Vijay Deverakonda: మేం మరీ ఫూల్స్ కాదు - దిల్ రాజు వల్ల ఆ రోజు బాగా హర్ట్ అయ్యా - విజయ్ షాకింగ్ కామెంట్స్!
దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా ఆడిషన్స్ కు వెళ్లే తనను సెలెక్ట్ చేయకపోవడం పట్ల బాగా హర్ట్ అయినట్లు చెప్పారు విజయ్ దేవరకొండ. ఏదో ఒక రోజు మీ అందరికీ చూపిస్తారా? అనేలా కోపం వచ్చిందన్నారు.
Vijay Deverakonda About Family Star Movie And Dil Raju: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి పరుశురామ్ దర్శకత్వం వహించగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఇప్పటికే విజయ్, పరుశురామ్ ‘గీతగోవిందం’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. వీరి కాంబోలో వస్తున్న’ఫ్యామిలీ స్టార్’ మీద ప్రేక్షకులలో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
లాజిక్ లేకుండా సినిమా తీసేంత ఫూల్స్ కాదు- విజయ్
ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషనల్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. తాజాగా హీరో, హీరోయిన్లు విజయ్, మృణాల్ తో పాటు నిర్మాత దిల్ రాజు ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ సినిమా ట్రైలర్ లో లీటర్ పెట్రోల్ కొట్టిస్తే డ్రాప్ చేస్తా అనే వ్యక్తి, ‘కల్యాణి వచ్చా వచ్చా’ అనే పాటలో మాత్రం చాలా లావిష్ గా కనిపించారు. అది దిల్ రాజు ఎఫెక్టా? అనే ప్రశ్నకు దిల్ రాజు స్పందించారు. “5వ తారీఖు వరకు ఆగితే అసలు విషయం అర్థం అవుతుంది. నేను కూడా ఈ పాయింట్ గురించి చర్చించడం చూశాను. నిజానికి ఆయనది ఈ సినిమాలో పిసినారి క్యారెక్టర్ కాదు. జాగ్రత్తపరుడు. పసినారికి, జాగ్రత్తపరుడికి చాలా తేడా ఉంది” అని దిల్ రాజు తెలిపారు. ఇదే ప్రశ్నకు విజయ్ దేవరకొండ కూడా స్పందించారు. “పెట్రోల్ కు డబ్బులు అడుగుతున్నడు. ఇక్కడ సాంగ్ ఇంత రిచ్ గా ఉందని అందరూ అనుకుంటున్నారా? లేదంటే మీరు కావాలనే అలా ఓ ప్రశ్న వేశారా? నిజానికి సినిమాలు చూసే వాడికి ఈ డౌట్ రాకూడదు. డ్రీమ్ సాంగ్ అనే కాన్సెప్ట్ మనం పుట్టినప్పటి నుంచి ఉంది. నా దగ్గర గోవాకు బస్సులో వెళ్లడానికి డబ్బులు లేనప్పుడు కూడా యుఎస్ కు ఫ్లైట్ లో వెళ్లాలని కలగన్నా. మేం మరీ అంత పూల్స్ కాదు. మరీ అంత లాజిక్ లేకుండా సినిమా చేయం. ఎవరికైతే ఇలాంటి డౌట్స్ ఉన్నాయో, వారిందరికీ ఏప్రిల్ 5 నాడు క్లారిటీ వస్తుంది” అని చెప్పుకొచ్చారు.
ఆరోజు బాగా హర్ట్ అయ్యాను- విజయ్
ఒకప్పుడు దిల్ రాజు బ్యానర్ లో సినిమా ఆడిషన్ కు వెళ్లినా అవకాశం రాని విజయ్ దేవరకొండ, ఇప్పుడు అదే బ్యానర్ లో పెద్ద సినిమా చేయడం ఎలా అనిపిస్తుంది? అనే ప్రశ్నకు దిల్ రాజు ఆసక్తికర సమాధానం చెప్పారు. “‘కేరింత’ కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి. విజయ్ కూడా వచ్చి ఆడిషన్ ఇచ్చి వెళ్లాడు. కానీ, తనకు క్యారెక్టర్ రాలేదు. ఈ విషయం నాకు ‘పెళ్లిచూపులు’ సినిమా టైమ్ లో తెలిసింది. ‘కేరింత’ విషయాన్ని మైండ్ లో నుంచి తీసెయ్ అని చెప్పాను” అని దిల్ రాజు తెలిపారు. ఆడిషన్స్ లో పాల్గొన్నా, క్యారెక్టర్ ఇవ్వకపోవడం పట్ల చాలా హర్ట్ అయినట్లు వెల్లడించారు విజయ్. “నేను ఆడిషన్స్ కు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. బాగా హర్ట్ అయ్యా. ఏదో ఒకరోజు మీ అందరికీ చూపిస్తారా? అనుకున్నాను. ఏప్రిల్ 5న హిట్ పడితే నాకు శాంతి కలుగుతుంది” అన్నారు.
Read Also: ఈ వారం థియేటర్లు, ఓటీటీలో సందడి చేసే మూవీస్ ఇవే - ఆ రెండు సినిమాలు మరింత స్పెషల్!