‘Liger’ update: ' లైగర్ ' రిలీజ్ డేట్ ఇంకా ఎందుకు ఎనౌన్స్ చేయలేదో తెలుసా..
విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సెట్స్ మీదున్న 'లైగర్' పై భారీ అంచనాలున్నాయి. ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటికీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేదు..ఎందుకంటే…
ప్రస్తుతం సెట్స్ మీదున్న చిన్న సినిమాల నుంచి భారీ బడ్జెట్ మూవీస్ వరకూ అన్నింటికీ విడుదల తేదీలు వచ్చేశాయి. కానీ అత్యంత వేగంగా సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరీ జగన్నాథ్ మాత్రం తన లేటెస్ట్ మూవీ 'లైగర్' విడుదల తేదీ ఇప్పటికీ ప్రకటించలేదు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో..ఎప్పుడు విడుదలవుతుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సెకెండ్ వేవ్ లేకపోతే ఈపాటికే లైగర్ థియేటర్లలోకి వచ్చేసేది. కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో విడుదల కూడా వాయిదా పడకతప్పలేదు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న భారీ ప్రాజెక్టులన్నీ విడుదల తేదీలను ఎనౌన్స్ చేశాయి. 2022 సంక్రాంతి, సమ్మర్ బరిలో నిలిచేవి కూడా ఎప్పుడొస్తామన్నది అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ 'లైగర్' విడుదలపై మాత్రం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. కారణం ఏంటా అని ఆరాతీస్తే ' లైగర్' టీమ్ ను వీసా కష్టాలు వెంటాడుతున్నాయట.
తదుపరి షెడ్యూల్ అమెరికాలో ప్లాన్ చేశారట మేకర్స్. అక్కడ రెండు వారాల పాటూ జరిగే కీలక షెడ్యూల్ లో టైసన్ కూడా పాల్గొనబోతున్నాడట.మాజీ బాక్సింగ్ దిగ్గజం టైసన్ పిడిగుద్దులు అంటే తనకు చాలా భయమన్న విజయ్..తనకు బాక్సింగ్ కూడా తెలియకముందే మైక్ తెలుసన్నాడు. ఇంతకీ వచ్చిన సమస్య ఏంటంటే యూఎస్ షెడ్యూల్ కు సంబంధించిన వీసా ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని..అక్కడి షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాకే 'లైగర్' రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుందన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ లో విజయ్ అదరగొట్టేశాడనే కామెంట్స్ వచ్చాయి. మొత్తానికి ఇప్పటి వరకూ విజయ్ నటించిన సినిమాల్లో క్యారెక్టర్స్ ఓ లెక్క..లైగర్ లో పాత్ర మరో లెక్క. మరి బాక్సర్ గా విజయ్ ఏ మేరకు మెప్పిస్తాడో వెయిట్ అండ్ సీ...
Also Read: మహిళల్ని క్వశ్చన్ చేసినట్టు మగవారిని ఎందుకు ప్రశ్నించరు..సమంత పోస్ట్ వైరల్
Also Read: క్రిష్‌తో సినిమా అనగానే ఒప్పేసుకోమన్నా.. ‘కొండ పొలం’పై చిరు ఆసక్తికర వ్యాఖ్యలు
Also Read: విమానంలో పుట్టిన ‘మా’.. తొలి అధ్యక్షుడు ఆయనే.. ఇదే ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ చరిత్ర
Also Read: కొండ పొలం సమీక్ష: మట్టివాసన చూపించే సినిమా.. వైష్ణవ్ మళ్లీ కొట్టాడా?