Unstoppable: బాలయ్య షో వెనుక అసలు స్టోరీ.. రివీల్ చేసిన దర్శకుడు..
దర్శకుడు బీవీఎస్ రవి 'అన్ స్టాపబుల్' షోకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తోన్న 'అన్ స్టాపబుల్' షో ఎంతో పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ షోకి మోహన్ బాబు, నాని, రానా, విజయ్ దేవరకొండ, రాజమౌళి, అల్లు అర్జున్, రవితేజ ఇలా పేరున్న సెలబ్రిటీలు చాలా మంది గెస్ట్ లుగా వచ్చారు. వారిని తన ప్రశ్నలతో ఓ ఆట ఆడుకున్నారు బాలయ్య. ఇప్పటివరకు విడుదలైన ఎపిసోడ్స్ అన్నింటికీ మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే మహేష్ బాబు ఎపిసోడ్ ని కూడా టెలికాస్ట్ చేయనున్నారు.
ఈ షోకి రైటర్ గా దర్శకుడు బీవీఎస్ రవి అలియాస్ మచ్చ రవి వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గా ఆయన ఈ షోకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మోహన్ బాబుని బాలయ్య ఇంటర్వ్యూ చేసిన ఎపిసోడ్ పై స్పందించిన ఆయన.. మోహన్ బాబుతో మాట్లాడడానికి వీలుగా ముందే ప్రశ్నలన్నీ సిద్ధం చేశారట.
వాటిని బాలయ్యకు ఒక కాపీ, మోహన్ బాబుకి ఒక కాపీ ఇచ్చారట. బాలయ్యకు ఇంటర్వ్యూ ప్రశ్నలు ప్రిపేర్ చేసి ఇచ్చినప్పుడు.. మోహన్ బాబుకు చెప్పారా..? అని అడిగి కన్ఫర్మ్ చేసుకున్నారట. బాలయ్య చెవిలో చిన్న మైక్ సెట్ చేసి.. దాని ద్వారా ఆయనకు ఇన్ పుట్స్ ఇచ్చారట. వాటిని బాలయ్య ఇంప్రొవైజ్ చేసి షోని ఎంతో ఎంటర్టైనింగ్ గా మలిచారు. తాము రెడీ చేసిన ప్రశ్నలను బాలయ్య తన బాడీ లాంగ్వేజ్ తో వేరే లెవెల్ కి తీసుకెళ్లారని బీవీఎస్ రవి చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో రవితేజతో బాలయ్య గొడవలపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు ఈ దర్శకుడు. గత ఇరవై ఏళ్లుగా రవితేజతో మంచి స్నేహం ఉందని.. రెండు రోజులకు ఒకసారి మాట్లాడుకుంటూ ఉంటామని.. అలాంటిది తనకే తెలియలేదంటే రవితేజ- బాలకృష్ణ మధ్య గొడవ లేదని అర్థం చేసుకోవచ్చని అన్నారు. షూటింగ్ సమయంలో బాలయ్య, రవితేజ చాలా సార్లు కలుసుకున్నారని.. నిజంగానే గొడవలు ఉంటే ఇద్దరూ కలిసి ఒక షోలో కనిపించడం సాధ్యం కాదని అన్నారు.
View this post on Instagram
Also Read: గ్లామర్ షో ఓకే కానీ.. ఛాన్స్ లు దొరుకుతాయా..?
Also Read: అల్లు అర్జున్, యష్ లకు కంగనా సలహా.. బాలీవుడ్ వలలో పడొద్దంటూ రిక్వెస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి