Adivi Sesh: ఆసుపత్రిలో అడివి శేష్, డెంగ్యూ సోకడంతో ప్లేట్ లెట్స్ డౌన్
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తీవ్ర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. గత వారం అడివి శేష్కు డెంగ్యూ సోకినట్లు వార్తలు వచ్చాయి.
అడవి శేష్..తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోల్లో ఒకరు. మంచి కాన్సెప్ట్ ఉన్న కథలు ఎంపిక చేసుకుంటూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అడవి శేష్ సినిమా అంటే ఎదో ఒక ప్రత్యేకత ఉంటుందనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఉంది. ప్రస్తుతం అడవి శేష్ మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో తొలిసారి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. అయితే గతవారం అడివి శేష్ డెంగ్యూ బారిన పడినట్టు వార్తలొచ్చాయి. ప్లేట్ లెట్స్ అకస్మాత్తుగా పడిపోవడంతో సెప్టెంబర్ 18 న ఆసుపత్రిలో చేరాడు. ప్రస్తుతం వైద్యులు తన ఆరోగ్యం గురించి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
యంగ్ హీరో డెంగ్యూ బారిన పడ్డాడన్న విషయం తెలిసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు తను త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ మధ్య మరో యంగ్ హీరో సాయిధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇంతలో అడవి శేష్ కి అనారోగ్యంగా ఉందన్న వార్త మరింత బాధపెట్టిందంటున్నారు సినీ ప్రముఖులు.
ప్రస్తుతం ఈ యంగ్ హీరో “మేజర్” సినిమాతో బిజీగా ఉన్నాడు. ‘మేజర్’లో అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. 26/11 ముంబై టెర్రర్ అటాక్ లో అమరవీరుడైన ఆర్మీ ఆఫీసర్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. ‘క్షణం’,’ గూఢచారి’, ‘ఎవరు’ లాంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నఈ హీరో పంజా, బాహుబలి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు.
Also Read: అక్కినేని నాగేశ్వరరావు అరుదైన చిత్రాలు.. 41 ఏళ్ల కిందట అన్నపూర్ణ స్టూడియో ఇలా ఉండేది
Also Read: గర్భం దాల్చిన మహిళ.. విషయం తెలిసి ఇద్దరు ప్రియుల ఫైటింగ్.. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే..