Ramesh Babu: మధ్యలో ఆగిపోయిన రమేష్ బాబు సినిమాలు ఇవే...
కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు హీరోగా మొదలైన కొన్ని సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. ఆ సినిమాలు ఏవో మీకు తెలుసా?
![Ramesh Babu: మధ్యలో ఆగిపోయిన రమేష్ బాబు సినిమాలు ఇవే... Here is the list of Ramesh Babu movies that stopped in the middle of the shoot due to financial problems Ramesh Babu: మధ్యలో ఆగిపోయిన రమేష్ బాబు సినిమాలు ఇవే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/09/1eec33d8b0f47c40f4eb3ea5c5107aff_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
హీరోగా రమేష్ బాబు నటించిన సినిమాల సంఖ్య తక్కువ. జస్ట్, 15 మాత్రమే. కానీ, ఆయన హీరోగా మొదలైన సినిమాలు మాత్రం 15 కాదు. మొత్తం 19. మరి, మిగతా నాలుగు? అంటే... ఆ సినిమాలు మధ్యలో ఆగిపోయాయి. అందులో రెండు జానపద నేపథ్యంలో సినిమాలు కావడం విశేషం.
రమేష్ బాబు, ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ హీరోలుగా సెప్టెంబర్, 1996లో 'అహో విక్రమార్క' అని ఓ సినిమా మొదలైంది. కృష్ణతో సోషియో ఫాంటసీ సినిమా 'జగదేక వీరుడు' తీసిన సాగర్ తొలిసారి జానపద చిత్రానికి దర్శకత్వం వహించాలని ఈ సినిమా మొదలు పెట్టారు. నవలా రచయిత సూర్యదేవర రామమోహనరావు కథ అందించగా... మరుధూరి రాజా మాటలు రాశారు. కృష్ణ సొంత స్టూడియో పద్మాలయాలో సెట్స్ వేశారు. కీర్తి, రక్ష హీరోయిన్లుగా... రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో, సత్యనారాయణ, సుధాకర్, తనికెళ్ల భరణి, ఆలీ, బాబూ మోహన్ తదితరులు ప్రధాన పాత్రల్లో రెండు షెడ్యూల్స్ తీశారు. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో ఆ సినిమా మధ్యలో ఆగింది. లేదంటే... 1997 జనవరిలో విడుదల అయ్యేది. ఈ సినిమా ఆగిపోవడానికి మరో కారణం రమేష్ బాబు మార్కెట్ కూడా! హీరోగా మార్కెట్ డౌన్ కావడంతో కృష్ణ సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వచ్చినా నిర్మాతలు ముందడుగు వేయలేదు.
అదే ఏడాది (1996) అక్టోబర్ 21న జానపద బ్రహ్మ విఠలాచార్య తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో జానపద సినిమా 'భూలోక రంభ' సినిమాను కూడా రమేష్ బాబు స్టార్ట్ చేశారు. రంభగా కథానాయిక ఇంద్రజను ఎంపిక చేశారు. ఓ షెడ్యూల్ చేసిన తర్వాత, 1999లో ఫైనాన్సియల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఈ సినిమా కూడా ఆగింది. మూడేళ్ల తర్వాత టైటిల్ 'భూలోక వీరుడు జగదేక సుందరి'గా మార్చి... కొన్ని రోజులు షూటింగ్ చేశారు. తర్వాత అదీ ఆగింది.
Also Read: రమేష్ బాబు సినిమాల్లో నటించండం ఎందుకు మానేశారు? ‘ఆగడు’తో ఆగిన ప్రస్థానం
రమేష్ బాబు హీరోగా 'సాహస యాత్ర', 'ప్రేమ చరిత్ర' అని మరో రెండు సినిమాలు కూడా మొదలు అయ్యాయి. అవి కూడా మధ్యలో ఆగాయి. కృష్ణ అంతటి స్టార్ అండ ఉన్నప్పటికీ... తొలి సినిమా 'సామ్రాట్', ఆ తర్వాత 'బజార్ రౌడీ' వంటి సినిమాలు కమర్షియల్ సక్సెస్ అయినప్పటికీ... కెరీర్ మీద శ్రద్ధ తక్కువ అవడం, ఇతర కారణాల వల్ల రమేష్ బాబు సక్సెస్ కాలేకపోయారు.
Also Read: రమేష్ బాబు Vs బాలకృష్ణ.. ఆ టైటిల్ కోసం వివాదం...
Also Read: వందల కోట్ల ఆఫర్.. రిజెక్ట్ చేసిన ప్రభాస్...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)