Raai Laxmi : 'నాకు పెళ్లై, పిల్లలు పుట్టినా.. ధోనీతో ఎఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమో..'
ధోనీతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం.. తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని రాయి లక్ష్మీ చెప్పుకొచ్చింది.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో కొన్నాళ్ల పాటు రిలేషన్ షిప్ లో ఉంది నటి రాయ్ లక్ష్మీ. ఈ విషయం అందరికీ తెలిసిందే. 2008లో ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ధోనీ ఉండేవారు. ఆ సమయంలో ఆ టీమ్ కి ప్రచారకర్తగా రాయ్ లక్ష్మీ వ్యవహరించింది. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అది మెల్లమెల్లగా రిలేషన్ షిప్ కు దారి తీసింది. ఇద్దరూ కొన్నాళ్లు డేటింగ్ కూడా చేశారు.
కానీ ఈ జంట ఎక్కువ రోజులు తమ బంధాన్ని కొనసాగించలేకపోయారు. ఏడాది తిరక్కుండానే బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తరువాత ధోనీ.. సాక్షిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తన ఫ్యామిలీ, కెరీర్ అంటూ బిజీ అయిపోయారు. మరోపక్క రాయ్ లక్ష్మీ మాత్రం ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ ధోనీతో బ్రేకప్ గురించి చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ధోనీతో రిలేషన్ షిప్ మెయింటైన్ చేయడం.. తన జీవితంలో ఓ మచ్చగా మిగిలిపోయిందని పేర్కొంది. తనతో బ్రేకప్ జరిగి దాదాపు 12 ఏళ్లు గడిచిపోయాయని.. అయినా ఇప్పటికీ ఆ సంఘటన తనను వెంటాడుతూనే ఉందని చెప్పుకొచ్చింది. మీడియాలో కూడా ధోనీ గురించి ఏదైనా చర్చ వస్తే.. తన పేరుని అనవసరంగా ప్రస్తావిస్తున్నారని వాపోయింది.
తనకు పెళ్లై, పిల్లలు పుట్టినా.. ధోనీతో ఎఫైర్ గురించి మాట్లాడుతూనే ఉంటారేమోనని తన బాధను బయటపెట్టింది. ఇద్దరికీ బ్రేకప్ అయినప్పటికీ.. ఒకరిపై మరొకరికి గౌరవం ఉందని చెప్పుకొచ్చింది. ధోనీ తరువాత తన జీవితంలో చాలా బ్రేకప్స్ జరిగాయని.. కానీ వాటి గురించి ఎవరూ పట్టించుకోలేదని తెలిపింది. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని.. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదని స్పష్టం చేసింది.
Also Read:పవన్ తో తమన్ ప్లాన్.. ఫ్యాన్స్ రచ్చ మాములుగా ఉండదేమో..
Also Read: కత్రినా-విక్కీ పెళ్లి ఆ తేదీల్లోనే.. ఇదిగో కన్ఫర్మేషన్..
Also Read: స్కైలాబ్ రివ్యూ: ఆకాశమంత తాపీగా సాగినా.. మంచి ప్రయత్నమే!
Also Read: బాలకృష్ణ... మహేష్... షూటింగ్‌కు రెడీ! ఎప్పుడు? ఎక్కడ? అంటే...
Also Read: రాజకీయ భీష్మాచార్యుడి మృతి తీరని లోటు.. రోశయ్యకు సినీ ప్రముఖుల సంతాపం
Also Read: అదర గొడుతున్న 'అడవితల్లి మాట'.. భీమ్లానాయక్ నుంచి నాలుగో సాంగ్ వచ్చేసింది...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి