By: ABP Desam | Updated at : 26 Feb 2022 05:10 PM (IST)
బిగ్ బాస్ నాన్ స్టాప్, ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ లేనట్లే(Photo credit: Hotstar)
బిగ్ బాస్ ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి ఈ షో అయిపోయింది. ఈరోజు నుంచి డిస్నీ హాట్ స్టార్ లో ఈ షో ప్రసారం కానుంది. ఓటీటీ వెర్షన్ కి కూడా హోస్ట్ గా నాగార్జుననే వ్యవహరించనున్నారు. హాట్ స్టార్ లో నాన్ స్టాప్ గా ఈ షో ప్రసారం కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ కి వెళ్లే కంటెస్టెంట్స్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చింది. గత సీజన్లలో కనిపించిన పాత కంటెస్టెంట్స్ తో పాటు కొత్తవాళ్లను కూడా తీసుకోబోతున్నారు.
ఇప్పటికే క్వారెంటైన్ పూర్తి చేసుకున్న కంటెస్టెంట్లు కాసేపట్లో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కానున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొనే ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లేనంటూ ఓ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ లిస్ట్ లో ఎవరి పేర్లు ఉన్నాయంటే..?
1. అరియానా
2. యాంకర్ శివ
3. అఖిల్ సార్థక్
4. సరయు
5. తేజస్వి మదివాడ
6. మహేష్ విట్టా
7. అషు రెడ్డి ఫస్ట్ ఎంట్రీ
8. హమీదా
9. నటరాజ్ మాస్టర్
10. నిఖిల్
11. మిత్రా శర్మ
12. ముమైత్ ఖాన్
13. ఆర్జే చైతు
14. శ్రీ రాపాక
15. అనిల్ రాథోడ్
16. అజయ్ కతుర్వార్
17. బిందు మాదవి
ఈ సీజన్ లో ఆదర్శ్, తనీష్ ఉంటారని జోరుగా ప్రచారం జరిగింది. కానీ వారిద్దరూ లేరని తెలుస్తోంది. అలానే అఖిల్ సార్థక్ కి కూడా మల్లెమాల సంస్థతో కమిట్మెంట్స్ ఉన్నాయి. మరి ఆయన షోలో కనిపిస్తారో లేదో చూడాలి. ఇక ఈసారి సీక్రెట్ రూమ్ కాన్సెప్ట్ కూడా లేనట్లే. అందరి కంటెస్టెంట్స్ ను ఒకేసారి హౌస్ లోకి పంపించనున్నారు. అయితే ఒకట్రెండు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది.
ఇక ఈరోజు టెలికాస్ట్ కాబోయే షోకి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున నేరుగా హౌస్ లోకి వెళ్లి కన్ఫెషన్ రూమ్ లో కూర్చొని కనిపించారు. హౌస్ రెయిన్ బో లాగా చాలా కలర్‌ఫుల్‌గా ఉందని, ఇక్కడి నుంచే హౌస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటుండగా.. నాగార్జున ఇది నా అడ్డా అంటూ బిగ్‌బాస్ సమాధానం చెబుతారు. ఇక కంటెస్టెంట్లను హౌస్ లోపలికి పంపే క్రమంలో నాగార్జున అడిగే ప్రశ్నలు ఆకట్టుకుంటున్నాయి.
💥Hello hello hello💥
— Nagarjuna Akkineni (@iamnagarjuna) February 26, 2022
Inka konni Ghantallo
24/7 #BiggBossNonStop entertainment shuru!!!
Be ready for a nonstop FUNtastic ride 😃😀😀
@disneyplushotstar @endemolshineind #DisneyPlusHSTel
👉 https://t.co/SE5m8w0QjD
#BiggBossNonStop fans ready ikkada!!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) February 26, 2022
🎉🎉🎉
The grand extravaganza coming to your screens at 6 PM! #Biggboss #disneyplushotstar @DisneyPlusHS @EndemolShineIND @iamnagarjuna https://t.co/4VJAOpdpoW
Mahesh Babu: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?
Jabardasth: స్టార్ కమెడియన్స్ 'జబర్దస్త్'ను వదిలేశారా?
Shekar Movie : జీవిత, రాజశేఖర్ కు భారీ షాక్, శేఖర్ సినిమా ప్రదర్శన నిలిపివేత
BuchiBabu: బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ఎన్టీఆర్ ని నమ్ముకొని తప్పు చేస్తున్నాడా?
Bigg Boss Non-Stop Winner Prize Money: బిగ్ బాస్ ఓటీటీ విన్నర్ - ప్రైజ్ మనీ ఎంత గెలుచుకుందంటే?
CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్
Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!
Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?
Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా