By: ABP Desam | Published : 15 Feb 2022 12:25 PM (IST)|Updated : 15 Feb 2022 01:07 PM (IST)
'గని'లో వరుణ్ తేజ్
నో మోర్ డౌట్స్... ఈ నెలలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'గని' (Ghani Movie). దీనిని ఫిబ్రవరి 25న విడుదల చేయనున్నట్టు నేడు ప్రకటించారు. సో... మార్చి 4 అనేది 'గని' విడుదల తేదీ లిస్టులో నుంచి తీసేయవచ్చు.
తొలుత 'గని' సినిమాను గత ఏడాది డిసెంబర్ 24న విడుదల చేయాలనుకున్నారు. కరోనా, ఇతర కారణాల వల్ల వాయిదా వేశారు. ఆ తర్వాత ఈ ఏడాది మార్చి 25న సినిమాను విడుదల చేయాలనుకున్నారు. ఆ తేదీకి 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' విడుదలకు సిద్ధం కావడంతో, ఆ సినిమా కోసం మార్చి 25 నుంచి 'గని' తప్పుకోక తప్పలేదు. 'ఆర్ఆర్ఆర్' విడుదల తేదీ ప్రకటించిన తర్వాత ఫిబ్రవరి 25న లేదంటే మార్చి 4న 'గని' సినిమాను (Ghani Movie Latest Release Date) విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. ఇప్పుడు ఫైనల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 25న సినిమాను విడుదల చేస్తామని వెల్లడించారు.
కిరణ్ కొర్రపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... అల్లు అరవింద్ సమర్పణలో రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ పతాకాలపై సిద్ధు ముద్ద, అల్లు బాబీ 'గని' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సయీ మంజ్రేకర్ కథానాయిక. ప్రత్యేక గీతం 'కొడితే...'లో తమన్నా డాన్స్ చేశారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర తదితరులు నటించారు.
Also Read: మంజులతో 'కార్తీక దీపం' నిరుపమ్ లిప్ లాక్! టీవీ షోలో ఇద్దరూ
Vijay Devarakonda Samantha: కశ్మీర్ కుర్రాడికి, తమిళ అమ్మాయికి ముడి వేసిన 'ఖుషి'
Karthika Deepam మే 17 ఎపిసోడ్: ఫొటోలతో బాధను పంచుకుంటున్న నిరుపమ్- హిమ సంగతి తేల్చేందు జ్వాలను ప్రయోగిస్తున్న సౌందర్య
Lakshmi Manchu: లక్ష్మీ మంచు - నిద్ర లేచింది మహిళా లోకం
Guppedantha Manasu మే 17 ఎపిసోడ్: వసుధారను రిషి ప్రేమించడం లేదా? సాక్షితో అలా అనేశాడేంటీ?
Minister RK Roja: రోజాను సన్మానించిన జబర్దస్త్ టీం - పాత, కొత్త ఆర్టిస్టులతో సందడి!
PreDiabetes: ప్రీడయాబెటిస్ స్టేజ్లో ఉన్న యువతలో గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, తేల్చిన అంతర్జాతీయ అధ్యయనం
Icecream Headache: ఐస్క్రీము తలనొప్పి గురించి తెలుసా? ఎంతో మందికి ఉన్న సమస్యా ఇది
Weather Updates: ఏపీలో మరో 4 రోజులు వానలే! తెలంగాణలో నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన
Satya Sai Trust: సత్యసాయి జిల్లాలో కబ్జాల పర్వం- ఉజ్వల్ ఫౌండేషన్ అక్రమాలపై త్రిసభ్య కమిటీ విచారణ