By: ABP Desam | Updated at : 19 Jul 2022 03:26 PM (IST)
'సలార్'లో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'సలార్' అనే సినిమాలో నటిస్తున్నారు. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారు ప్రభాస్. అందులో ఒకటి రగ్డ్ అండ్ మ్యాన్లీ లుక్ కాగా.. మరొకటి కొంచెం క్లాస్ గా కనిపించే క్యారెక్టర్ అని తెలుస్తోంది. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాలో ప్రభాస్ ఫ్యాన్స్ కోసం చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ప్లాన్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. శ్రద్దా కపూర్ తో ఐటెం సాంగ్ ఉండబోతుందని సమాచారం. అలానే మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో కనిపిస్తారట. దీని గురించి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు కానీ దాదాపు పృథ్వీరాజ్ ని ఫిక్స్ చేసినట్లే అని చెబుతున్నారు.
అలానే యష్ కూడా తళుక్కున మెరుస్తాడట. యష్ గెస్ట్ రోల్ అనగానే.. మల్టీవర్స్ కాన్సెప్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి. అలానే ఇప్పుడొక భారీ యాక్షన్ సీన్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం.. ఒక యాక్షన్ ఎపిసోడ్ ని ఓ పెద్ద లోయలో షూట్ చేయబోతున్నారట. ఈ ఎపిసోడ్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అవుతుందని నమ్మకంగా చెబుతున్నారు. పిక్చరైజేషన్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందట. మొత్తానికి ఈ సినిమాతో ప్రభాస్ ఫ్యాన్స్ కి ఫీవర్ తెప్పించేలా ఉన్నారు ప్రశాంత్ నీల్.
మరోపక్క ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' సినిమా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలానే నాగశ్విన్ దర్శకత్వంలో 'ప్రాజెక్ట్ K' సినిమాలో నటిస్తున్నారు ప్రభాస్. దీంతో పాటు సందీప్ రెడ్డి వంగాతో 'స్పిరిట్' సినిమా కమిట్ అయ్యారు. ఈ సినిమాల మధ్యలో దర్శకుడు మారుతి తీయబోయే ఓ కామెడీ ఎంటర్టైనర్ లో నటిస్తారని అంటున్నారు.
Also Read : నాగ చైతన్య కాదు, ఆ తమిళ సినిమా రీమేక్‌లో రానా
Also Read : చెన్నై అపోలో ఆస్పత్రిలో మణిరత్నం, ఆందోళనలో ఫ్యాన్స్ - ఆయనకు ఏమైందంటే?
Bimbisara Movie Box Office Phenomena : 'బింబిసార' - టాలీవుడ్ బాక్సాఫీస్‌కు పునర్జన్మ!
Jhanvi Kapoor: ‘ప్రతి రోజు నిన్ను మిస్ అవుతున్నా అమ్మా’ - జాన్వీ కపూర్ భావోద్వేగం
Google Surprises To RRR Team : 'ఆర్ఆర్ఆర్' టీమ్‌కు గూగుల్ సర్ప్రైజ్
Vantalakka Memes: వంటలక్క ఈజ్ బ్యాక్, సోషల్ మీడియాలో మీమ్స్ జాతర - నవ్వకుండా ఉండలేరు!
Sridevi Birth Anniversary: బాలీవుడ్లో శ్రీదేవిని స్టార్ చేసినవి దక్షిణాది సినిమాలే - హిందీలో అతిలోక సుందరి చేసిన సౌత్ రీమేక్స్ ఇవే!
Karthikeya 2 Movie Review - కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?
TDP On Madhav : మాధవ్ వీడియోను అమెరికా ఫోరెన్సిక్ ల్యాబ్‌లో టెస్ట్ చేయించిన టీడీపీ - రిజల్ట్ ఏమిటంటే ?
Independence Day 2022: ఎర్రకోట వద్ద పదివేల మంది పోలీసులు, 5 కిలోమీటర్ల వరకూ నో ఫ్లైయింగ్ జోన్
Srinivas Goud Firing : కాల్పులు జరిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ - పోలీసు దగ్గర ఎస్ఎల్ఆర్ తీసుకుని మరీ ..