అన్వేషించండి

హ్యాపీ బర్త్ డే ప్రియదర్శి.. కెమెరా మ్యాన్ అవ్వాలనుకుని నటుడయ్యాడు, సీనియర్‌తో పెళ్లి!

బ్రహ్మానందం పేరు వింటే మనకు తెలియకుండా నవ్వు వచ్చేస్తుంది. అలాగే ప్రియదర్శిని చూస్తే.. ‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’ అనే డైలాగ్ తప్పకుండా గుర్తుకొస్తుంది.

ప్రియదర్శి.. ఈ పేరు వింటేనే మన మోముపై తెలియకుండానే చిరునవ్వు విరుస్తుంది కదూ. ముఖ్యంగా ‘‘నా సావు నేను చస్తా.. నీకెందుకు?’’ అనే డైలాగ్ వెంటనే గుర్తుకొచ్చేస్తుంది. ప్రియదర్శి కామెడీ చేస్తుంటే.. ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు ఉండదు. గులాబీ మొక్కకు అంటు కట్టినట్లు పద్ధతిగా.. ఎంతో సహజంగా ప్రియదర్శి నటన ఉంటుంది. అతడి విసిరే పంచులే కాదు.. భావోద్వేగ సన్నివేశాలు సైతం ప్రేక్షకుడి గుండెను సుతిమెత్తగా తాకుతాయి. అతడి వాయిస్ వింటే చాలు.. మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. యానిమేటేడ్ సినిమా ‘ఫ్రోజెన్’లో మంచు బొమ్మకు మాటలిచ్చి భలే చక్కిలిగిలి పెట్టాడు. వరుస సినిమాలతోనే కాకుండా.. వెబ్‌సీరిస్‌లతో సైతం తన ప్రతిభను చాటుతున్న ప్రియదర్శికి టాలీవుడ్‌లో అవకాశాలు అంత ఈజీగా రాలేదు. సినిమాలపై ఉన్న పిచ్చి.. నటనలో ప్రతిభ.. అతడికి అవకాశాలను తెచ్చిపెట్టాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు (ఆగస్టు 26) ప్రియదర్శి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు శుభాక్షాంక్షలు చెబుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకుందాం. 

ప్రియదర్శి హైదరాబాద్‌లో జన్మించాడు. ఆయన తండ్రి పులివకొండ సుబ్బాచారి ప్రొఫెసర్. ప్రియదర్శికి పదేళ్లు వచ్చే వరకు ఓల్డ్ వారి తల్లిదండ్రులు ఓల్డ్ సిటీలోనే ఉండేవారు. ఆ తర్వాత గచ్చిబౌలీ, ఇప్పుడు చందానగర్‌లో ఉంటున్నారు. ప్రియదర్శి భార్య రిచా నవలా రచయిత్రి కావడం గమనార్హం. ప్రియదర్శి.. హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్స్‌లో పీజీ చేశాడు. ఆ తర్వాత సినిమాల వైపు ప్రయాణం మొదలుపెట్టాడు. అయితే, ప్రియదర్శి కెమేరా మ్యాన్‌గా అవ్వాలనుకుని సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడట. ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ షార్ట్‌ఫిల్మ్ చేసేవాడు. ఆ తర్వాత నటనపై ఆసక్తి కలిగి.. కెమేరా ముందుకొచ్చాడు. 

2016లో ‘టెర్రర్’ మూవీలో తీవ్రవాదిగా నటించాడు. అయితే, అతడి రెండో చిత్రం ‘పెళ్లి చూపులు’ ద్వారానే అసలైన గుర్తింపు లభించింది. ఆ తర్వాత ప్రియదర్శికి అవకాశాలు క్యూకట్టాయి. కేవలం కామెడీ క్యారెక్టర్లు, హీరో ఫ్రెండ్‌గానే స్థిరపడకుండా.. కొన్ని చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ తన ప్రతిభను చాటుతున్నాడు. ‘మల్లేశం’ సినిమాలో ప్రియదర్శి నటనకు మరిన్ని మంచి మార్కులు పడ్డాయి. ‘జాతిరత్నం’ సినిమాల్లో ఒక రత్నంగా నవ్వులు పూయించాడు. ‘మెయిల్’, ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వంటి వెబ్ సీరిస్‌లతో కూడా ప్రియదర్శి ఆకట్టుకుంటున్నాడు. 

Also Read: ‘బిగ్‌బాస్-5’ బిగ్ అప్‌డేట్: క్వారంటైన్‌లో కంటెస్టెంట్లు.. టెలికాస్ట్ తేదీ ఇదేనా?

ప్రియదర్శి.. రిచా శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే, యూనివర్శిటీలో చదువుకొనే రోజుల్లో రిచా ప్రియదర్శికి సీనియర్ కావడం విశేషం. 2018లో ఈ జంట పెళ్లితో ఒక్కటయ్యారు. ‘‘సినిమా తనకు జీవితమైతే.. తన జీవితం రిచా’’ అని ప్రియదర్శి ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. సినిమాల్లోకి వచ్చిన మొదట్లో ఆడిషన్స్‌కు వెళ్లేటప్పుడు బట్టలు కొనుక్కోడానికి తన భార్య రిచానే డబ్బులు ఇచ్చేదని ప్రియదర్శి తెలిపాడు. తన మొబైల్‌, ట్రావెల్‌ ఖర్చులను కూడా ఆమే భరించేందన్నాడు. ప్రియదర్శి నటించిన ‘ఇచ్చట వాహనాలు నిలుపురాదు’ విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం వెంకటేష్, వరుణ్ తేజ్ నటిస్తున్న ‘F3’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాల్లో ప్రియదర్శి నటిస్తున్నాడు. 

టాప్ హెడ్ లైన్స్

Memu Copulam Series OTT : మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
మెగా బ్రదర్ విలేజ్ కామెడీ సిరీస్ - ఈ ఓటీటీలో ఫ్రీగా చూసెయ్యొచ్చు... ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
I'm Game New Release Date : దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
దుల్కర్ సల్మాన్ యాక్షన్ థ్రిల్లర్ పోస్ట్ పోన్ - కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Vishwanath And Sons First Review - 'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
'విశ్వనాథ్ అండ్ సన్స్' ఫస్ట్ రివ్యూ: అత్తారిల్లు, మిస్టర్ పర్ఫెక్ట్ గుర్తొస్తాయా? సూర్య సినిమా టాక్ ఎలా ఉందంటే?
NTR Discharge : ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్
ఆస్పత్రి నుంచి ఎన్టీఆర్ డిశ్చార్జ్ - వైద్య బృందంతో ఫోటో వైరల్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
This Week Theatrical Releases : సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ To అగధ వరల్డ్ - శుక్రవారం 6 కొత్త మూవీస్ రిలీజ్... మీ ఛాయిస్ ఏంటి?
Embed widget