Ravi Teja: 'రెమ్యునరేషన్ కోసం నేనెందుకు ఇబ్బంది పెడతా?' రూమర్స్ పై రవితేజ రియాక్షన్!
రవితేజ రెమ్యునరేషన్ గురించి నిర్మాతను బాగా ఇబ్బంది పెడుతున్నారని వార్తలొచ్చాయి.
మాస్ మహారాజ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రామారావు ఆన్ డ్యూటీ'. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాతో శరత్ మండవ టాలీవుడ్ కి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. జూన్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభుత్వ ఉద్యోగి రామారావు పాత్రలో రవితేజ కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చాలా రూమర్స్ వినిపించాయి.
ముఖ్యంగా రవితేజ రెమ్యునరేషన్ గురించి నిర్మాతను బాగా ఇబ్బంది పెడుతున్నారని వార్తలొచ్చాయి. రవితేజ చెప్పిన రెమ్యునరేషన్ ఒకటని.. అయితే డబ్బింగ్ చెప్పే ముందు సడెన్ గా రెమ్యునరేషన్ పెంచేశారని, అడిగినంత ఇవ్వకపోతే డబ్బింగ్ చెప్పనని, ప్రమోషన్స్ లో కూడా పాల్గొననని బెదిరించారని ఇలా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని.. ఇటీవల ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొని ప్రూవ్ చేశారు రవితేజ.
ఇక రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఈ రూమర్స్ పై మరింత క్లారిటీ ఇచ్చారు రవితేజ. గాసిప్స్ అనేవి వస్తుంటాయని.. అవన్నీ పనీపాటా లేనివాళ్లు రాస్తుంటారని.. వాటిని పట్టించుకోనని స్పష్టం చేశారు రవితేజ. ఈ సినిమాకి తను నిర్మాతగా కూడా వ్యవహరించానని.. అలాంటప్పుడు రెమ్యునరేషన్ గురించి నేనెందుకు ఇబ్బంది పెడతానని ప్రశ్నించారు. పైగా ఈ సినిమా నిర్మాత సుధాకర్ తనకు మంచి ఫ్రెండ్ అని.. అలాంటి వ్యక్తికి శత్రువులెవరూ ఉండరని అన్నారు. అంతమంచి నిర్మాత ఉన్నప్పుడు సమస్యలెందుకు వస్తాయని అన్నారు.
యూనిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా 'రామారావు ఆన్ డ్యూటీ' తెరకెక్కుతోంది. ఎస్ఎల్‌వీ సినిమాస్, ఆర్‌టీ టీం వర్క్స్ పతాకాలపై యువ నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, సంగీతం: సామ్ సీఎస్.
Also Read : నాగ చైతన్య కాదు, ఆ తమిళ సినిమా రీమేక్‌లో రానా
Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?
View this post on Instagram