News
News
X

Yo Yo Honey Singh: తాగుడు, అమ్మాయిలతో ఎఫైర్లు.. ప్రముఖ సింగర్ పై భార్య సంచలన ఆరోపణలు!

ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్, నటుడు యోయో హనీ సింగ్ జనాల దృష్టిలో పెద్ద స్టార్. ఆయన్ను అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.

FOLLOW US: 

ప్రముఖ బాలీవుడ్ సింగర్, ర్యాపర్, నటుడు యోయో హనీ సింగ్ జనాల దృష్టిలో పెద్ద స్టార్. ఆయన్ను అభిమానించేవారు లక్షల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో కూడా ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇంత పెద్ద స్టార్ భార్యను చిత్రహింసలకు గురి చేస్తున్నాడట. అతడి భార్య షాలిని స్వయంగా హనీ సింగ్ పై కేసు పెట్టింది. తనను హనీ సింగ్ వేధింపులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. ఈ క్రమంలో హనీ సింగ్ గురించి ఆమె చేసిన ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. 

తన స్టేజ్ పెర్ఫార్మన్స్ లు, రాయల్టీ ద్వారా హనీ సింగ్ ఏడాదికి అటు ఇటుగా మొత్తం రూ.4 కోట్లు సంపాదించేవాడట. అయితే సంపాదించిన డబ్బుని దాచుకోకుండా విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం, మద్యం సేవించడం, డ్రగ్స్ తీసుకోవడం, అమ్మాయిలతో శృంగారాల కోసం మాత్రమే ఖర్చుపెట్టేవాడట. ఈ క్రమంలో తనను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేసేవాడని షాలిని ఆరోపించింది. 

హనీ సింగ్ తల్లితండ్రులు, సోదరి కూడా తనను వేధించారని షాలిని చెప్పుకొచ్చింది. హనీ సింగ్ కు ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని పోలీసులకు వివరించింది షాలిని. ఓ పంజాబీ హీరోయిన్ తో హనీ సింగ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. దీనిపై ప్రశ్నించినప్పుడు మాట మార్చి తప్పించుకున్నాడని చెప్పింది. తన ఇంట్లోనే చాలా మందితో హనీ సింగ్ సెక్స్ చేసేవాడని.. అలా తనను మానసికంగా చాలా ఇబ్బంది పెట్టాడని షాలిని ఆరోపించింది. 

హనీ సింగ్-షాలిని దాదాపు పదిహేనేళ్ల పాటు సీక్రెట్ గా ప్రేమించుకున్నారు. జనవరి 23, 2011లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. కానీ పెళ్లి చేసుకున్న మూడేళ్ల వరకు హనీ సింగ్ తన భార్యను జనాలకు పరిచయం చేయలేదు. 'రాస్టార్' అనే రియాలిటీ షోలో హనీ సింగ్ తన భార్యను పరిచయం చేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. షాలిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గృహహింస చట్టం కింద హనీసింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఆరోపణలపై స్పందించాల్సిందిగా కోర్టు.. హనీ సింగ్ కు ఈ నెల 28వరకు గడువు ఇచ్చింది. హనీ సింగ్, అతడి భార్య పేరు మీదున్న ఉమ్మడి ఆస్తుల జోలికి వెళ్లడానికి వీలు లేకుండా.. షాలినికి అనుకూలంగా కోర్టు మధ్యంతర ఉత్తుర్వులు జారీ చేసింది. సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన 'కాక్‌టెయిల్‌' సినిమాలోని ఆంగ్రేజీ బీట్ పాటతో హనీ సింగ్ మంచు గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత నుండి బాలీవుడ్ లో ఆయన కెరీర్ ఊపందుకుంది. గతేడాది జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి హనీ సింగ్ కంపోజ్ చేసిన ఓ పాట యూట్యూబ్ ఇండియాలో టాప్ సాంగ్ గా నిలిచింది. ఇప్పుడు షాలిని ఇచ్చిన ఫిర్యాదుతో హనీ సింగ్ కెరీర్ పై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి!

Published at : 04 Aug 2021 11:06 AM (IST) Tags: Yo Yo Honey Singh Yo Yo Honey Singh wife shalini Shalini Domestic Violence case singer yo yo honey singh

సంబంధిత కథనాలు

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Sree Leela: రామ్, బోయపాటి సినిమాలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల, షూటింగ్ తేదీ ఫిక్స్!

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Ram - Boyapati Movie Update : రామ్ జోడీగా శ్రీలీల - 'అఖండ' తర్వాత బోయపాటి, తమన్ కాంబినేషన్ రిపీట్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Puneeth Rajkumar : తెలుగులోకి మరో పవర్ స్టార్ సినిమా - దసరాకు 'సివిల్ ఇంజనీర్' టీజర్ రిలీజ్

Ginna Movie Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా, లోడ్ చేసిన గన్ను, ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేసింది!

Ginna Movie Trailer: జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదురా, లోడ్ చేసిన గన్ను, ‘జిన్నా’ ట్రైలర్ వచ్చేసింది!

Swathi Muthyam Movie Review - 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?

Swathi Muthyam Movie Review - 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?

టాప్ స్టోరీస్

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

Nobel Peace Prize 2022: నోబెల్ శాంతి బహుమతి రేసులో ఇద్దరు భారతీయులు!

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

దేశానికే కేసీఆర్‌ రోల్ మోడల్- సరైన టైంలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు: తిరుమావళవన్

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

Amit Shah Jammu Kashmir Visit: 'మాటల్లేవ్, మాట్లాడుకోవడాల్లేవ్'- పాక్‌తో చర్చలపై అమిత్ షా

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!

YouTube: యూజర్లకు యూట్యూబ్ షాక్, ఇకపై డబ్బులు చెల్లిస్తేనే ఆ వీడియోలు చూసే అవకాశం!