అన్వేషించండి

Vijay Devarakonda: రౌడీ ఇంట్లో స్పెషల్ పూజలు - తల్లి ప్రేమను చూపిస్తూ విజయ్ ట్వీట్!

దేశం మొత్తం తిరుగుతున్న తన కొడుకు సేఫ్ గా ఉండాలంటూ విజయ్ తల్లి ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించారు. 

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda_ నటించిన 'లైగర్'(Liger) సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు విజయ్ అండ్ టీమ్. ఈ నెల మొత్తం కూడా ప్రమోషన్స్ కోసం దేశం మొత్తం తిరుగుతున్నారు. ఇప్పటికే పలు నగరాలను సందర్శించగా.. ఇప్పుడు మరికొన్ని సిటీలకు వెళ్లనున్నారు. దేశం మొత్తం తిరుగుతున్న తన కొడుకు సేఫ్ గా ఉండాలంటూ విజయ్ తల్లి ఇంట్లో స్పెషల్ పూజలు నిర్వహించారు. 

వేదపండితులను తీసుకొచ్చి మరీ ప్రత్యేక పూజలు చేయించారు. తన తల్లి ప్రేమను సోషల్ మీడియా వేదికగా చూపించారు విజయ్. ఈ క్రమంలో కొన్ని ఫొటోలను షేర్ చేస్తూ.. 'ఈ నెల మొత్తం ఇండియాను చుట్టాల్సి ఉంది. ఇప్పటికే చాలా నగరాలు తిరిగాం. ఎంతో ప్రేమను పొందాం. కానీ మా అమ్మ రక్షణ అవసరమని భావించింది. అందుకే ఇంట్లో పూజ చేసి, అందరికీ తాయత్తులు కట్టింది. ఇక మేం ప్రయాణం కొనసాగిస్తున్నంతసేపు ఆమె ప్రశాంతంగా నిద్రపోతుంది' అంటూ రాసుకొచ్చారు విజయ్. 

విజయ్ షేర్ చేసిన ఫొటోల్లో అనన్య పాండే(Ananya Panday) కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మొదట్నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటివరకు నాలుగు పాటలు విడుదల కాగా, ఒక్కో దానికి ఒక్కో సంగీత దర్శకుడు పనిచేశారు. మొదట విడుదలైన ‘ది లైగర్ హంట్ థీమ్’కు విక్రం మోంట్రోస్, ‘అక్డీ పక్డీ’కి లిజో జార్జ్, డీజే చేటాస్, సునీల్ కశ్యప్, ‘Watt Laga Denge’కు సునీల్ కశ్యప్, ‘ఆఫట్’కు తనిష్క్ బగ్చి సంగీతం అందించారు.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత పూరి జగన్నాథ్, యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్నా పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండకు స్టార్‌డం తీసుకొచ్చిన అర్జున్ రెడ్డి విడుదలైన రోజే లైగర్ కూడా రిలీజ్ కానుండటంతో ఇది కచ్చితంగా సక్సెస్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

స్పోర్ట్స్ యాక్షన్ ప్రధానంగా సాగే ఈ సినిమాలో రమ్యకృష్ణ విజయ్ తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించారు. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలకపాత్రలో నటించారు. ప్రముఖ బాలీవుడ్ దర్శక - నిర్మాత కరణ్ జోహార్‌కు చెందిన ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ నిర్మించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మాతలు.

Also Read : రేపిస్టులను వదిలేస్తారా? గుజరాత్‌తో పాటు తెలంగాణ ప్రభుత్వానికీ పూనమ్ కౌర్ చురకలు?

Also Read : దేశభక్తి ఎప్పుడూ హిట్టే - నెత్తురు మరిగితే ఎత్తరా జెండా, కొట్టరా బాక్సాఫీస్ కొండ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Best Selling Cars: టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
టాటా పంచ్‌ను తోసేసిన హ్యుందాయ్ కారు - టాప్‌కు చేరిన ఆ కారు ఏది?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
Best Selling Smartphones: 2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
2024లో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్లు ఇవే - టాప్‌లో ఏ ఫోన్ ఉంది?
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Embed widget