By: ABP Desam | Updated at : 27 Jun 2022 03:59 PM (IST)
బోయపాటితో రామ్ సినిమా - ఆ వార్తల్లో నిజం లేనట్లే
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో 'వారియర్' అనే సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. వచ్చే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో కృతిశెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా తరువాత బోయపాటి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు రామ్.
దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. శ్రీనివాసా చిట్టూరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆగస్టులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి సంబంధించిన రెండు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. తమిళ స్టార్ శివ కార్తికేయన్ ఈ సినిమాలో నటిస్తున్నాడనేది ఒక వార్త కాగా.. కథ ప్రకారం రామ్.. బాలయ్య ఫ్యాన్ గా కనిపించబోతున్నాడనేది మరో వార్త.
ఈ రెండు కేవలం రూమర్స్ మాత్రమేనని చిత్రబృందంలో కొందరు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇక సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. ఒక హీరోయిన్ ను బాలీవుడ్ నుంచి దిగుమతి చేయబోతున్నారు. టాలీవుడ్ నుంచి మరో హీరోయిన్ ను తీసుకోబోతున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.
Tollywood: విజయ్ కోసం ఎగబడుతున్న జనాలు - అలియాభట్ ఇన్స్టాగ్రామ్ సంపాదన!
NTR30: ఎన్టీఆర్ సినిమాలో కృతిశెట్టి - క్లారిటీ వచ్చేసింది!
Bimbisara: 'బింబిసార' సినిమాను రిజెక్ట్ చేసిన రవితేజ?
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్
NTR: భుజం నొప్పితో బాధపడుతోన్న ఎన్టీఆర్ - రెండు నెలల పాటు రెస్ట్!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!