Rashmi Gautam: రష్మీ ఎందుకు ఏడ్చింది? ఆమె ప్రేమించింది ఎవర్ని?
Rashmi Gautam Gets Emotional and Cries on Extra Jabardasth, Watch Latest Promo: స్టార్ యాంకర్, హీరోయిన్ రష్మీ గౌతమ్ ఎమోషనల్ అయ్యారు. షోలో ఏడ్చారు. ఎందుకు? ఆమె కన్నీళ్లకు కారణం ఎవరు?
యాంకర్ రష్మీ గౌతమ్ మనసు సున్నితమైనది. మనుషులు, మూగ జీవాలు అంటే ఆమెకు ఎంతో ప్రేమ. 'ఎక్స్ట్రా జబర్దస్త్' షోలో గానీ, 'ఢీ' షోలో గానీ ఎవరైనా వృద్ధులు, ముఖ్యంగా మహిళలు, మూగ జీవాలు పడుతున్న ఇబ్బందులు, బాధల గురించి స్కిట్స్ చేస్తే ఎమోషనల్ అవుతారు. గతంలో రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చూశాం. అయితే... ఇప్పుడు లేటెస్ట్ గా విడుదలైన 'ఎక్స్ట్రా జబర్దస్త్' ప్రోమో చూస్తే, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణం ఎవరు? అనే ప్రశ్న రాక మానదు. ఎందుకు? ఏమిటి? అనే అసలు వివరాల్లోకి వెళితే...
'ఎక్స్ట్రా జబర్దస్త్'లో టీమ్ లీడర్ రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్టు స్కిట్స్ చేస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఏముందన్నది పక్కన పెడితే... వచ్చే వారం టెలికాస్ట్ కాబోయే ఎపిసోడ్‌లో అబ్బాయి నుంచి అమ్మాయి ఏం కోరుకుంటుంది? అనే కాన్సెప్ట్ తీసుకుని స్కిట్ చేశారు. అందులో భాగంగా 'వచ్చినోళ్ళు అందరూ నీకు అది ఉన్నదా? ఇది ఉన్నదా? అని అడిగిండ్రు గానీ... నేను ఏ రోజైనా నువ్ ఏం సంపాదిస్తావ్? అని ఒక్క మాట అయినా అడిగానా! నాకు కావాల్సింది... నీ వెనకాల ఏమున్నది? ఏం సంపాయించినావ్? అనేది కాదు. నా జీవితాంతం నువ్ ఉంటే నాకు అదే చాలు' అని జోర్దార్ సుజాత డైలాగ్ చెప్పారు. ఆ మాటలకు రష్మీ గౌతమ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
'ఎక్స్ట్రా జబర్దస్త్', 'ఢీ' షోల్లో సుధీర్, రష్మీ మధ్య సంథింగ్ సంథింగ్ అన్నట్టు స్కిట్స్ ఉంటాయి. కానీ, నిజ జీవితంలో వాళ్ళ దారులు వేరని... సుధీర్ ఇంట్లో పెళ్లికి సంబంధాలు చూస్తున్నారని ఇద్దరు ముగ్గురు చెప్పారు. నిజ జీవితంలో రష్మీ ఒంటరి అని ఆమె గురించి తెలిసిన వారు చెబుతారు. నిజ జీవితంలో రష్మీ గౌతమ్ ప్రేమించింది ఎవర్ని? రాకేష్ స్కిట్ చూశాక ఆమె ఎందుకు ఏడ్చింది? ఎందుకు కన్నీళ్లను ఆపలేకపోయింది? అని కొంత మందికి సందేహం కలుగుతోంది. మరి కొంత మంది రేటింగ్ కోసమే రష్మీ అలా చేస్తుందని విమరిస్తున్నారు కూడా!
'రేటింగ్ తగ్గుతుంది అన్నప్పుడల్లా ఏడవడం మామూలే' అని ఒకరు కామెంట్ చేస్తే... 'ఇదే రాకేష్, అదే రోహిణితో చేశాడు. అప్పుడు రష్మీ ఏడ్చింది. మళ్ళీ ఇప్పుడు సుజాత... మళ్ళీ ఏడుస్తుంది' అని ఇంకొకరు, 'లాస్ట్ లో రష్మీ ఏడుపు కిడ్నీ టచింగ్ పెర్ఫార్మన్స్' అని మరొకరు యూట్యూబ్‌లో కామెంట్స్ చేశారు. రష్మీది ఓవర్ యాక్టింగ్ అని ఒకరు కామెంట్ చేశారు. ఎన్నిసార్లు ఇటువంటి ఏడుపు ట్రాక్స్ అని ఒక నెటిజన్ ప్రశ్నించారు. కామెడీ చేయమంటే ఏడుస్తున్నారని, ఇదెక్కడి దరిద్రమని ఇంకొకరు కామెంట్ చేశారు.
Also Read: శ్రీరామనవమికి ప్రభాస్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా! ఆ రోజు 'ఆదిపురుష్' అప్‌డేట్ ఏంటంటే?