News
News
X

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ డిమాండ్... అక్కడ 'పుష్ప'ను విడుదల చేయాల్సిందే!

We Want Pushpa Hindi Release: 'పుష్ప' హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదలవుతుందా? లేదా యూట్యూబ్‌లోనా? అల్లు అర్జున్ అభిమానులు హిందీలో సినిమాను విడుద‌ల చేయాల‌ని ట్విట్ట‌ర్‌లో ట్రెండ్ చేస్తున్నారు

FOLLOW US: 

'వుయ్ వాంట్ పుష్ప హిందీ రిలీజ్' #WeWantPushpaHindiRelease (పుష్ప సినిమాను హిందీలో విడుదల చేయాలి) అంటూ 37 వేల మంది ఈ రోజు (ఆదివారం) ట్వీట్లు చేశారు. ఎందుకు? అంటే... సినిమా హిందీ వెర్షన్ థియేటర్లలో విడుదల చేయడానికి ఓ అడ్డంకి ఉందనేది ఫిలిం నగర్ ఖబర్. అందుకని, ఆదివారం మంగళం శ్రీనుగా సునీల్ లుక్ విడుదల చేసిన తర్వాత ట్విట్టర్‌లో తమ డిమాండ్‌ను తీసుకొచ్చారు. నేష‌న‌ల్ వైడ్ ట్రెండ్ చేశారు. అసలు, 'పుష్ప' హిందీ విడుదలకు ఎదురైన సమస్య ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే...

'పుష్ప' సినిమా ప్రారంభించినప్పుడు రెండు భాగాలుగా తీయాలని అనుకోలేదు. అప్పట్లో హిందీలో భారీ స్థాయిలో విడుదల చేయాలనీ అనుకోలేదట. అందుకని, మైత్రీ మూవీ మేకర్స్ హిందీ డబ్బింగ్, డిజిటల్ రైట్స్ ఒకరికి విక్రయించారట. ఆ తర్వాత రెండు భాగాలుగా చేయాలని అనుకోవడం... పాన్ ఇండియా సినిమాగా రూపాంతరం చెందడం జరిగాయి. ఇప్పుడు డిజిటల్, డబ్బింగ్ రైట్స్ కొన్న వ్యక్తి... థియేట్రికల్ రిలీజ్ అంటే అంత ఆసక్తి చూపించడం లేదని టాక్. అగ్రిమెంట్లు పక్కాగా ఉండటంతో ఆయనతో డిస్కషన్లు జరుగుతున్నాయి. 'సామి సామి...' పాటను హిందీలో రిలీజ్ చేయకపోవడానికి కారణం కూడా ఈ హిందీ రిలీజ్ ఇష్యూ అని గుసగుస. ఈ నేపథ్యంలో అభిమానులు హిందీలో సినిమాను విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' హిందీలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తే ఎంత వసూలు చేసిందనేది చెబుతున్నారు. మైతీ మూవీ మేకర్స్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో 'ఆర్య', 'ఆర్య 2' సినిమాలు వచ్చాయి. 'గంగోత్రి' తర్వాత అల్లు అర్జున్‌ను యువతకు దగ్గర చేసిన సినిమా 'ఆర్య'నే. ఆ తర్వాత 'ఆర్య 2'లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ ట్రై చేశారు అల్లు అర్జున్. పాన్ ఇండియా మార్కెట్‌లో అడుగుపెట్టడం కోసం సుకుమార్ సినిమాను ఎంపిక చేసుకున్నారు. హిందీ రిలీస్ ఇష్యూ వల్ల సినిమా విడుదల వాయిదా పడిందని, డిసెంబర్ 17న విడుదల కాదని కొందరు ట్వీట్లు చేశారు. అయితే... డిసెంబర్ 17న 'పుష్ప' విడుదల అవుతుందని అల్లు అర్జున్ టీమ్ చెబుతోంది. 

Also Read: తెలుగు సినిమా దర్శకులందు త్రివిక్రమ్ వేరయా!
Also Read: పాట కష్టం తెలిసినోడు... కొన్నేళ్లుగా రాయనోడు... మళ్లీ పవన్ కోసం రాశాడు!
AlsoRead: దంచికొట్టు... కత్తిపట్టు... అదరగొట్టు... పవన్ పాట వింటే పూనకాలే!
Also Read: పెళ్లి కబురు చెప్పిన కార్తికేయ... ఆ తర్వాత కాబోయే భార్యను పిలిచి!
Also Read: మంగళం శీను మామూలుగా లేడుగా... విల‌న్‌గా సునీల్ లుక్ చూశారా?
Also Read: హ్యాట్రిక్‌కు రెడీ... మహేష్ దర్శకత్వంలో అనుష్క!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 07 Nov 2021 05:53 PM (IST) Tags: Allu Arjun Pushpa Pushpa Movie Pushpa The Rise We Want Pushpa Hindi Release Pushpa Hindi Release Issue

సంబంధిత కథనాలు

Karthikeya2 Collections: 'కార్తికేయ2' కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Karthikeya2 Collections: 'కార్తికేయ2' కలెక్షన్స్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్

Shakini-Dhakini: ‘శాకిని డాకిని’ రిలీజ్ డేట్ ఫిక్స్, యాక్షన్ కామెడీతో వస్తున్న రెజినా, నివేదా థామస్

Ohmkar: ఆ ఛానెల్ తో విభేదాలు? ఇక జెమినీ టీవీలో ఓంకార్ షోస్!

Ohmkar: ఆ ఛానెల్ తో విభేదాలు? ఇక జెమినీ టీవీలో ఓంకార్ షోస్!

Dil Raju: ఏదైనా తెలుసుకొని రాయండి, లేకుంటే మూసుకొని ఉండండి - దిల్‌రాజు ఫైర్

Dil Raju: ఏదైనా తెలుసుకొని రాయండి, లేకుంటే మూసుకొని ఉండండి - దిల్‌రాజు ఫైర్

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

Project K: రెండు భాగాలుగా ప్రభాస్ 'ప్రాజెక్ట్ K' - ఫ్యాన్స్‌కి పండగే!

టాప్ స్టోరీస్

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

Recovery Agents Harassment: బ్యాంకు రికవరీ ఏజెంట్ల వేధింపులా? అయితే ఇలా చేయండి

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే - ప్రభుత్వ జీవో రిలీజ్ !

AP Dharmika Parishat : ఏపీలో ఆలయాల, మఠాల వ్యవహారాలన్నీ ఇక ధార్మిక పరిషత్ చేతుల మీదుగానే -  ప్రభుత్వ జీవో రిలీజ్ !

Ambati Vs Janasena : బపూన్, రంభల రాంబాబు - అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Ambati Vs Janasena :   బపూన్, రంభల రాంబాబు -  అంబటిపై విరుచుకుపడుతున్న జనసేన ! కారణం ఏమిటంటే ?

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!

Live Train Status: రైలు రన్నింగ్‌ స్టేటస్‌ తెలుసుకోవాలా! పేటీఎం యాప్‌తో వెరీ ఈజీ!!