Prabhas - Raju Deluxe: మారుతి సినిమా చేయడానికి ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పాడు?

మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడనే విషయం ఆడియ‌న్స్‌కు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అసలు, మారుతితో ప్రభాస్ ఎందుకు సినిమా చేస్తున్నారు? మారుతి కథలో ఆయనకు ఏం నచ్చింది? అంటే...

FOLLOW US: 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి క‌ల‌యిక‌లో సినిమా రావ‌డం ఖాయ‌మే. ఈ సినిమా విషయం బయటకు వచ్చిన తర్వాత అవునని కానీ, కాదని కానీ చెప్పకుండా కాలమే సమాధానం చెబుతుందని మారుతి ఓ ట్వీట్ వేశారు. పైకి ఆయన అలా ట్వీట్ చేసినా... లోపల చాలా సంతోషంగా ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్. ఈ సినిమా కన్ఫర్మ్ అయ్యి కూడా చాలా రోజులు అయ్యిందని వినికిడి. ఈ సినిమాకు 'రాజు డీలక్స్' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. అయితే... ఈ వార్త ఆడియ‌న్స్‌కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది. సినిమా మారుతితో సినిమా చేయడానికి ప్రభాస్ ఎందుకు ఓకే చెప్పారు? మారుతి కథలో ఆయనకు ఏం నచ్చింది? అనే వివరాల్లోకి వెళితే...

హారర్ కామెడీ జాన‌ర్‌లో మారుతి చెప్పిన క‌థ‌, మారుతి శైలి ప్ర‌భాస్‌కు విప‌రీతంగా న‌చ్చింద‌ని సమాచారం. ముఖ్యంగా షూటింగ్‌కు ఎక్కువ రోజులు కేటాయించాల్సిన అవ‌స‌రం కూడా లేదు. మూడు నెలల్లో మారుతి సినిమా పూర్తి చేసి ఇస్తారని పక్కాగా చెప్పారట. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ స్థాయి పెరిగింది. దాంతో 'సాహో', 'రాధే శ్యామ్', 'సలార్', 'ఆదిపురుష్', 'ప్రాజెక్ట్ కె', 'స్పిరిట్' సినిమాలు అంగీకరించారు. వీటి మధ్య ఓ చిన్న సినిమా చేయాలని ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అదీ చక్కటి వినోదాత్మక సినిమా అయితే బావుంటుందని సన్నిహితుల దగ్గర చెప్పారట. ఆల్రెడీ యువి క్రియేషన్స్ అధినేతలతో మారుతికి సత్సంబంధాలు ఉన్నాయి. 'ప్రేమకథా చిత్రమ్' కంటే పదింతలు వినోదంతో కథ చెప్పడంతో ప్రభాస్ ఓకే చెప్పారట.

'రాధే శ్యామ్', 'సలార్' సినిమాల తర్వాత మారుతి దర్శకత్వంలో 'రాజు డీలక్స్' విడుదల చేయాలనేది ప్లాన్ అట. ఈ సినిమా కోసం ప్రభాస్ భారీ పారితోషికం అందుకోనున్నారని గుసగుస. యంగ్ రెబల్ స్టార్‌కు నిర్మాత డీవీవీ దానయ్య వంద కోట్ల రూపాయలు ఇవ్వడానికి రెడీ అన్నారట. వేసవిలో ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రావచ్చు. వేసవి తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 

Also Read: ఆ ముగ్గురు వలనే ఇంత బాధ.. 'జబర్దస్త్' వర్ష ఎమోషనల్ కామెంట్స్... Also Read: బాలయ్య షో వెనుక అసలు స్టోరీ.. రివీల్ చేసిన దర్శకుడు...

Also Read: జనవరి 24 ఎపిసోడ్: నాన్నకు ప్రేమతో రిషి... జగతిని ఇంటికి తీసుకొస్తాడా? మధ్యలో వసు రాయబారమా... ? 'గుప్పెడంత మనసు' సోమవారం ఎపిసోడ్ లో ఏం జ‌రిగింది అంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Jan 2022 05:44 PM (IST) Tags: Prabhas DVV Danayya Prabhas Raju Deluxe Prabhas - Maruthi Movie

సంబంధిత కథనాలు

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Karthika Deepam మే 28(ఈ రోజు) ఎపిసోడ్: జ్వాల, నిరుపమ్‌కు పెళ్లి చేద్దామని హిమ ప్లాన్- బ్రేకింగ్ న్యూస్ చెప్పి షాకిచ్చిన సౌందర్య

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Guppedantha Manasu మే 28(ఈరోజు) ఎపిసోడ్: మనసులో ప్రేమను రిషికి చెప్పకుండా దాటవేసిన వసుధార- సాక్షి బెదిరింపులతో మాష్టార్‌ స్ట్రోక్

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

Krishna On Mahesh Babu: కృష్ణను స్టూడియో అంతా పరుగులు పెట్టించిన మహేష్ - అమ్మాయి గురించి నానా గొడవ

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

NTR Jayanthi: మహానాయకుడు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించిన కళ్యాణ్ రామ్, తారక్

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

Brahmastra: 'బ్రహ్మాస్త్ర' సాంగ్ - ప్రోమో రిలీజ్ చేసిన రాజమౌళి

టాప్ స్టోరీస్

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Anantapur: తెల్లవారుజామున విషాదం, గ్యాస్‌ సిలిండర్‌ పేలి కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Weather Updates: బలపడుతున్న నైరుతి రుతుపవనాలు, ఏపీలో ఆ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు - హీటెక్కుతోన్న తెలంగాణ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ

Petrol Price Today 28th May 2022: వాహనదారులకు ఊరట, పలు నగరాలలో తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ