Vidyullekha Raman: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...
విద్యుల్లేఖా రామన్ ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. ఇప్పుడు సన్నజాజిలా మారారు. అయితే... పెళ్లి తర్వాత కొంత బరువు పెరిగారట. అంతకు ముందు ఎందుకు తగ్గారు? కారణం ఏమిటి? అంటే...
![Vidyullekha Raman: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే... Vidyullekha Raman gained 3 to 4 kgs weight after marriage! But, Do you know how much reduced before that? Why reduced? Vidyullekha Raman: పెళ్లి తర్వాత బరువు పెరిగిన బుజ్జమ్మ! అంతకు ముందు ఎంత తగ్గింది? ఎందుకు తగ్గింది? అంటే...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/27/bdd6797934e5ae4c1d52058aa2336e14_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
విద్యుల్లేఖా రామన్ ఒకప్పుడు బొద్దుగా ఉండేవారు. 'రామయ్యా వస్తావయ్యా'తో మొదలు పెడితే... 'రన్ రాజా రన్', 'రాజు గారి గది', 'సరైనోడు' సినిమాల్లో ఆమె బొద్దుగా ఉన్నారు. ఆఖరికి 'వెంకీ మామ'లో కూడా కాస్త బొద్దుగా కనిపించారు. అటువంటి బుజ్జమ్మ ఉన్నట్టుండి ఒకసారి సన్నగా కనిపించి అందర్నీ సర్‌ప్రైజ్ చేశారు. అయితే... ఒక్క రోజులోనో, ఒక్క నెలలోలో ఆమె సన్నబడలేదు. రెండేళ్లు కష్టపడి, డైట్ మైంటైన్ చేసి సన్నబడ్డాడు. అసలు, సన్నాబడాలని అనుకోవడానికి గల కారణాలను ఆమె తాజాగా వివరించారు.
"నేను 2019లో స్నేహితులతో కలిసి కొడైకెనాల్ ట్రెక్కింగ్ కి వెళ్లాను. స్నేహితులతో పాటు ట్రెక్కింగ్ చేయలేకపోయా. అవుటాఫ్ షేప్ అయినట్టు అనిపించింది. నా డ్రస్సులు నాకు సరిపోవడం లేదు. ఫిట్ అవ్వడం లేదు. నా హెల్త్ కూడా ఎఫెక్ట్ అయ్యింది. నేను ప్రీ-డయాబెటిక్. పీసీఓ సమస్యలు కూడా ఉన్నాయి. అప్పుడు వెయిట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. సన్నబడ్డానను" అని విద్యుల్లేఖా రామన్ తెలిపారు. ప్రస్తుతం తన బరువు 69 కేజీలు అని ఆమె చెప్పుకొచ్చారు. పెళ్లి తర్వాత మూడు నుంచి నాలుగు కేజీల వరకూ పెరిగానని ఆమె అన్నారు. ఇప్పుడు అది తగ్గే పనిలో ఉన్నారట.
బరువు ఎలా తగ్గినదీ విద్యుల్లేఖా రామన్ వివరిస్తూ "నేను 20 కేజీల బరువు తగ్గాను. అందుకు రెండేళ్లు పట్టింది. డైట్ ఫాలో అయ్యాను. వ్యాయామాలు చేశాను. బరువు పెరుగుతూ, తగ్గుతూ ఉండేదాన్ని. ప్రోగ్రెస్ స్టడీగా ఏమీ ఉండేది కాదు. అలాగని, మోటివేషన్ ఎక్కడా కోల్పోలేదు. మనం ప్రోగ్రెస్ ను నమ్మాలంతే!" అని అన్నారు. హాస్యనటిగా విద్యుల్లేఖకు మంచి పేరు ఉంది. ఇప్పుడు కథానాయికగానూ కొన్ని సినిమాలు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం సంజయ్ తో ఆమె వివాహం అయిన సంగతి తెలిసిందే. ఓ డేటింగ్ యాప్‌లో మొదలైన వారి పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. పెళ్లి పీటలు ఎక్కించింది.
View this post on Instagram
Also Read: జైలులో ఎన్టీఆర్... ఎర్ర గాజులు... పిల్లలు... ప్రేక్షకులకు రాజమౌళి వదిలిన ప్రశ్నలు!
Also Read: పునీత్ రాజ్‌కుమార్ అలా కాదు... తాను మరణించే వరకూ ఆ విషయం ఎవ్వరికీ చెప్పలేదు - రాజమౌళి
Also Read: మహిళా నిర్మాతపై చీటింగ్ కేస్... కంప్లయింట్ చేసిన ప్రముఖ టాలీవుడ్ యాక్టర్?
Also Read: త్రివిక్రమ్‌కు, ఏపీ మంత్రి పేర్ని ప్రస్తావించిన ట్వీట్‌కు సంబంధం లేదు
Also Read: కంగనా రనౌత్ పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు... వివాదాస్పద వ్యాఖ్యలపై దర్యాప్తు చేయాలని ఆర్డర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)