అన్వేషించండి
Venkatesh: వెంకీ ఇంట్లో 'ఎఫ్3' టీమ్.. 'టీ' పార్టీలో మన స్టార్స్ బిజీ..
తాజాగా 'ఎఫ్3' టీమ్ కి వెంకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

వెంకీ ఇంట్లో 'ఎఫ్3' టీమ్..
విక్టరి వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా.. తమన్నా, మెహ్రీన్‌లు హీరోయిన్లుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన 'ఎఫ్2' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి ప్రస్తుతం సీక్వెల్ రూపొందుతోంది. 'ఎఫ్3' అనే టైటిల్‌తో రూపొందిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా 'ఎఫ్3' టీమ్ కి వెంకీ తన ఇంట్లో టీ పార్టీ ఇచ్చారు. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి, వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ముందుగా వరుణ్ ఈ పార్టీకి సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. 'వెంకీ బ్రో ఇంట్లో టీ పార్టీ ఎంజాయ్ చేస్తున్నాం' అంటూ ట్విట్టర్ లో రాసుకొచ్చారు. అలానే అనిల్ రావిపూడి.. 'షూటింగ్ గ్యాప్ మధ్యలో వెంకటేష్ గారింట్లో టీ బ్రేక్..' అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలో వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, రాజేంద్రప్రసాద్, అనిల్ రావిపూడి, రవిబాబు, సునీల్ కనిపించారు.
ఇక సినిమా విషయానికొస్తే.. 'ఎఫ్ 2' సినిమాలో భార్య, భర్తల మధ్య జరిగే గొడవలు, విడిపోవడం, ఆ తర్వాత మళ్లీ కలిసిపోవడం చూపించిన దర్శకుడు.. 'ఎఫ్ 3'లో మాత్రం డబ్బు సంపాదించేందుకు హీరోలు పడే కష్టాలు, దాని నుంచి వచ్చే వినోదాన్ని చూపించనున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ రేచీకటి ఉన్నవాడిగా.. వరుణ్ తేజ్ నత్తి ఉన్నవాడిగా నటిస్తున్నారని సమాచారం. మొదట ఈ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు వాయిదా పడే ఛాన్స్ ఉంది.
Tea time at venky bro’s house!!
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) November 7, 2021
Thanks for being such a lovely host!❤️❤️❤️#F3 @VenkyMama @AnilRavipudi @tamannaahspeaks @Mee_Sunil pic.twitter.com/Sb3a15sPij
Also Read: హీరో విశాల్ పొలిటికల్ ఎంట్రీ.. ఎప్పుడంటే..?
Before You Go
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ట్రెండింగ్ వార్తలు

Dr. Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion




















