Samantha: అవును... సమంతకు ఆ సమస్య ఉంది!
స్టార్ హీరోయిన్ సమంతకు ఓ సమస్య ఉంది. స్వయంగా ఆమె చెప్పిన మాట ఇది!
స్టార్స్ తమ వ్యక్తిగత జీవితంలో సమస్యల గురించి బయటకు చెప్పడానికి ఇష్టపడరు. అయితే... ఇందులో హీరోయిన్లు అతీతం అని చెప్పాలి. తమకు స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత దీపికా పదుకోన్, ఇలియానా వంటి హీరోయిన్లు మానసిక సమస్యలతో ఇబ్బంది పడినట్టు మీడియా ముఖంగా చెప్పారు. ఆ జాబితాలో తాజాగా సమంత కూడా చేరారు. 'సన్నాఫ్ సత్యమూర్తి'లో డయాబెటిక్ ఇష్యూ ఉన్న హీరోయిన్ పాత్ర చేశారామె. ఆ సినిమా విడుదల సమయంలో తాను స్కిన్ అలర్జీతో బాధ పడినట్టు సమంత వివరించారు. ఇప్పుడు చెప్పేది ఆ సమస్య కాదు. సమంత కూడా మానసిక సమస్యలతో సతమతం అయ్యారు. స్వయంగా ఆమె ఈ విషయం చెప్పారు.
"నేనూ మానసిక సమస్యలను ఎదుర్కొన్నారు. వాటిని తట్టుకుని బయట పడగలిగాను. నా స్నేహితులు కూడా నాకెంతో సహకరించారు" అని హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో సమంత వెల్లడించారు. సమాజంలో ఎంతో మంది చెప్పుకోలేని మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, సమస్యలను మనసులో దాచుకోకుండా ఇతరులకు చెబితే పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని ఆమె అన్నారు. జీవితంలో ప్రతి ఒక్కరికీ సమస్యలు ఉంటాయన్నారు.
Also Read: గతం గురించి కామెంట్... సమంత మాటల్లో చాలా మీనింగ్ ఉందిగా!
సమంత జీవితంలో గత ఏడాది పెను మార్పు చోటు చేసుకుంది. నాగ చైతన్య, ఆమె వేరు పడ్డారు. అప్పుడు ఆమెకు స్నేహితులు అండగా నిలిచారట. విడాకుల విషయం నుంచి త్వరగా కోలుకున్న సమంత, ప్రస్తుతం సినిమాలపై దృష్టి పెట్టారు. ఆమె చేతిలో పాన్ ఇండియా సినిమాలు 'శాకుంతలం', 'యశోద', ఓ తెలుగు - తమిళ ద్విభాషా సినిమా ఉంది. వరుణ్ ధావన్, సమంత జంటగా దర్శకులు రాజ్ అండ్ డీకే 'సిటాడెల్'ను రీమేక్ చేస్తున్నారు. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' తర్వాత సమంత, రాజ్ అండ్ డీకే చేస్తున్న ప్రాజెక్టు ఇది.
Also Read: అయ్యా బాబోయ్... ఆ 'జబర్దస్త్' కమెడియన్ అన్ని బాటిళ్లు తగాడా?
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్...
Also Read: రమేష్ బాబు సినిమాల్లో నటించండం ఎందుకు మానేశారు? ‘ఆగడు’తో ఆగిన ప్రస్థానం
Also Read: మహేష్‌కు రమేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పిన త్రివిక్రమ్!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.