News
News
X

K Vishwanath Top 10 Movies: విశ్వనాథ్ మరపురాని 10 చిత్రాలివే - గుండె బరువెక్కిస్తాయ్, మనసును హత్తుకుంటాయ్!

కళాతపస్వి కె. విశ్వనాథ్ తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించారు. వాటిలో 10 అత్యుత్తమ సినిమాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

FOLLOW US: 
Share:

టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు కె. విశ్వనాథ్ తెరకెక్కించిన ఎన్నో చిత్రాలు అద్భుత విజయాలను అందుకున్నాయి. చాలా చిత్రాలు వంద రోజులకు పైనే  ప్రదర్శింపబడి, ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వసూళ్లపరంగానూ ఆకట్టుకున్నాయి. కళాతపస్వి తెరకెక్కించిన టాప్ 10 చిత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. శారద

తన భర్త చనిపోయాక జ్ఞాపకశక్తిని కోల్పోయి దుఃఖంలో ఉన్న వితంతువుకు సంబంధించిన విషాద కథే 'శారద' చిత్రం.  శారద కథానాయికగా నటించగా, శోభన్ బాబు కథానాయకుడిగా చేశారు. ఈ సినిమా 100 రోజులకు పైగా థియేటర్లలో ప్రదర్శింపబడి అద్భుత విజయాన్ని అందుకుంది.  

2. నేరము శిక్ష

కె. విశ్వనాథ్ తెరకెక్కించిన అద్భుత చిత్రాల్లో ‘నేరము శిక్ష’ ఒకటి. కృష్ణ, భారతి ఇందులో హీరో, హీరోయిన్ గా నటించారు.  ఈ సినిమా ఒక సంపన్న వ్యాపారవేత్త కొడుకుకు సంబంధించిన నిర్లక్ష్య జీవితం నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో కృష్ణ ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒకరు చనిపోవడంతో పాటు మరొకరు కంటిచూపు కోల్పోతారు.  తాను చేసినా నేరానికి శిక్ష అనుభవించే తీరాలని చట్టం ముందు లొంగిపోవడానికి బయలు దేరిన వ్యక్తి కథే ఈ చిత్రం.   

3. శంకరాభరణం

కె. విశ్వనాథ్ రూపొందించిన గొప్ప సినిమాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. ఈ చిత్రం 100 అద్భుత భారతీయ చిత్రాల లిస్టులో చోటు సంపాదించింది. మంజు భార్గవి, సోమయాజులు మధ్య పవిత్రమైన విద్యార్థి-ఉపాధ్యాయ సంబంధాన్ని ఈ సినిమాలో చూపించారు. ఈ చిత్రం కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయింది.

4. సాగర సంగమం

కమల్ హాసన్ హీరోగా నటించిన ఈ సినిమా సైతం టాప్ 100 ఇండియన్ సినిమా లిస్టులో చోటు దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ మద్యపాన వ్యసనపరుడైన డ్యాన్స్ టీచర్‌గా నటించారు. అతడి నుంచి డ్యాన్స్ నేర్చుకోవడానికి ఇష్టపడని యువ డ్యాన్సర్, చిరవకు ఆయన నుంచే మెళకువలు నేర్చుకున్ని అద్భుత నృత్యకారిణిగా ఎలా మారిందనేదే ఈ చిత్ర కథ. డ్యాన్స్, స్నేహం, అభిమానం వంటి విలువలపై ఈ సినిమా ఉంటుంది.  

5. స్వాతి ముత్యం

1985లో విడుదలైన తెలుగు కుటుంబ కథా చిత్రం ‘స్వాతిముత్యం’. పెద్దలని ఎదిరించి పెళ్ళి చేసుకున్న ఒక సాంప్రదాయ సామాన్య కుటుంబానికి చెందిన యువతి, చిన్నపుడే భర్త పోతే ఎదురుకున్న పరిస్థితులు ఇందులో చూపించారు. అనుకోకుండా ఆమె జీవితము లోకి వచ్చిన ఒక అమాయకపు యువకుడితో ఎలాంటి  ప్రయాణం కొనసాగించిందో అద్భుతంగా తెరకెక్కించారు. కమల్ హాసన్, రాధిక ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించారు. 

6. స్వయంకృషి

కృషి, నైతికత, స్వావలంబన విలువలను పెంపొందించే గొప్ప కుటుంబ కథా చిత్రం 'స్వయంకృషి'. ఈ సినిమాలో చిరంజీవి చెప్పులు కుట్టే వ్యక్తి పాత్రలో నటించారు. చెప్పులు కుట్టుకునే సాధారణ వ్యక్తి ఆ తర్వాత ఎన్నో చెప్పులు దుకాణాలు ప్రారంభించి గొప్ప సంపన్న వ్యక్తిగా ఎలా మారతాడనేది ఈ సినిమాలో చూపించారు. సోమరితనంతోపాటు అహంకారిగా మారిన కొడుకును ఆ తండ్రి ఎలా మారుస్తాడు? అనేది ప్రధాన నేపథ్యం. అప్పట్లో మంచి కమర్షియల్ చిత్రాలతో పేరుగడిస్తున్న చిరంజీవిని ఇందులో చెప్పులు కుట్టే వ్యక్తిగా చూపించడమంటే పెద్ద సామసమనే చెప్పాలి. ఈ మూవీ చిరంజీవికి కూడా మంచి మైలేజ్‌ను ఇచ్చింది. 

7. స్వర్ణకమలం

చిత్రకారుడైన యువకుడు తన పక్కింట్లో ఉండే బ్రాహ్మణ విద్వాంసుని కుమార్తెను నాట్యకళలో ప్రోత్సహించి ఉన్నత శిఖరాలకు చేర్చడమే ఈ సినిమా కథ. ఇందులో వెంకటేష్, భానుప్రియ అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాకు నంది సహా పలు సినిమా అవార్డులు దక్కాయి.    

8. శుభలేఖ

వర్ధమాన నటుడిగా ఉన్న చిరంజీవికి ‘శుభలేఖ’ మంచి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమా ద్వారా పరిచయమైన సుధాకర్ ఈ చిత్రం పేరునే ఇంటిపేరుగా మార్చుకున్నారు. సుజాత, చిరంజీవి ఇందులో అద్భుతంగా నటించారు. వరకట్నం అనే జాఢ్యానికి వ్యతిరేకంగా ఈ సినిమా తెరకెక్కింది. 

9. సిరివెన్నెల

1986లో విడుదలైన సంగీత ప్రాధాన్యతా చిత్రం ‘సిరివెన్నెల’. సర్వదమన్ బెనర్జీ, సుహాసిని జంటగా నటించారు. ఈ సినిమా కథ అంధ వేణు వాద్యకారుడు,  మూగ చిత్రకారురాలి చుట్టూ తిరుగుతుంది. . కె. వి. మహదేవన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటలన్నీ సీతారామ శాస్త్రి రాశారు. ఆ తర్వాత ఈ సినిమా పేరు తన ఇంటి పేరుగా మారింది.

10. స్వాతి కిరణం

‘స్వాతి కిరణం’ చిత్రం 1992లో విడుదలై అద్భుత విజయాన్ని అందుకుంది. మమ్ముట్టి, రాధిక ప్రధాన పాత్రల్లో నటించారు. సాంప్రదాయ సంగీత గురువు తన శిష్యుడి ఉన్నతిని తట్టుకోలేక అతడి మరణానికి కారణం అవుతారు. చివరి తన తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడటమే ఈ సినిమా కథ.

Read Also: భక్తిలో అయినా ప్రేమలో అయినా తన్మయత్వం ఒకటే -విశ్వనాథ్ సినిమాలో ఈ ఒక్క పాట చాలు

Published at : 03 Feb 2023 10:33 AM (IST) Tags: K Vishwanath Death Directer K Vishwanath K Vishwanath top 10 movies

సంబంధిత కథనాలు

Director Pradeep Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం - ప్రముఖ దర్శకుడు మృతి

Director Pradeep Died: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం - ప్రముఖ దర్శకుడు మృతి

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

OTT: 'మీర్జాపూర్' to 'ఫ్యామిలీ మ్యాన్', సీజన్-3తో తిరిగొస్తున్న 10 పాపులర్ వెబ్ సిరీసులు ఇవే

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Vishnu VS Manoj: మంచు మనోజ్, విష్ణు మధ్య విభేదాలు - ఫేస్‌బుక్ పోస్ట్‌తో ఇంటి గుట్టు బయటకు

Hero Srikanth: ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయా, ఆ నాలుగు రోజులు నరకం చూశా: హీరో శ్రీకాంత్

Hero Srikanth: ఇంట్లో చెప్పకుండా చెన్నై పారిపోయా, ఆ నాలుగు రోజులు నరకం చూశా: హీరో శ్రీకాంత్

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి 

Actor Ajith Father Died : కోలీవుడ్ హీరో అజిత్ ఇంట్లో విషాదం - హీరో తండ్రి మృతి 

టాప్ స్టోరీస్

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

TSPSC Paper Leak: ఉదాసీనతే కొంప ముంచిందా? విధులు నిర్వహిస్తూనే పరీక్షలకు హాజరైన కమిషన్ ఉద్యోగులు! అయినా నో రెస్పాన్స్!

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

300కార్లతో ర్యాలీ- టీడీపీలోకి వెళ్లే సమయంలో కోటంరెడ్డి బలప్రదర్శన

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

దర్యాప్తు సంస్థల దాడులను నిరసిస్తూ ప్రతిపక్షాల పిటిషన్, విచారణకు సుప్రీంకోర్టు అంగీకారం

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ

పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ ఫోకస్ - పూర్తి వివరాలు ఇవ్వాలని సీఎస్, డీజీపీకి లేఖ