The Ghost Movie First Single: 'ది ఘోస్ట్' ఫస్ట్ సింగిల్ - సోనాల్ తో నాగార్జున రొమాన్స్!
నాగార్జున, సోనాల్ చౌహాన్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ గీతం 'వేగం'ను విడుదల చేశారు
అక్కినేని నాగార్జున(Nagarjuna) నటిస్తోన్న లేటెస్ట్ సినిమా 'ది ఘోస్ట్'(The Ghost). సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా కనిపించనుంది. దీనికి ప్రవీణ్ సత్తారు(Praveen Sattharu) దర్శకత్వం వహించారు. ఇందులో నాగార్జున మాజీ 'రా' ఏజెంట్ పాత్రను పోషిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా గూస్ బంప్స్ వచ్చే యాక్షన్ సీన్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు చిత్రయూనిట్ చెబుతున్నారు. ఈ మూవీ ఓటీటీలో విడుదల కానుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అయితే, ఆ ప్రచారంలో నిజం లేదని, థియేటర్లలో సినిమాను విడుదల చేస్తామని ఇటీవలే చిత్ర బృందం క్లారిటీ ఇచ్చారు. అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసి.. సినిమాపై బజ్ పెరిగేలా చేశారు. తాజాగా సినిమాలో రొమాంటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నాగార్జున, సోనాల్ చౌహాన్ మీద చిత్రీకరించిన రొమాంటిక్ గీతం 'వేగం'ను విడుదల చేశారు. భరత్, సౌరబ్ ద్వయం ఈ పాటకు సంగీతం అందించగా.. కపిల్ కపిలన్, రమ్య బెహరా ఆలపించారు. కృష్ణ మాదినేని సాహిత్యం అందించారు.
ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమాతో నాగార్జున విజయం అందుకున్నారు. అందులో ఆయనది చిన్న పాత్ర అయినప్పటికీ... మంచి పేరు వచ్చింది. హిందీ ప్రేక్షకులు ఆయన పాత్ర గురించి మాట్లాడుతున్నారు. 'బ్రహ్మాస్త్ర' విజయం తర్వాత నాగార్జున నుంచి వస్తున్న సినిమా కావడంతో 'ది ఘోస్ట్' సినిమాపై హిందీ ప్రేక్షకులలో కూడా ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
నాగ్ సినిమా చెప్పిన టైంకే:
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున నటించిన 'ది ఘోస్ట్' సినిమాలు ఒకేరోజు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అక్టోబర్ 5న ఈ రెండు సినిమాలు రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకున్నాయి. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు ఒకేసారి రావడం మంచిది కాదనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో నాగార్జున వెనక్కి తగ్గుతారని అందరూ అనుకున్నారు. కానీ రిలీజ్ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తోంది 'ది ఘోస్ట్' టీమ్. ఈ సినిమా వాయిదా పడుతున్నట్లు వస్తోన్న వార్తల్లో నిజం లేదని నిర్మాతలు చెబుతున్నారు. మరోసారి రిలీజ్ డేట్ ప్రకటన చేయాలనుకుంటున్నారు. అంటే బాక్సాఫీస్ వద్ద పోటీ తప్పదేమో!
❤️❤️Love is in the air❤️❤️
— Praveen Sattaru (@PraveenSattaru) September 16, 2022
🏍 🛥 Speed is in his nature ✈️ 🚘
👑 King is here to steal your 💕 💕with #Vegam from #TheGhosthttps://t.co/NzjaVXHLwY#TheGhostOnOct5@iamnagarjuna @sonalchauhan7 @SVCLLP @nseplofficial @iamMarkKRobin @bharattsaurabh @SonyMusicSouth pic.twitter.com/iAspPBU2Wh