![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Vijay Deverakonda- Rashmika: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం!
Vijay Deverakonda, Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫిబ్రవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకోబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటిపై విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది.
![Vijay Deverakonda- Rashmika: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం! Vijay Deverakonda and Rashmika Mandanna to get engaged Vijay team react to engagement news Vijay Deverakonda- Rashmika: రౌడీ బాయ్, రష్మిక మందన్న ఎంగేజ్మెంట్ - ఇదీ అసలు విషయం!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/09/8bf2b6f9b0e477883a8979c059b6d2221704791308847544_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Vijay Deverakonda- Rashmika Engagement News: నేషనల్ క్రష్ రష్మిక మందన్న, రౌడీ హీరో విజయ్ దేవరకొండ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. వీరిద్దరు కలిసి రెండు సినిమాల్లో నటించారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి క్రేజ్ సంపాదించారు. వీరిద్దరి ఫెయిర్ చూడ చక్కగా ఉందనే టాక్ వినిపించింది. ఈ సినిమాల సమయంలోనే వీరిద్దరి మధ్య చనువు పెరిగింది. తరచుగా టూర్స్, డిన్నర్ పార్టీలకు వెళ్లేవారు. పలుమార్లు మీడియాకు కనిపించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపించాయి.
ఫిబ్రవరిలో రష్మిక, విజయ్ ఎంగేజ్ మెంట్
తమ గురించి వస్తున్న వార్తలను విజయ్ తో పాటు రష్మిక కూడా పలుమార్లు ఖండించింది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని వెల్లడించింది. అయినా, వీరి గురించి వార్తలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఇప్పుడు మరో లేటెస్ట్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిద్దరి నిశ్చితార్థం త్వరలో జరగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి సెకెండ్ వీక్లో ఈ ఎంగేజ్ మెంట్ ఉంటుందని తెలుస్తోంది.
ఎంగేజ్ మెంట్ వార్తలపై క్లారిటీ ఇచ్చిన విజయ్ టీమ్
తాజాగా తమ ఎంగేజ్ మెంట్ గురించి వస్తున్న వార్తలపై విజయ్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పింది. అవన్నీ జస్ట్ ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్పింది. వాటిని ఎవరూ నమ్మకూడదని సూచించింది. విజయ్ టీమ్ వివరణ ఇచ్చినప్పటికీ నెటిజన్లు మాత్రం కచ్చితంగా వచ్చే నెలలో వారి నిశ్చితార్థం జరుగుతుందంటూ పోస్టులు పెడుతున్నారు.
రష్మిక, విజయ్ కలిసి పలుమార్లు మాల్దీవ్స్ వెకేషన్కు వెళ్లారు. అక్కడ దిగిన ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇద్దరు ఒకే రకమైన దుస్తులు ధరించి ఎయిర్ పోర్టులో కనిపించడంతో వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అందరూ భావించారు. ఇక దీపావళి సందర్భంగా రష్మిక మందన్న విజయ్ వాళ్ల ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెట్టారు. దీపావళి సందర్భంగా ఫోటోలు షేర్ చేస్తూ ఇద్దరు ఒకే క్యాప్షన్ పెట్టడంతో వాళ్లిద్దరు విజయ్ ఇంట్లోనే దీపావళి జరుపుకున్నారని నెటిజన్లు కామెంట్స్ చేశారు. అయితే, విజయ్, రష్మిక మాత్రం తాము రిలేషన్ లో ఉన్నామనే మాటను ఇప్పటి వరకు అఫీషియల్ గా చెప్పలేదు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
ఇక రష్మిక, విజయ్ సినిమాల విషయానికి వస్తే, తాజాగా ‘యానిమల్’ మూవీతో రష్మిక బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. రణబీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ. 900 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ప్రస్తుతం అల్లు అర్జున్ తో కలిసి ఆమె ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. అటు సమంతతో కలిసి ఖుషి’ సినిమా చేసిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం ‘ఫ్యామిలీ స్టార్’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తోంది. అటు గౌతమ్ తిన్ననూరితో కలిసి మరో మూవీ చేస్తున్నాడు.
Read Also: కథతో కబడ్డీ ఆడుకున్నాడు, ‘హాయ్ నాన్న’ దర్శకుడిపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)