F3 Release Postoponed: బాక్సాఫీస్ బరిలో 'ఆచార్య' - 'ఎఫ్ 3' మధ్య క్లాష్ తప్పింది! ఓ నెల వెనక్కి వెళ్ళిన వెంకటేష్ - వరుణ్ తేజ్ సినిమా

'ఎఫ్ 3' సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది. ఈసారి ఓ నెల వెనక్కి వెళ్ళింది. మండు వేసవిలో వినోదం అందించడానికి రెడీ అవుతోంది యూనిట్. 

FOLLOW US: 

విక్టరీ వెంకటేష్ (Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. మొన్న ఆ మధ్య ప్రకటించినట్టు ఈ సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. విడుదల వాయిదా పడింది. సినిమా ఓ నెల వెనక్కి వెళ్ళింది. మే 27 (F3 Movie ON MAY 27th) న విడుదల చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వెల్లడించింది. దాంతో 'ఆచార్య', 'ఎఫ్ 3' సినిమాల మధ్య క్లాష్ (Release Dates Clash Avoided Between Aacharya and F3 Movies) తప్పింది. 'ఆచార్య' ఏప్రిల్ 29న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

"పిల్లలు పరీక్షలు ముగించుకోండి... పెద్దలు సమ్మర్ సందడికి తయారుకండి. ఫన్ పిక్నిక్ కి డేట్ ఫిక్స్ చేశాం" అంటూ కొత్త విడుదల తేదీని ప్రకటించారు. 'ఎఫ్ 2'లో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ 'ఎఫ్ 3'లో కూడా కంటిన్యూ అవుతాయి. 'ఎఫ్ 2'లో కథంతా పెళ్ళాం, ప్రియురాలు చుట్టూ తిరిగితే... 'ఎఫ్ 3'లో కథంతా డబ్బు చుట్టూ తిరుగుతుంది.

View this post on Instagram
 
A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations)

వెంకటేష్ సరసన తమన్నా (Tamannaah), వరుణ్ తేజ్ జోడీగా మెహరీన్ కౌర్ (Mehreen Kaur), మరో కథానాయికగా సోనాల్ చౌహన్... ఇతర ప్రధాన పాత్రల్లో రాజేంద్ర ప్రసాద్, సునీల్ నటిస్తున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప‌తాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆల్రెడీ 'లబ్ డబ్ లబ్...' సాంగ్ రిలీజ్ చేశారు. 'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు... ఎవడు కనిపెట్టాడో గానీ దీన్ని అబ్బో! క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో... పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో' అంటూ సాగిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రామ్ మిరియాల ఆలపించారు.

Also Read: 'ఎల్లమ్మా' - పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్'లో కొత్త పాట! పాడింది ఎవరో తెలుసా?

Also Read: పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బు - 'ఎఫ్ 3'లో సాంగ్ చూశారా?

Published at : 14 Feb 2022 10:48 AM (IST) Tags: Venkatesh Varun tej F3 Movie ON MAY 27th F3 Release Postoponed Again F3 Latest Release Date F3 Postponed From April 28th To May 27th

సంబంధిత కథనాలు

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Emilia Clarke: ఔను, అది నిజమే! ‘GoT’ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ‘డ్రాగన్ క్వీన్’ ఎమీలియా క్లార్క్!

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Puri Jagannadh : చీప్‌గా వాగొద్దు - బండ్ల గణేష్‌కు పూరి జగన్నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Madhavan Gets Trolled: సైన్స్ గురించి తెలియకపోతే నోరు మూసుకో - మాధవన్ మీద మండిపడుతున్న నెటిజన్లు

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Kaduva Telugu Movie Teaser: వేట కోసం కాచుకున్న చిరుతలా ఒరిజినల్ 'డానియల్ శేఖర్' - 'కడువా'తో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్న పృథ్వీరాజ్ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

Ranga Ranga Vaibhavanga Teaser: బటర్ ఫ్లై కిస్ చూశారు, టీజర్ చూస్తారా? - వైష్ణవ్ తేజ్, కేతిక జోడీ రెడీ 

టాప్ స్టోరీస్

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

Atmakur Bypoll Results 2022: ఆత్మకూరులో నేడే కౌంటింగ్, మరికొన్ని గంటల్లో ఫలితం - భారీ మెజార్టీపై విక్రమ్ రెడ్డి దీమా !

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

DA Hike In July: జులైలో పెరగనున్న జీతాలు! సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం!!

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Amaravati Lands: అమరావతి భూములు కొంటారా ? ఎకరం పది కోట్లే  !

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ

Weather Updates: నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడతాయని హెచ్చరిక - తెలుగు రాష్ట్రాలకు ఎల్లో అలర్ట్ జారీ