What?: అయ్యా బాబోయ్... ఆ 'జబర్దస్త్' కమెడియన్ అన్ని బాటిళ్లు తాగాడా?
ఒకటి, రెండు కాదు... అరడజను, డజను కాదు... ఓ 'జబర్దస్త్' కమెడియన్ స్టామినా అంతకు మించి ఉందని, అంతకు మించి తాగాడని రోజా కామెంట్స్ చేయడం టాపిక్.
సమాజంలో మందుబాబులు ఉన్నారు. ఆల్కహాల్ అలవాటు ఉన్న జనాలు మన సమాజంలో కనిపిస్తారు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో కూడా ఆల్కహాల్ అలవాటు ఉన్న మనుషులు ఉంటారు. కొంత మంది లిమిట్‌లో తాగుతారు. కొందరు లిమిట్ దాటి తాగుతారు. మహా అయితే ఎంత తాగుతారు? ఎవరైనా 32 బాటిళ్లు తాగగలరా? 'జబర్దస్త్' కమెడియన్, టీమ్ లీడర్ 'బుల్లెట్' భాస్కర్ ఓసారి 32 బాటిళ్లు తగారట. ఈ మాట అన్నది ఎవరో కాదు, 'జబర్దస్త్' జడ్జ్ రోజా. ఆమె కూడా చెప్పాలని చెప్పలేదు. ఓ స్కిట్‌లో అసలు నిజం ఆమె నోట బయటకు వచ్చిందంతే!
జనవరి 7న టెలికాస్ట్ అయిన 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' ఎపిసోడ్ చూశారా? అందులో 'బుల్లెట్' భాస్కర్ స్కిట్ చూశారా? స్కిట్‌లో ఓ డైలాగ్ ఉంది. 'అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే... ఫుల్ బాటిల్ తాగి, ఆ తర్వాత తాళి కట్టాలి' అని 'బుల్లెట్' భాస్కర్‌తో ఇమ్మాన్యుయేల్ డైలాగ్ చెబుతాడు. అందుకు బదులుగా 'ఫుల్ బాటిల్ తాగడం అంటే కష్టంరా' అని 'బుల్లెట్' భాస్కర్ అంటాడు. వెంటనే రోజా '32 బాటిళ్లు తాగేసి... ఒక్క బాటిల్' అని అంటారు. దాంతో ఒక్కసారిగా తన చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకున్నాడు భాస్కర్. పక్కన ఉన్న ఇమ్మాన్యుయేల్, యాంకర్ రష్మీ గౌతమ్, మిగతా అందరూ నవ్వేశారు. అలా అసలు విషయం బయటకు వచ్చింది. 'బుల్లెట్' భాస్కర్ 32 బాటిళ్లు తాగాడనేది టీవీ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది.
రష్మీ గౌతమ్, 'బుల్లెట్' భాస్కర్ అదే స్కిట్‌లో డాన్స్ కూడా చేశారు. డాన్స్ చేసిన తర్వాత "అదేందమ్మా... నువ్వు ఇక్కడ ఉంటే, నడుము కిలోమీటరు దూరంలో ఉంటుంది?" అని భాస్కర్ అన్నాడు. స్కిట్‌లో ఆ డాన్స్ హైలైట్ అయ్యింది.
View this post on Instagram
Also Read: మహేష్‌కు రమేష్ బాబు అంటే ఎంత ఇష్టమో చెప్పిన త్రివిక్రమ్!
Also Read: మధ్యలో ఆగిపోయిన రమేష్ బాబు సినిమాలు ఇవే...
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం...
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.