోసం కాస్త సన్నబడి లీన్ అండ్ ఫిట్ ఫిజిక్‌లోకి రానున్నారు. 'జనతా గ్యారేజ్'లో ఎన్టీఆర్‌ హీరోయిజాన్ని కొత్త కోణంలో చూపించిన కొరటాల... ఈ సినిమాలో ఎలా చూపిస్తారో అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. హీరోగా ఎన్టీఆర్ 30వ చిత్రమిది. దీనిని ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కల్యాణ్ రామ్, కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు యువ తమిళ సంచలనం అనిరుధ్ సంగీత దర్శకుడు. 

Also Read: 'ఈసారి కూడా మిస్ అవ్వదు..' పవన్ నిర్మాత కాన్ఫిడెన్స్ చూశారా..?
Also Read: రవిపై దారుణమైన ట్రోలింగ్.. ఫ్యామిలీను కూడా లాగుతూ..
Also Read: అల్లు అర్జున్ తగ్గేదే లే... ఫుల్ స్వింగులో పుష్పరాజ్ డబ్బింగ్
Also Read: 'అఖండ' సినిమా సెన్సార్ పూర్తి... బాలకృష్ణ సినిమాకు ఏం సర్టిఫికెట్ వచ్చిందంటే?
Also Read: వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైన‌ర్‌గా అల్లు అర్హ... రాయ్ చెస్ అకాడమీలో నోబెల్ వరల్డ్ రికార్డ్
Also Read: కైకాలను ఫోనులో పలకరించాను... కోలుకుంటారన్న పూర్తి నమ్మకం కలిగింది - చిరంజీవి
Also Read: ఓ ఇంటివాడైన యువ హీరో కార్తికేయ... పెళ్లికి హాజరైన మెగాస్టార్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: ntr abhay ram Jr NTR NTR Holiday Trip

సంబంధిత కథనాలు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Trivikram Srinivas: త్రివిక్ర‌మ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Samantha: అక్కినేని కాంపౌండ్‌లో సమంత... పర్సనల్ లైఫ్ పక్కన పెట్టి!

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Allu Arjun: ఢీ13 ఫైనల్స్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇదిగో వీడియో.. 

Allu Arjun: ఢీ13 ఫైనల్స్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇదిగో వీడియో.. 

Kangana Ranaut: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్

Kangana Ranaut: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు  చేయాలని ఆర్డర్
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Poor States : పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Poor States :  పేదలు దేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కువ ? ఆశ్చర్యపరిచే నిజాలు వెల్లడించిన నీతిఅయోగ్ !

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Public Holidays 2022: తెలంగాణలో వచ్చే ఏడాది ప్రభుత్వ సెలవు దినాలు ఇవే.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్