అన్వేషించండి
Advertisement
Vijay Deverakonda: పూరితో విజయ్ హ్యాట్రిక్ సినిమా ప్లాన్ - ఈసారి సోషియో ఫాంటసీ స్టోరీ!
పూరి జగన్నాధ్, విజయ్ దేవరకొండ కలిసి హ్యాట్రిక్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ కాంబినేషన్ లో 'లైగర్' అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే పూరి, విజయ్ కలిసి మరో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించింది. అదే 'జనగణమన'. ఈ సినిమా పూజా కార్యక్రమాలు కూడా జరుపుకుంది. వరుసగా ఈ కాంబినేషన్ లో రెండు సినిమాలు రావడం చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడు వీరిద్దరూ కలిసి హ్యాట్రిక్ సినిమాకి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. 'జనగణమన' సినిమా చివరి దశలో కొత్త సినిమాను అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నారు పూరి జగన్నాధ్. 'లైగర్', 'జనగణమన' కమర్షియల్ స్టోరీస్ కాగా.. మూడో సినిమాకి మాత్రం సోషియో ఫాంటసీ జోనర్ ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది.
అంటే 'జగదేకవీరుడు అతిలోకసుందరి' టైపులో అన్నమాట. నిజానికి పూరి జగన్నాధ్ తన ఇన్నేళ్ల కెరీర్ లో మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేశారే కానీ ఇలాంటి జోనర్ ని టచ్ చేయలేదు. విజయ్ కూడా యూత్ ఓరియెంటెడ్ కథలతో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి సోషియో ఫాంటసీ కథతో సినిమా చేయాలనుకుంటున్నారు. మొత్తానికి పూరి ఇప్పట్లో విజయ్ దేవరకొండని వదిలేలా లేరు. వరుసగా మూడు సినిమాలు చేస్తున్నారంటే వీరిద్దరికి మంచి బాండ్ కుదిరిందనే చెప్పాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఎడ్యుకేషన్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion