By: ABP Desam | Updated at : 07 Feb 2022 04:08 PM (IST)
వెంకటేష్, వరుణ్ తేజ్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. గతంలో వీళ్ళిద్దరూ 'ఎఫ్ 2'లో నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాకు ఇది సీక్వెల్ కాదు గానీ ఫ్రాంచైజీ అనొచ్చు. అందులో హీరోస్ క్యారెక్టరైజేషన్స్ ఇందులో కూడా కంటిన్యూ అవుతాయి. 'ఎఫ్ 2'లో కథంతా పెళ్ళాం, గాళ్ ఫ్రెండ్, హీరోల చుట్టూ తిరిగితే... 'ఎఫ్ 3'లో డబ్బు చుట్టూ తిరుగుతుంది. అందుకని, సినిమాలో డబ్బు మీద రూపొందించిన పాటను విడుదల చేశారు.
'లబ్ డబ్ లబ్ డబ్ డబ్బు... ఎవడు కనిపెట్టాడో గానీ దీన్ని అబ్బో!క్యాష్ లేని లైఫ్ కష్టాల బాత్ టబ్బో... పైసా ఉంటే లోకమంతా పెద్ద డాన్స్ క్లబ్బో' అంటూ సాగిన ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతంలో రామ్ మిరియాల ఆలపించారు.
తమన్నా, మెహరీన్ కౌర్, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా... రాజేంద్ర ప్రసాద్, సునీల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సినిమా విడుదలవుతుంది.
My fav track from the movie..
Rocking composition @ThisIsDSP
Here’s #LabDabLabDabDabboo
▶️https://t.co/yb3xe93WpL#F3Movie @VenkyMama @tamannaahspeaks @Mehreenpirzada @sonalchauhan7 @AnilRavipudi @bhaskarabhatla @Ram_Miriyala @SVC_official pic.twitter.com/TGgkseEY48 — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) February 7, 2022
అప్పట్లోనే టూపీస్ బికినీ - అప్పుడు ఎంతో కష్టపడ్డాం, మాధవికి రాధ ప్రశంసలు
ఐదు లక్షల కోసం రాజమౌళి నన్ను అవమానించారు: నటి కాంచన
Guppedanta Manasu March 22nd: శ్రీవారికి ప్రేమగా వండి వడ్డించిన వసుధార, తాళి గురించి కొనసాగుతున్న రచ్చ
నరేష్ నిత్య పెళ్లి కొడుకు - రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలకు అంతా గొల్లున నవ్వేశారు!
Nani Eating Vada Pav: ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!
Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు
Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు
Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి
Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా