News
News
X

KGF2 Trailer: 'నాకు ఎవడి దోస్తీ అక్కర్లేదు' - 'కేజీఎఫ్2' ట్రైలర్ వచ్చేసిందోచ్

'కేజీఎఫ్2' సినిమా తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఒక్క ట్రైలర్ తోనే అంచనాలను పెంచేశారు ప్రశాంత్ నీల్.

FOLLOW US: 

కన్నడ స్టార్ హీరో యష్ ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందించిన 'కేజీఎఫ్' సినిమా  సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దేశవ్యాప్తంగా ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. గోల్డ్ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా 'కేజీఎఫ్ చాప్టర్ 2' రాబోతుంది. 

ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా ఏప్రిల్ 14న సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్ గా వెల్లడించింది చిత్రబృందం. దానికి తగ్గట్లే ప్రమోషన్స్ మొదలుపెట్టాలని చూస్తుంది. ఇప్పటివరకు 'ఆర్ఆర్ఆర్' మేనియా ఉండడంతో 'కేజీఎఫ్2' కోసం ప్రమోషన్స్ మొదలుపెట్టే ఛాన్స్ రాలేదు. 

ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' విడుదల కావడంతో ప్రశాంత్ నీల్ అండ్ కో కేజీఎఫ్ ని ఓ రేంజ్ లో ప్రమోట్ చేయబోతుంది. ముందుగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఒక్కో భాషలో ఒక్కో స్టార్ తో ట్రైలర్ ను లాంచ్ చేశారు. తెలుగు ట్రైలర్ ను రామ్ చరణ్ విడుదల చేశారు. ఒక్క ట్రైలర్ తోనే అంచనాలను పెంచేశారు ప్రశాంత్ నీల్. 'కేజీఎఫ్' పార్ట్ 1కి మించి పార్ట్ 2 ఉండబోతుందని ట్రైలర్ చూస్తేనే అర్ధమవుతోంది. 

ఎలివేషన్స్, బ్యాక్ గ్రౌండ్ స్క్రోర్ ఓ రేంజ్ లో ఉంది. ట్రైలర్ లో హీరో చెప్పే డైలాగ్స్ హైలైట్ గా నిలిచాయి. అలానే రవీనా టాండన్, సంజయ్ దత్ ల పాత్రలను చాలా పవర్ ఫుల్ గా చూపించారు. ట్రైలరే ఇలా ఉందంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మరి. రవి బసృర్ ఈ సినిమాకి సంగీతం అందించగా.. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తోంది..!

Also Read: పాపం, ఈసారి సరయుకి డేంజర్ తప్పేలా లేదు!

Published at : 27 Mar 2022 06:43 PM (IST) Tags: ram charan prashanth neel KGF2 Yash KGF2 Movie Trailer KGF2 Movie Hombale films

సంబంధిత కథనాలు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Adipurush Director Om Raut : మేం ఏ తప్పూ చేయలేదు , నా రావణుడు ఇంతే - 'ఆదిపురుష్' దర్శకుడు

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Ennenno Janmalabandham October 7th : మలబార్ మాలినినా మజాకా, స్పృహలోకి వచ్చిన సులోచన - యాక్సిడెంట్ చేసిన ఖైలాష్

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Bigg Boss 6 Telugu Episode 33: ఎట్టకేలకు రేవంత్ కెప్టెన్? తమ కోరికల చిట్టాను బిగ్‌బాస్‌కు చెప్పిన ఇంటి సభ్యులు, తన కుక్కల బొచ్చు అడిగిన గీతూ

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

Godfather Box Office : రెండో రోజు 'గాడ్ ఫాదర్' కలెక్షన్స్ - మెగాస్టార్ మేనియా ఎలా ఉందంటే?

టెర్మినేటర్-2, జురాసిక్ పార్క్ చేసిన పని మణిరత్నం చేసుంటే బాగుండేదా?

టెర్మినేటర్-2, జురాసిక్ పార్క్ చేసిన పని మణిరత్నం చేసుంటే బాగుండేదా?

టాప్ స్టోరీస్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

ఏపీ సీఐడికి లేక రాసిన విజయ్‌- కేసుల వివరాలు చెప్పాలని డిమాండ్

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

IND vs SA, Match Highlights: సంజు సక్సెస్ - మ్యాచ్ డెడ్ - ఒక్కడి ఊపు సరిపోలేదు!

Sajjala Ramakrishna Reddy : మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Sajjala Ramakrishna Reddy :  మా విధానం మాకుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై సజ్జల సంచలన వ్యాఖ్యలు

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్

Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - 3 రోజులపాటు అక్కడ అతి భారీ వర్షాలు, IMD ఆరెంజ్ అలర్ట్