అన్వేషించండి
Advertisement
Hero Ajith: అజిత్ ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం..
హీరో అజిత్ ఇంటి ముందు ఓ మహిళా అభిమాని పెట్రోల్ పోసుకొని మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఇంటి ముందు కలకలం చెలరేగింది. ఓ మహిళా అభిమాని పెట్రోల్ పోసుకొని మంగళవారం నాడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అజిత్ ని కలవడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా.. ఫలితం లేకుండాపోయిందని, ఇంకా ఎన్నాళ్లు పోరాడాలని ఆవేదన చెందుతూ.. తన చావుకి అజితే కారణమంటూ కేకలు వేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Also Read:'ఆహా'లో బాలయ్య టాక్ షో.. నిజమెంత..?
వెంటనే సదరు మహిళపై నీళ్లు పోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేసేది. గతేడాది అజిత్, తన భార్య షాలినితో కలిసి అదే హాస్పిటల్ కు వెళ్లారు. ఆ సమయంలో ఫర్జానా ఓ వీడియో షూట్ చూసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కరోనా సమయంలో అజిత్ హాస్పిటల్ కి వెళ్లడంతో అతడికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. మరోపక్క హాస్పిటల్ రూల్స్ ఉల్లంఘించిందంటూ ఫర్జానాను ఉద్యోగం నుంచి తొలగించారు. అయితే అజిత్ హాస్పిటల్ వర్గాలతో మాట్లాడితే తిరిగి తన ఉద్యోగం తనకు ఇస్తారని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసింది. కానీ ఫలితం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో తనకు న్యాయం చేయాలంటూ హీరో ఇంటి ముందే ఆత్మహత్యకు యత్నించింది. ఆమె ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకొని కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించేశారు.
Also Raed: మంచు విష్ణు ప్యానల్‌పై ప్రకాశ్‌రాజ్ ఫిర్యాదు, ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న విలక్షణ నటుడు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion