News
News
X

The Vaccine War: 11 భాషల్లో వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్', రిలీజ్ డేట్ ఫిక్స్

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి మరో ప్రతిష్టాత్మక సినిమాను తెరకెక్కిస్తున్నారు. 'ది వ్యాక్సిన్ వార్' పేరుతో రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు తెలిపారు.

FOLLOW US: 
 
‘ది కాశ్మీర్ ఫైల్స్’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి. దేశవ్యాప్తంగా ఈ చిత్ర ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. విమర్శకులు సైతం ఈ చిత్రాన్ని మెచ్చుకున్నారు.  ఈ చిత్రం అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇంతకాలం ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేసిన వివేక్.. మరో ప్రతిష్టాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టారు. తాజాగా తన కొత్త చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్ చేశారు. 'ది వ్యాక్సిన్ వార్' టైటిల్‌తో తన తదుపరి సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ చిత్రం దేశంలో కరోనా ప్రభావం, టీకా తయారీ కోసం పడిన ఇబ్బందులు, వ్యాక్సీన్ కోసం కొనసాగిన పోటీ సహా పలు అంశాల సమ్మేళనంగా ఉండబోతుంది.

11 భాషల్లో వచ్చే ఆగష్టు 15న విడుదల

తాజాగా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ విడుదల అయ్యింది. ఇందులో  కోవిడ్ వ్యాక్సిన్‌ను కలిగి ఉన్న వీల్‌ కనిపిస్తోంది. “మీకు తెలియని యుద్ధంపై మీరు పోరాడి గెలిచారు” అని పోస్టర్ మీద రాసి ఉంది. ఈ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్లేందుకు రెడీ అవుతోంది. అటు వచ్చే ఏడాది(2023) ఆగష్టు 15న విడుదల చేయనున్నట్లు సినిమా యూనిట్ వెల్లడించింది. కరోనా కట్టడి కోసం భారత్ చేసిన అద్భుత కృషి ప్రపంచం గుర్తించిందని గతంలోనే వివేక్ అభిప్రాయపడ్డారు. ఈ సినిమాను ఏకంగా హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, పంజాబీ, భోజ్‌పురి, సహా 11 భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.  

ఈ సినిమాను ఐ యామ్ బుద్ధ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో పల్లవి జోషి నిర్మిస్తున్నారు. “ఈ చిత్రం మన బయో సైంటిస్టుల అద్భుత విజయాన్ని ప్రతిబింబిస్తుంది. టీకాపై వారు చేసిన పోరాటం, త్యాగం, అంకితభావం, కృషికి మా నివాళి” అని పల్లవి అభిప్రాయపడింది.  మొత్తంగా 'ది కాశ్మీర్ ఫైల్స్' తర్వాత వివేక్ రంజన్ అగ్నిహోత్రి నుండి మరో అద్భుత సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. పల్లవి జోషి నిర్మిస్తున్న ఈ సినిమాను, ‘ది కాశ్మీర్ ఫైల్స్’ కోసం వివేక్ తో కలిసి పనిచేసిన అభిషేక్ అగర్వాల్..  తన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ ద్వారా దేశ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

త్వరలో నటీనటుల ప్రకటన

ఇక ఈ ప్రతిష్టాత్మక సినిమాకు సంబంధించిన నటీనటులకు వివేక్ ప్రకటించలేదు. త్వరలోనే సినిమాలోని నటించే యాక్టర్ల వివరాలను చిత్ర బృందం అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. వ్యాక్సిన్ వార్ లో పోటార యోధులు, శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలను బిగ్ స్క్రీన్ పై అద్భుతంగా ఎవరు రక్తి  కట్టిస్తారోనని  ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read Also: ఆ వీడియోపై షెర్లిన్ చోప్రా గుర్రు - రాఖీ సావంత్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, రచ్చ మామూలుగా లేదు

Published at : 10 Nov 2022 02:32 PM (IST) Tags: vivek Agnihotri The Vaccine War Movie Vivek Agnihotri new film I Am Buddha Productions

సంబంధిత కథనాలు

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Naga Chaitanya: మరదలితో నాగచైతన్య - రెస్టారెంట్‌లో ఫుడ్ వీడియో చేసిన వెంకటేష్ కూతురు!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

Chiranjeevi Photo: నేవీ అధికారులను చూడగానే పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయ్ - అలనాటి అరుదైన ఫోటో షేర్ చేసిన మెగాస్టార్!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

HIT 3: అర్జున్ సర్కార్‌గా నాని - ‘హిట్ 3’ రెడీ!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Rakul Preet Singh: 2022లో బిగ్గెస్ట్ ఫ్లాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, ఆమె వెంటే కృతి సనన్!

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

Disaster Telugu Movies 2022: ఈ ఏడాది టాప్ 10 డిజాస్టర్ తెలుగు సినిమాలేంటో తెలుసా?

టాప్ స్టోరీస్

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

CM Jagan Review : ఒక్క పైసా కూడా తగ్గకుండా మద్దతు ధర, ధాన్యం సేకరణపై సీఎం జగన్ కీలక ఆదేశాలు

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Guntur Knife Attack: గుంటూరు జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం, వైద్య విద్యార్థిని దారుణహత్య - కారణం ఏంటంటే!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Minister Mallareddy : కిట్టీ పార్టీ వ్యాఖ్యలపై మంత్రి మల్లారెడ్డి వివరణ, సారీ అంటూ వీడియో రిలీజ్!

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్

Soyam Babu Rao: 25 ఏళ్ల కిందట సారా ప్యాకెట్స్ తయారుచేసి అమ్మిన చరిత్ర మీది కాదా?: మంత్రిపై బీజేపీ ఎంపీ ఫైర్