Prabhas Kriti Sanon: ప్రభాస్ ప్రేమలో కృతి సనన్ - గుట్టురట్టు చేసిన వరుణ్ ధావన్, ఆందోళనలో అనుష్క ఫ్యాన్స్!
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ‘భేడియా’ సినిమా ప్రచారంలో భాగంగా వీరు ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ప్రభాస్, కృతి రిలేషన్షిప్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు.
ప్రభాస్.. వరుస భారీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉన్నారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’తోపాటు దర్శకుడు మారుతీ మూవీలో కూడా నటిస్తున్నారు. ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆదిపురుష్’. ఈ సినిమాలో ప్రభాస్.. రాముడి పాత్రలో కనిపించనుండగా సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్ కనిపించనుంది. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ‘సమ్‌థింగ్ సమ్‌థింగ్’ నడుస్తోందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే.. ఇటీవల ‘ఆదిపురుష్’ సినిమా టీజర్ రిలీజ్ సమయంలో వేదికపై కృతి సనన్ పట్ల ప్రభాస్ చూపించిన కేరింగ్, వారిద్దరి మధ్య బాండింగ్ చూసిన పబ్లిక్.. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని అనుకుంటున్నారు. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కృతి నటించిన ‘భేడియా’ సినిమాలో హీరో వరుణ్ ధావన్ కూడా ప్రభాస్, కృతి ప్రేమలో ఉన్నట్టు పరోక్షంగా హింట్ ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ వార్త అనుష్క శెట్టి అభిమానులను బాగా హర్ట్ చేస్తోంది. ప్రభాస్‌ను వదిలేయమంటూ కృతి సనన్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన ‘భేడియా’ సినిమా ప్రచారంలో భాగంగా వీరు ఓ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ ప్రభాస్, కృతి రిలేషన్షిప్ గురించి ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా కరణ్ జోహార్.. వరణ్ ధావన్‌ను ఓ ప్రశ్న అడిగారు. మీరు చెప్పిన పేర్లలో కృతి సనన్ పేరు ఎందుకు లేదు అని ప్రశ్నించగా.. ‘‘ఆమె పేరు ఇప్పుడు ఇంకొకరి మనసులో ఉంది’’ అని చెప్పాడు. ఎవరా వ్యక్తి అని కరణ్ అడిగితే.. ‘‘ఆ వ్యక్తి ముంబైలో ఉండడు. అతను ఇప్పుడు ప్రియాంక చోప్రాతో షూటింగ్ లో ఉన్నాడు’’ అని బదులిచ్చాడు వరుణ్. ప్రభాస్ ప్రస్తుతం ప్రియాంక చోప్రాతో ‘ప్రాజెక్టు కె’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. వరుణ్ మాటలతో ప్రభాస్, కృతిల ప్రేమ వ్యవహారం పై మరింత బజ్ ఏర్పడింది.
‘ఆదిపురుష్’ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్.. కృతి సనన్ కు ప్రపోజ్ చేశాడని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వీరు ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇటీవల విడుదలైన ‘ఆదిపురుష్’ టీజర్‌లో గ్రాఫిక్స్ మాట ఎలా ఉన్నా.. సీతారాములుగా కనిపించిన ప్రభాస్, కృతి సనన్ జంట చాలా బాగుందనే టాక్ నడుస్తోంది. అయితే ఈ జంటను బిగ్ స్క్రీన్ మీద చూడాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది. ఎందుకంటే ఈ మూవీ టీమ్ ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్‌ను మార్చే పనిలో ఉన్నారు. విఎఫ్ ఎక్స్, యానిమేషన్ వర్క్స పై మరింత దృష్టి పెట్టారు. అందుకే సినిమా విడుదల తేదీని కూడా వాయిదా వేశారని ప్రచారం జరుగుతోంది. మరో వైపు తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తోన్న ‘హనుమాన్’ సినిమా టీజర్ ను ‘ఆదిపురుష్’ టీజర్ గ్రాఫిక్స్ తో పోలుస్తూ దర్శకుడు ఓమ్ రౌత్ ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. అయితే గ్రాఫిక్స్ లో మార్పులు చేసిన తర్వాత ‘ఆదిపురుష్’ సినిమా ప్రేక్షకులను ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Read Also: రష్మికపై బ్యాన్, ఇక ఆమె సినిమాలు కూడా విడుదలకావట!