News
News
X

FIR on Rakhi Sawant: ఆ వీడియోపై షెర్లిన్ చోప్రా గుర్రు - రాఖీ సావంత్‌పై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు, రచ్చ మామూలుగా లేదు

బాలీవుడ్ ముద్దుగుమ్మలు రాఖీ సావంత్, ఫెర్లిన్ చోప్రా మధ్యలో పచ్చిగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకరిపై మరొకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా వీరి పంచాయితీ పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.

FOLLOW US: 
 
గత కొంత కాలంగా బాలీవుడ్ హీరోయిన్లు రాఖీ సావంత్, షెర్లీన్ చోప్రా నడుమ తీవ్ర వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్, ఆమె లాయర్ ఫల్గుణి బ్రహ్మభట్ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. మీడియా ముందు తనకు సంబంధించిన అభ్యంతరకర వీడియోను ప్రదర్శించడంతో పాటు కించపరిచేలా మాట్లాడారంటూ షెర్లిన్ చోప్రా చేసిన ఫిర్యాదుతో వీరిద్దరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. IPC సెక్షన్లు 354A, 500, 504, 509 & IT ACT 67A కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. త్వరలో రాఖీ సావంత్ తో పాటు ఆమె లాయర్ ను విచారించనున్నట్లు వెల్లడించారు.

గత కొద్ది రోజులు రాజుకుంటున్న వివాదం

వాస్తవానికి షెర్లిన్ చోప్రా, రాఖీ సావంత్ మధ్య వివాదం చాలా రోజులుగా కొనసాగుతోంది. బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ ఖాన్ మీద కొద్ది రోజుల క్రితం షెర్లిన్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది. అంతేకాదు, ఈ వేధింపుల గురించి బయట చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడని సంచలన విషయాలు వెల్లడించింది. తాజాగా సాజిద్ ఖాన్ బిగ్ బాస్ షోలో కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలో తనను షోలో నుంచి బయటకు పంపాలని డిమాండ్ చేసింది. MeToo నేరస్తులకు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే అర్హత లేదని తేల్చి చెప్పింది.

షెర్లిన్ పై రాఖీ తీవ్ర వ్యాఖ్యలు

ఈ నేపథ్యంలో షెర్లిన్ పై రాఖీ సావంత్ ఓ రేంజిలో మండిపడింది. సాజిద్ కు పూర్తి స్థాయిలో సపోర్టు చేస్తూ షెర్లిన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మీడియా ముందు డ్రామాలు ఆడుతుందని మండిపడింది. షెర్లిన్ కనిపిస్తే కొట్టి చంపేస్తానని ఆగ్రహం వ్యక్తం చేసింది. డబ్బున్న వారిని టార్గెట్ చేసి డబ్బు లాగేందుకు లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తుందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో రాఖీ సావంత్ పై షెర్లిన్ ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాఖీ తన భర్తను చంపిందని సంచలన ఆరోపణలు చేసింది. అంతేకాదు, రాఖీ నుంచి తనకు ప్రాణహాని ఉందని జుహు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో రాఖీ సావంత్, ఆమె న్యాయవాది ఫల్గుణిపై కేసు నమోదు అయ్యింది.

బాలీవుడ్ లో బోల్డ్ స్టేట్‌మెంట్‌లకు రాఖీ పెట్టింది పేరు. 1997లో ‘అగ్నిచక్ర’ చిత్రంతో ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. జోరు కా గులాం, జిస్ దేశ్ మే గంగా రెహతా హై సహా పలు  చిత్రాలలో ఆమె సపోర్టింగ్ రోల్స్ చేసింది. పలు ఐటెమ్ సాంగ్స్ చేసి ఆకట్టుకుంది.  హిమేష్ రేషమియా స్వరపరిచిన మొహబ్బత్ హై మిర్చి అనే డ్యాన్స్ నంబర్‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  మస్తీ, మై హూ నా, షూటౌట్ ఎట్ లోఖండ్‌వాలా,  దిల్ బోలే హడిప్పా లాంటి సినిమాల్లో నటించింది.   రాఖీ టీవీ, రియాల్టీ షోలలో కూడా కనిపించింది. ఆమె బిగ్ బాస్ మొదటి సీజన్‌లో పాల్గొంది. ఈ షో యొక్క 14వ సీజన్‌లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. బిగ్ బాస్ 15 లో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

News Reels

Read Also: జేడీ చక్రవర్తి ‘దహిణి’ మూవీకి అరుదైన గౌరవం, స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక

Published at : 10 Nov 2022 09:27 AM (IST) Tags: Rakhi Sawant Sherlyn Chopra FIR On Rakhi Sawant advocate Falguni Brahmbhatt

సంబంధిత కథనాలు

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

Akshay Kumar trolled: ఈ సినిమాను కూడా చెడగొడతావా : అక్షయ్ కుమార్ పై నెటిజన్స్ ఫైర్ ?

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

కేజీయఫ్ తాత ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూత!

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Bigg Boss 6 Telugu: దెయ్యాల గదిలో ఆదిరెడ్డి, శ్రీహాన్ - వీరు మరీ ఇంత పిరికి వాళ్లా?

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Flop Directors Of Tollywood 2022 : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

Enthavaarugaani Teaser : చావు బతుకులతో సైంటిఫిక్ ఆట - 'ఎంతవారు గాని' టీజర్ విడుదల చేసిన అడివి శేష్

టాప్ స్టోరీస్

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

Bandi sanjay Drugs Case: బెంగళూరు డ్రగ్స్ కేసు రీ ఓపెన్ చేస్తామని బండి సంజయ్ హెచ్చరికలు ! అసలు ఆ కేసేంటి ? అందులో ఎవరు ఉన్నారు ?

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

సీబీఐ కేసుల్లో ఏపీ ప్రజాప్రతినిధులే టాప్- ఏపీలో 10 మందిపై నేరారోపణలు!

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Mandous Cyclone Alert : దూసుకొస్తున్న మాండౌస్‌- శుక్రవారం తీరం రాత్రి తీరం దాటేది ఎక్కడంటే?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు