Kaliyuga Pattanam Lo: కలియుగం పట్టణంలో ఏం జరిగింది? డిఫరెంట్ ఫిలింతో విశ్వ కార్తికేయ
బాలనటుడిగా పలు సినిమాల్లో అలరించిన విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న తాజా సినిమా 'కలియుగ పట్టణంలో'. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
విశ్వ కార్తికేయ (Vishwa Karthikeya) తెలుగు ప్రేక్షకులకు తెలుసు. అయితే... బాల నటుడిగా అతడిని ప్రేక్షకులు చూశారు. నందమూరి బాలకృష్ణ 'అధినాయకుడు', కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు 'శివ శంకర్', రాజశేఖర్ 'గోరింటాకు', శ్రీకాంత్ 'లేత మనసులు' తదితర సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశారు. ఇప్పుడు ఆయన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. 'జై సేన', 'కళాపోషకులు', 'అల్లంత దూరాన' వంటి సినిమాలు చేశారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా 'కలియుగ పట్టణంలో'. ఈ సినిమా లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే...
'కలియుగ పట్టణంలో' ఏం జరిగింది?
Kaliyuga Pattanam Lo movie shooting wrapped up: విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'కలియుగం పట్టణంలో'. నాని మూవీ వర్క్స్ అండ్ రామా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతోంది. దీంతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కె. చంద్ర ఓబుల్ రెడ్డి, జి మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
'కలియుగం పట్టణంలో' షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ''న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్లు కొత్త జానర్లలో కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూ యూత్, కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కొత్త దర్శకులు సిల్వర్ స్క్రీన్ మీద అద్భుతాలు సృష్టిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్టులతో వచ్చే చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అటువంటి జాబితాలో మా 'కలియుగం పట్టణంలో' కూడా ఉంటుంది. దర్శకుడిగా తన తొలి ప్రయత్నంలో డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని రాసిన కథతో దర్శకుడు రమాకాంత్ రెడ్డి ఈ సినిమా చేశారు. రషెస్ చూసుకున్నాం. సినిమా బాగా వచ్చింది. కలియుగ పట్టణంలో ఏం జరిగింది? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడుగా చేస్తున్నాం. ఫిబ్రవరిలో సినిమాను విడుదల చేయాలనేది మా ప్లాన్. త్వరలో ఇతర వివరాలు వెల్లడిస్తాం'' అని అన్నారు.
Also Read: మహేష్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్... నటుడిగా వేణు స్వామి ఫ్లాప్ షో, అందుకే, ఇండస్ట్రీ మీద పడ్డారా?
ఆల్రెడీ విడుదలైన 'కలియుగ పట్టణంలో' సినిమా పోస్టర్లు చూస్తే... యాక్షన్ బ్యాక్ డ్రాప్ అనేది అర్థం అవుతోంది. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు భిన్నంగా ఆయుషి పటేల్ గన్ పట్టుకుని ఎవరికో గురి పెట్టినట్లు అర్థం అవుతోంది. మరి, సినిమా ఎలా ఉంటుందో? 'కలియుగ పట్టణంలో' ఏం జరిగిందో? వెయిట్ అండ్ సి. ఈ సినిమా విడుదలకు ముందు ఇండోనేషియా భాషలో రూపొందే సినిమాలో నటించే అవకాశాన్ని విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ అందుకున్నారు.
Also Read: బెల్లంకొండ సినిమాకు పవన్ కళ్యాణ్ టైటిల్, అభిమానం చూపించిన దర్శకుడు?
విశ్వ కార్తికేయ, ఆయుషీ పటేల్ జంటగా నటించిన ఈ సినిమాలో దేవి ప్రసాద్ కీలక పాత్ర చేశారు. ఇంకా ఈ చిత్రానికి కూర్పు: గ్యారీ బీహెచ్, పాటలు: చంద్రబోస్ - భాస్కర భట్ల రవికుమార్, ఛాయాగ్రహణం: చరణ్ మాధవనేని, సంగీత దర్శకుడు : అజయ్ అరసాడ, నిర్మాణ సంస్థలు: నాని మూవీ వర్క్స్ - రామా క్రియేషన్స్, నిర్మాతలు: డాక్టర్ కె. చంద్ర ఓబుల్ రెడ్డి - జి మహేశ్వర రెడ్డి - కాటం రమేష్, దర్శకుడు : రమాకాంత్ రెడ్డి.