Vivaha Bhojanambu Leaked: ‘వివాహ భోజనంబు’ మూవీ ఆన్‌లైన్‌లో లీక్.. సందీప్‌కు షాకిచ్చిన తమిళ్ రాకర్స్
హాస్య నటుడు సత్య హీరోగా నటించిన ‘వివాహ భోజనంబు’ సినిమా ఆన్‌లైన్‌లో లీకైంది. దీంతో దర్శక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు.
హస్యనటుడు సత్యను హీరోగా పరిచయం చేస్తూ హీరో సందీప్ కిషన్ నిర్మించిన ‘వివాహ భోజనంబు’ సినిమాకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఆన్‌లైన్‌లో పైరసీ వీడియోలను లీక్ చేసే తమిళ్ రాకర్స్.. ఓటీటీలో సినిమా విడుదలైన కొన్ని గంటల్లోనే ఆన్‌లైన్‌లో లీక్ చేసి దర్శక నిర్మాతలకు షాకిచ్చారు. ఈ చిత్రాన్ని శుక్రవారం (ఆగస్టు 27న) ‘Sony Liv’లో విడుదల చేశారు. ఈ ఓటీటీ సంస్థ స్ట్రీమ్ చేస్తున్న తొలి తెలుగు చిత్రం ఇదే. ఈ సినిమా ఇప్పుడు టెలిగ్రామ్, తమిళ్‌రాకర్స్, మవీరూల్జ్ తదితర పైరసీ వెబ్‌సైట్లలో చక్కర్లు కొడుతోంది.
కేవలం ‘వివాహ భోజనంబు’ మాత్రమే కాదు.. ఇటీవల విడుదలైన ‘పాగల్’, ‘ఇష్క్’, ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’, ‘క్రేజీ అంకుల్స్’ సినిమాలు కూడా విడుదలైన కొన్ని గంటలకే ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. పైరసీ వల్ల నిర్మాతలు, థియేటర్ నిర్వాహకులు భారీగా నష్టాలు ఏర్పడుతున్నాయి. ఈ సినిమా హక్కులను పొందే ఓటీటీలపై కూడా ఈ ప్రభావం పడుతుంది. పైరసీ వీడియోల వల్ల వ్యూస్ తగ్గిపోతాయి.
కరోనా సమయంలో పెళ్లి చేసుకున్నవారి కష్టాలను ఈ సినిమాలో ఫన్నీగా చూపించారు. లాక్‌డౌన్ వల్ల బంధువులంతా వరుడి ఇంట్లో చిక్కుకుపోతే ఎలా ఉంటుందనే ఈ సినిమా కథాంశం. ఇందులో కమెడియన్ సత్య పిసినారి వరుడిగా నటించాడు. 21 రోజులపాటు బంధువులను పోషించడానికి ఎలాంటి అతడు ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వాళ్ళని బయటకు పంపించడానికి ఎలాంటి ప్లాన్లు వేశాడనేది వినోదాత్మకంగా చూపించారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ కూడా లభించింది.
Also Read: ‘వివాహ భోజనంబు’ రివ్యూ.. కరోనాకు కామెడీ ట్రీట్మెంట్
ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. ఆనంది ఆర్ట్స్ సోల్జర్స్ ఫ్యాక్టరీ వెంకటాద్రి టాకీస్ సమర్పణలో కేఎస్ శినీష్, సందీప్ కిషన్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో సత్యకు జోడిగా ఆర్జవీ రాజ్ నటిస్తోంది. సుదర్శన్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శివన్నారాయణ, టీఎన్‌ఆర్, కల్పలత, కీర్తి, నిత్య శ్రీ తదితరులు నటించారు. ఈ చిత్రానికి మణికందన్ సినిమాటోగ్రఫీ అందించారు. చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేశారు. అనివీ సంగీతం అందించారు.
Also Read: బుల్లెట్ బండి.. భలే దూసుకెళ్తోంది, ఇంతకీ ఎవరీ మోహన భోగరాజు?
Also Read: ప్రీ-రివ్యూ: శ్రీదేవి సోడా సెంటర్ vs ఇచ్చట వాహనాలు నిలుపరాదు, ఏది బెస్ట్?
Also Read: వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!
Also Read: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది