News
News
X

Tamil Film Remake: నిన్న ‘దృశ్యం’, నేడు ‘అయోతి’ - మరో రీమేక్‌ మూవీలో వెంకటేష్?

టాలీవుడ్ హీరో వెంకటేష్, బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ మరో రీమేక్ కు రెడీ అవుతున్నారు. ‘దృశ్యం’ సినిమాతో అద్భుత విజయాన్ని అందుకోగా, మరో హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు.

FOLLOW US: 
Share:

హీరో వెంకటేష్, రానా కలిసి తాజా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. అయితే, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటం పట్ల విమర్శలు మాత్రం గట్టిగానే ఎదుర్కొంది. ఈ విమర్శలను ముందే ఊహించిన వెంకటేష్.. ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ‘రానా నాయుడు’ షాక్ నుంచి అభిమానులను బయటపడేయడానికి ఫ్యామిలీతో కూర్చొని చూడగలిగే ఒక థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామాతో వచ్చేందుకు రెడీ అవుతున్నారు.

‘దృశ్యం’ ప్రాంచైజీతో మంచి గుర్తింపు  

వెంకటేష్ ‘దృశ్యం’ ప్రాంచైజీని రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు. మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాలను, రీమేక్ చేసి చిత్రాలు చక్కటి ప్రజాదరణ పొందారు. తెలుగులో వెంకటేష్ కు, హీందీలో అజయ్ దేవగన్ కు మంచి మైలేజ్ తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో వెంకీ తమిళ బ్లాక్ బస్టర్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు.  

హిందీలో అజయ్ దేవగన్, తెలుగులో వెంకటేష్

ఇటీవల తమిళంలో విడుదలైన చిత్రం ‘అయోతి’ బాక్సాఫీస్ దగ్గర అద్భుత విజయాన్ని అందుకుంది. ఇందులో శశి కుమార్, ప్రీతి అస్రాని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమాను రీమేక్ చేయాలని వెంకటేష్ భావిస్తున్నారు. ఇప్పటికీ రీమేక్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది జూన్ లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్టు పట్ల వెంకటేష్ చాలా ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

మానవ విలువల ఆధారంగా తెరకెక్కిన ‘అయోతి

‘అయోతి’ అనే సినిమా తమిళంలో రూపొందింది. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని ఆర్ మంతిర మూర్తి తెరకెక్కించారు. ఈ సినిమా మానవీయ విలువలను బేస్ చేసుకుని తీశారు. ఈ చిత్రం మార్చి 3న విడుదలైంది. రిలీజ్ అయిన తొలి నాలుగు రోజులు ఈ సినిమాకు పెద్దగా కలెక్షన్లు రాలేదు. ఆ తర్వాత్ మౌత్ పబ్లిసిటీ బాగా వచ్చింది. ఇక సినిమాకు ప్రేక్షకులు పోటెత్తారు. బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.

అజయ్ దేవగన్ రీమేక్ చేస్తారా?

బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన తాజా చిత్రం ‘భోళ’. కార్తీ హీరోగా నటించిన తమిళ హిట్ మూవీ ‘కైతికి’ ఈ చిత్రం అధికారిక హిందీ రీమేక్. మార్చి 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అలనాటి అందాల తార టబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ఉత్తరాది సినీ అభిమానుల అభిరుచికి తగినట్లుగా ఈ చిత్రం చాలా మార్పులు చేర్పులు చేశారు. అయితే, అజయ్ ఈ మూవీని రీమేక్ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని, ఆ మూవీని రీమేక్ చేసే ఆలోచన లేదని అజయ్ సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్‌ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు

Published at : 17 Mar 2023 05:13 PM (IST) Tags: Daggubati Venkatesh Drishyam Ayothi remake Venkatesh New Move Ayothi

సంబంధిత కథనాలు

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

Priyanka Nalkari Wedding: గుడిలో రహస్య వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి, వరుడు ఎవరో తెలుసా?

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

ఆ సామాన్యుల చేతిలో ఆస్కార్ - పట్టరాని ఆనందంలో ‘ఎలిఫ్యాంట్ విష్పర్స్’ జంట

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

అలా చేయనన్నానని హీరోయిన్ పాత్ర నుంచి తొలగించారు: నటి సన

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Mohan Babu on Manoj: కుక్కలు మొరుగుతూనే ఉంటాయి పట్టించుకోను - మనోజ్ రెండో పెళ్లిపై మోహన్ బాబు రియాక్షన్

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

Ravi Teja Brother Raghu Son : యూత్‌ఫుల్ సినిమాతో హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు

టాప్ స్టోరీస్

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

పేపర్ లీక్‌ పై తప్పుడు ఆరోపణలు - బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

CM Jagan On Polavaram : పోలవరం ప్రాజెక్టును 45.7 మీటర్ల ఎత్తు వరకు నిర్మిస్తాం, అసెంబ్లీలో సీఎం జగన్ క్లారిటీ

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు - మళ్లీ ఎప్పుడంటే ?

Kavitha Supreme Court : ఈడీపై కవిత పిటిషన్‌పై విచారణ తేదీ మార్పు -  మళ్లీ ఎప్పుడంటే ?

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు

Hindenburg Research: అదానీ తర్వాత హిండెన్‌బర్గ్‌ టార్గెట్‌ చేసిన కంపెనీ ఇదే! వెంటనే 19% డౌనైన షేర్లు