Sandalwood Drug Case: హాస్పిటల్‌లో సంజన గల్రానీ.. దేవుడిపైనే భారమంటున్న రాగిణి ద్వివేది
శాండల్ వుడ్ డ్రగ్స్ కేసులో అరెస్టై బెయిల్ పై బయటకొచ్చిన నటి సంజన ఆసుపత్రిపాలైంది. తాము ఏ తప్పూ చేయలేదని ఆమె తల్లిచెబుతుంటే...దేవుడి ప్లాన్ పై నమ్మకం ఉండాలని మరో నిందుతురాలు రాగిణి అంటోంది.
ఏడాది క్రితం శాండల్‌వుడ్‌లో కలకలం రేపిన డ్రగ్స్ ఇష్యూ మళ్లీ తెరపైకి వచ్చింది. రాగిణి ద్వివేది, సంజన నుంచి శాంపిల్స్ తీసుకున్న సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబరేటరీ(CFSL) వాళ్లిద్దరూ డ్రగ్స్ తీసుకున్నారని రిపోర్ట్ విడుదల చేయడంతో మళ్లీ కలకలం మొదలైంది. అయితే ఈ కేసులో నిందుతురాలైన సంజనా గల్రాని అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్టు ఆమె తల్లీ రేష్మా గల్రాని తెలిపారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, పేదలకు నిత్యం అన్నదానం చేస్తున్నామని చెప్పారు.
ఈ కేసులో మరో నిందితురాలైన రాగిణి ద్వివేది కూడా స్పందించింది. ‘‘దేవుని ప్లాన్‌పై నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉంటేనే గెలవడం సాధ్యం’’ అని తన ఇన్‌స్టాగ్రాం పేజీలో పోస్ట్ చేసింది. ఈ కేసు తర్వాత ఇంటికే పరిమితమైన రాగిణి మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించింది. ఈ కేసులో ఏం చేయాలనేదానిపై లాయర్‌ను సంప్రదిస్తున్నానని తెలిపింది.
Also Read: చిక్కుల్లో హీరోయిన్ సంజన, రాగిణి.. డ్రగ్స్ కేసులో కీలక ఆధారాలు
కన్నడ చిత్ర సీమలో ఎంతోమంది ప్రముఖులు నిషేధిత డ్రగ్ యూజర్లేనని బెంగుళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. రాగిణి ద్వివేది - సంజన గల్రానితో పాటు డ్రగ్స్ తో సంబంధం ఉన్న పలువురుని సీసీబీ అరెస్టు చేసింది. మాదకద్రవ్యాల వినియోగం - సరఫరా కేసులో సెప్టెంబర్ 7న రాగిణి ద్వివేదిని.. సెప్టెంబర్ 9న సంజనను అరెస్ట్ చేశారు. ఇద్దరూ 3 నెలలకు పైగా బెంగుళూరులోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉండి బెయిల్ పై బయటికి వచ్చారు.
డ్రగ్స్ కేసులో రాగిణి ద్వివేది - సంజనా గల్రాని తో పాటు మరో 25 మందిపై చార్జిషీట్ ఫైల్ అయింది. 2019 మే 26న రాగిణి ద్వివేది బర్త్ డే పార్టీలో డ్రగ్స్ సరఫరా చేయడం.. ప్రియుడు రవిశంకర్ తో కలసి ఓ హోటల్ లో నిర్వహించిన పార్టీలో ఎక్స్టసీ డ్రగ్ మాత్రలు తీసుకోవడం.. ఇతరులకూ సరఫరా చేయడం వంటి వాటిని ఈ చార్జిషీట్ లో ప్రస్తావించారు. అలానే సంజనకు డ్రగ్స్ వినియోగం, సరఫరాతో సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. FSL రిపోర్టులో హీరోయిన్లు ఇద్దరూ డ్రగ్స్ తీసుకున్నట్లు వెల్లడైంది. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర.. రాష్ట్రంలో మత్తు దందాను నియంత్రిస్తామన్నారు. మత్తు పదార్థాలతో యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.
Also Read: హ్యాపీ బర్త్ డే ప్రియదర్శి.. కెమెరా మ్యాన్ అవ్వాలనుకుని నటుడయ్యాడు, సీనియర్‌తో పెళ్లి!
Also Read:వ్యాపారం మొదలుపెట్టిన కీర్తి సురేష్.. మహానటి ప్లానింగ్ అదుర్స్!
Also Raed: క్లీన్‌చిట్ ఇచ్చిన కేసులో ఈడీ నోటీసులా..? టాలీవుడ్ డ్రగ్స్ కేసులో తెర వెనుక ఏం జరుగుతోంది..?
Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..